మోదీతో మ్యాచ్ లో గోల్స్ చేస్తున్నాడా? సెల్ఫ్ గోల్సా?

Publish Date:Nov 16, 2016

Advertisement

 

కొన్ని సార్లు  ప్రత్యర్థి మరీ బలవంతుడు, తెలివైన వాడూ అయితే పెద్ద పెద్ద యోధులు కూడా షాక్ కొట్టినట్టు అనూహ్యంగా తప్పులో కాలేసేస్తుంటారు. మోదీ విషయంలో కేజ్రీవాల్ ప్రవర్తన అలాగే వుంది. దేశ రాజధానిలో కమలాన్ని వికసించనీయకుండా రాత్రికి రాత్రి హీరో అయ్యాడు అరవింద్. కాని, పోను పోను అదే రీతిలో డౌన్ కూడా అయిపోతున్నాడు. మోదీపై పోరు విషయంలో ఒక దాని తరువాత ఒకటి తప్పు చేస్తూ పోతున్నాడు. 


మోదీ, అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరూ భారీ విజయాలు సాధించిన వారే. అయితే, కేజ్రీవాల్ కన్నా మోదీ అనుభవం, నేపథ్యం చాలా పెద్దది. ఆయన ఆరెస్సెస్ లాంటి సముద్రంలో ఈదాడు, బీజేపిలో అంచెలంచెలుగా ఎదిగాడు, గుజరాత్ ను తిరుగు లేకుండా పాలించాడు. ఫైనల్ గా ఎందరు తల కిందులు తపస్సు  చేసిన దేశ ప్రధాని అయ్యాడు. కాని, అరవింద్ కేజ్రీవాల్ అన్నా హజారే ప్రభంజనంలో తెలివిగా లాభపడ్డాడు. మొత్తం దేశాన్ని ఏలేద్దామని తొందరపడ్డాడు. ఢిల్లీని కాదని వారణాసిలో భంగపడ్డాడు. మళ్లీ తిరిగొచ్చి జనం ముందు అద్భుతంగా పాసయ్యాడు. కాని, ఇప్పుడూ మళ్లీ అదే తప్పు చేస్తున్నాడు. మోదీ మీద కాన్సన్ ట్రేషన్ తో అసలుకే మోసం తెచ్చుకుంటున్నాడు. అందుకు నోట్ల రద్దు వ్యవహారమే తాజా ఉదాహరణ... 


అరవింద్ కేజ్రీవాల్ కి , ఆయన్ని అభిమానించే వారికి నచ్చకపోయినా మోదీ ప్రై మినిస్టర్ అన్నది నిజం. కేజ్రీవాల్ పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కూడా లేని ఢిల్లీకి సీఎం. ఇది కూడా సత్యమే! కాని, ఏకే ఆ తేడాని మరిచిపోయి తహతహలాడుతుంటాడు. దేశంలో కేసీఆర్, చంద్రబాబు లాంటి ముప్పై మంది సీఎంలు వున్నారు. వాళ్లెవరూ తమ అసెంబ్లీలలో 500, 1000 నోట్ల రద్దుపై తీర్మానం చేయలేదు. ఎందుకని? ఈ ప్రశ్న వేసుకోకపోవటమే కేజ్రీవాల్ ఆవేశానికి కారణం! డిల్లీలో కేజ్రీ ఓ తీర్మానం చేసేశాడు. నోట్ల రద్దుపై రాష్ట్రపతికి కంప్లైంట్ కూడా చేశాడు. దీని ద్వారా ఆయన అత్యధిక జనానికి ఇవ్వదలుచుకున్న సంకేతం ఏంటి? నల్లధనం, అవినీతి అంటూ అధికారంలోకి వచ్చిన ఆయన ఇవాళ్ల మోదీ బ్లాక్ మనీకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే తప్పుబడుతున్నాడు. అంతకంటే దారుణం... దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు! ఇప్పుడు ఏటీఎంలు, బ్యాంక్ ల ముందు బిజీగా వున్న జనం ఇదంతా పట్టించుకోకపోవచ్చు కాని... కొంత చిల్లర చేతుల్లో పడ్డాక అరవింద్ చేసిన పనుల గురించి ఆలోచిస్తారు. ఊరికే నోట్ల రద్దుని కుంభకోణం అనటం, పాత నోట్లే మళ్లీ కావాలని అనటం... ఇవన్నీ ఢిల్లీ సీఎం తనని తాను నల్ల ధనం పోగేసిన వారి తరుఫున నిలబెట్టుకోవటమే అవుతుంది. అంతే తప్ప ఆమ్ ఆద్మీకి ఇలాంటి మోదీ వ్యతిరేక పోరాటం వల్ల లాభం వుండదు!


అరవింద్ కేజ్రీవాల్ మోదీని వ్యతిరేకించ కూడదా? నిమ్మకు నీరెత్తినట్టు వుండిపోవాలా? అస్సలు కాదు. కేజ్రీవాల్ అయినా, రాహుల్ గాందీ అయినా, మమత, ఏచూరీ ఎవరైనా ప్రధానికి వ్యతిరేకంగా మాట్లాడవచ్చు. కాని, అది చేసే క్రమంలో సోషల్ మీడియా వచ్చేసి బాగా తెలివి మీరిపోయిన జనంలో తప్పుడు సంకేతాలు పంపకూడదు. కొత్త నోట్లు లేక జనం ఇబ్బంది పడుతున్నారన్నదే ముఖ్యం తప్ప పాత నోట్లు మళ్లీ కావాలని అనటం హాస్యప్పదం. అసలు పాత 500, 1000 నోట్లు తిరిగి చెలామణి కావాలని మామూలు జనం ఎవ్వరూ కోరటం లేదు. ఏటీఎంలు, బ్యాంక్ ల వద్ద క్యూ లైన్ల బాధ తప్పితే చాలనుకుంటున్నారు. అంతే కాదు, ఇలా ఇంకో రెండ్రోజులు ఇబ్బంది పడ్డా నల్లధనం పీడ విరగడ కావాలని, మోదీ అందు కోసం ప్రయత్నిస్తున్నారని అనుకుంటున్నారు. ఒకవేళ మోదీ ఉద్దేశ్యం అది కాక బడా కార్పోరేట్లకు లబ్ధి చేయటం అయితే దాన్ని సమర్థంగా నిరూపించాలి. కాని, అరవింద్ కేజ్రీవాల్ రోజుకో ఘాటు వ్యాఖ్యతో మోదీపై కసి తీర్చుకుంటున్నాడు తప్ప సామాన్య జనానికి పెద్దగా దగ్గరవటం లేదు. వాళ్లు క్యూ లైన్లలో బాధపడుతుంటే ఈయన మోదీ ఎప్పుడో గుజరాత్ సీఎంగా 25కోట్లు లంచం తీసుకున్నాడని అర్తం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నాడు! మోదీపై అవినీతి ఆరోపణలు, ఆయన భార్య గురించి కామెంట్స్, తల్లి గురించి వెటకారాలు, 2002 అల్లర్ల విషయంలో సుప్రీమ్  తీర్పునే తప్పుబట్టడం, ఆయన వేసుకున్న కోటు ఖరీదు, ఇక మొన్నటికి మొన్న జరిగిన సర్జికల్ స్రైక్స్ కి సాక్ష్యాలు అడగటం... ఇవన్నీ ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాయని ఆల్రెడీ చాలా సార్లు ప్రూవ్ అయింది. కాని, ఆమ్ ఆద్మీ వారికి అర్థమైనట్లు లేదు... పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలే జ్ఞానోదయం చేయాలి... 


 

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.