ఆరుద్ర వర్ధంతి
Publish Date:Jun 4, 2013
Advertisement
ఆయన కలం నుండి జాలువారే ప్రతీ అక్షరం ఓ ఆణిముత్యం.. తన అద్భుతమైన ప్రతిభతో యావత్ సినీరంగాన్నే అబ్బురపరచారాయన.. మనసుకు హత్తుకునే భావాల్ని అతిసాదారణ పదాల్లో నిల్పిన పదశిల్పి ఆయన.. కమర్షియల్ పాటకు సైతం ధిక్కార స్వరం నేర్పిన ఆయనే సినీకవి ఆరుద్ర. ఈరోజు ఆరుద్ర వర్ధంతి సందర్బంగా ఆ మహా రచయితను ఓ సారి గుర్తు చేసుకుందాం.. సామాన్యంగా నటులను, దర్శకులను బట్టి ప్రేక్షకులు, సినిమాలను చూస్తారు. కాని రచయితనుబట్టి సినిమా చూసే స్థాయిని కల్పించింది ఆరుద్ర... మామూలు పదాలతో బరువైన భావాల్ని పలికించి శ్రోతలను రంజిప చేసిన నేర్పరి ఆరుద్ర. ఆరుద్రగా సినీరంగ ప్రవేశం చేసిన భాగవతుల సదాశివ శంకర శాస్త్రీ 1925వ సంవత్సరం ఆగస్టు 31న జన్మించారు. చిన్నప్పటి నుండి సాహిత్యం మీద ఉన్న ఇష్టంతో ఆ దిశగా అడుగులు వేశారు.. 1949లో విడుదలైన బీదల పాట్లు సినిమాతో పాటలరచయితగా పరిచయమయ్యాడు ఆరుద్ర. ఆరుద్ర రచించిన పాటలలో ఎక్కువగా ఆభ్యుదయ భావజాలం ఉండటం వలన శ్రీ శ్రీ తరువాత యువత ఎక్కువగా ఆయనే కీర్తిని సంపాదించారు.. చిన్ని చిన్ని పదాలతో స్పష్టమైన భావాన్ని పలికించడంలో ఆరుద్ర ఘనాపాటి. తెలుగు పాటను ఆస్వాదించి.. అందరి మనసులను దోచుకున్న ఈ కవి ఎన్ని అవార్డులను ఇచ్చి సత్కరించినా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఆయన సినీ పరిశ్రమకు అందించిన సేవలు మరువలేనివి. విశాఖ పట్నంలో జన్మించిన ఆరుధ్ర విజయనగరం జిల్లాలో ఉన్నత విధ్యను పూర్తి చేశారు.. రచనల పట్ల ఆసక్తి ఉన్న ఆయన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ లో ఉద్యోగం వదులుకొని ఆనందవాణి అనే పత్రికకు సంపాదకునిగా జాయిన్ అయ్యారు.. ఆ పత్రికలో శ్రీశ్రీతో పాటు ఆరుద్ర రాసిన కవితలు సంచలనం సృష్టించాయి.. తరువాత అభ్యుదయ రచయితల సంఘం స్థాపించిన ప్రముఖుల్లో ఒకరు ఆరుద్ర.. తెలుగు పదాలకు ఎనలేని సేవ చేసిన ఆరుద్ర తొలి దశలో ఎన్నో కష్టాలను అనుభవించారు.. కొద్ది రోజులు తినడానికి తిండి కూడా లేక పానగల్ పార్క్ లో నీళ్లు తాగి కడుపు నింపుకున్నారు.. ఈ కష్టాలేవి ఆయన సాహితీ ప్రస్థానానికి అడ్డు రాలేదు.. త్వమేవాహంతో మొదలు పెట్టి.. వందలాదిగా గేయాలు, గేయనాటికలు,కథలు, నవలలు, సాహిత్య పరిశోదక వ్యాసాలు, వ్యంగ వ్యాసాలు, పుస్తకాలపై విమర్శలు ఇలా ఆయన చేయని రచనా ప్రకియే లేదు. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలకు గాను 1985లో ఆంద్రవిశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతో పాటు గైరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ఇలా తెలుగు సాహిత్యాన్ని తన వంతు బాధ్యతగా అభ్యుదయం వైపు అడుగులు వేయించిన ఆరుధ్ర 1998 జూన్ 4న తుది శ్వాస విడిచారు.. ఆయన ఈ లోకాన్ని విడిచినా ఆయన రచనలు, కవితలు, పాటల ద్వారా ఎప్పటికీ మన మధ్యే ఉంటారు.. ఈ సంధర్భంగా ఆ మహారచయితకు మరోసారి నివాళులర్పిద్దాం..
కేవలం సాహితీ రంగానికే కాదు తెలుగు సినీ రంగానికి కూడా ఆయన చేసిన సేవలు ఎనలేనివి.. 1949లో మొదలైన ఆయన సినీ ప్రస్థానంలో నాలుగు వేలకు పైగా పాటలు రాశాలు.. వీటిలో ఆయన మార్క్ అభ్యదయ గీతాలతో పాటు భక్తి గీతాలు, విరహ గీతాలు, ప్రేమ పాటలు కూడా ఉన్నాయి..
http://www.teluguone.com/news/content/arudra-vardhanti-special-32-23355.html
హాయిగా నవ్వుకునే టిట్ బిట్స్ వున్న ఫన్ బక్కెట్ కామెడీ పదమూడో ఎపిసోడ్‌ని ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయండి..
మొన్నీమధ్య విడుదలైన గోపీచంద్ ‘సౌఖ్యం’ సినిమా మీద మన సక్కుబాయి రివ్యూ ఏమిటో చూసేద్దామా?
డిసెంబర్ 27, 2015 నుంచి జనవరి 02, 2016 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ రెండు నిమిషాల నిడివి వున్న ఫన్ బక్కెట్ పన్నెండో కాపీ చూడండి.. మీకు నచ్చి తీరుతుంది. మాదీ గ్యారంటీ..
2015 సంవత్సరంలో టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచిన సినిమాలు ఏవో ఈ వీడియోలో చూస్తే క్లియర్‌గా తెలుస్తుంది.
క్రీడాకారుల జీవిత కథలతో రూపొందించిన బాలీవుడ్ సినిమాలు ఘన విజయాలు సాధిస్తున్నాయి. ‘భాగ్ మిల్కా భాగ్’, ‘మేరీకోం’ సినిమాలు దీనికి ఉదాహరణలు. ఆ సినిమాల స్ఫూర్తితోనే అజారుద్దీన్, మహేంద్రసింగ్ ధోనీ జీవిత కథల ఆధారంగా కూడా సినిమాలు రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో అందాల క్రీడాకారిణి
2015 సంవత్సరంలో టాలీవుడ్‌లో టాప్ 10 ఫ్లాపులుగా మిగిలిన కళాఖండాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి చాలు.. ఫుల్లుగా క్లారిటీ వచ్చేస్తుంది.
టాలీవుడ్‌లో ఒక్కో ఏడాది కొంతమంది హీరోయిన్లు ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటూ వుంటారు. ఎవరి అకౌంట్లో ఎక్కువ ఫ్లాపులు పడితే వాళ్ళని ఐరన్ లెగ్స్ అనడం టాలీవుడ్‌లో మామూలే. మరి 2015లో ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటున్న హీరోయిన్లు ఎవరో చూద్దామా...
సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘భలే మంచి రోజు’ గురించి స్టార్ హీరో ప్రభాస్ ఏమంటున్నాడంటే...
ఈవారం అంటే... 20 డిసెంబర్, 2015 నుంచి 26 డిసెంబర్ 2015 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను క్లిక్ చేస్తే చాలు..
డిసెంబర్ 13వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు వివిధ రాశుల వారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో చూస్తే చాలు.
త్రిష అందంగా వుంటుంది.. ఇంకా చెప్పాలంటే సూపరుగా వుంటుంది. అయితే ఇప్పుడు త్రిషని అందరూ త్రిషా.. నువ్వు సూపరు అంటున్నారు. ఈ ప్రశంస ఆమె అందానికి సంబంధించినది కాదు.. ఆమె వ్యక్తిత్వానికి సంబంధించింది. అందాల నటిగా అందరి ప్రశంసలు అందుకోవడం మాత్రమే కాదు.. సమాజం పట్ల బాధ్యతగా కూడా వ్యవహరించే త్రిషను చాలామంది ఈ కోణంలో కూడా అభిమానిస్తూ వుంటారు. ఆమధ్య స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వీధులను ఊడ్చి స్ఫూర్తినిచ్చిన త్రిష అడపాదడపా సమాజ సేవా కార్యక్రమాల్లో
దర్శకుడు రాంగోపాల్ వర్మ అందరినీ మెప్పించగల సినిమాలు తీయడంలో విఫలమవుతున్నా, నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ఆకట్టుకోగలుగుతున్నారు. ఏ విషయంపైనైనా తనకు తోచినట్లు నిర్భయంగా చెప్పగలగడమే అతనికి చాలా పాపులారిటీ తెచ్చిపెట్టిందని చెప్పవచ్చును. అయితే ఆ పాపులారిటీ పెరుతున్న కొద్దీ అతను తన హద్దులను కూడా దాటిపోతున్నట్లు కనిపిస్తోంది. సహజ సిద్దమయిన కొన్ని సమాజ సూత్రాలను, నియమనిబంధనలను తనకు వర్తించవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.





