అరెస్టా.. విచారణా.. పేర్ని జయసుధ ముందున్న దారేది?

Publish Date:Dec 27, 2024

Advertisement

మాజీ మంత్రి ,  వైసీపీ కీలక నేత పేర్ని నాని  ఆయన కుటుంబం ఇంకా అజ్ఞాతంలోనే ఉంది. పేర్ని నాని సతీమణి జయసుధకు చెందిన గోడౌన్ లో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం మాయం సంఘటనలో ఆ కుటుంబంపై కేసు నమోదైన సంగతి తెలసందే. ఇందుకు సంబంధించి వాస్తవాల వెల్లడి విషయంలో పేర్ని నాని, ఆయన సతీమణి, కుమారుడు పూర్తిగా విఫలమయ్యారు.  పోలీసుల నోటీసులు అందగానే గంపగుత్తగా కుటుంబం మొత్తంఅజ్ణాతంలోకి వెళ్లిపోయింది. దీంతో ఈ కేసు విషయంలో పేర్ని నాని కుటుంబానిదే తప్పు అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది.  

జగన్ హయాంలోనూ, ఆ తరువాతా కూడా ఏ విషయంపైనైనా స్పందించడంలో, మీడియా ముందుకు వచ్చి వాగ్ధాటి ప్రదర్శించడంలో చురుకుగా ఉండే పేర్ని నాని.. తన కుటుంబంపై నమోదైన కేసు విషయంలో మాత్రం మౌనాన్ని ఆశ్రయిచడమే కాకుండా పోలీసుల నోటీసులకు సైతం స్పందించకుండా అజ్ణాతాన్ని ఆశ్రయించడమే ఆయన వైపే తప్పు ఉందన్న విషయాన్ని ఎత్తి చూపుతోందని పరిశీలకులు అంటున్నారు.  

ఇదిలా ఉంటే పేర్ని నాని కుటుంబానికి సంబంధించిన రేషన్‌ బియ్యం కేసులో మరో సంచలన విషయం వెలుగు చూసింది. మాయమైన రేషన బియ్యం బస్తాల సంఖ్య తొలుత వెలుగులోకి వచ్చిన దాని కంటే చాలా చాలా ఎక్కువ అన్న చర్చ జరుగుతోంది.  పేర్ని నాని సతీమణి పేరు మీద ఉన్న గోడౌన్‌ నుంచి  3,708 రేషన్‌ బియ్యం బస్తాలు మాయమయ్యాయని తొలుత అధికారులు తెలిపారు. ఆ తరువాత ఆ సంఖ్య తప్పు అంటూ సవరించి మాయమైన బియ్యం బస్తాల సంఖ్య   4,840 అని చెప్పారు.  అయితే  తాజాగా ఇప్పుడు జయసుధ గోడౌన్ నుంచి మాయమైన బియ్యం బస్తాల సంఖ్య   ఏకంగా 7,577 అని లెక్క తేల్చారు. గోడౌన్ నుంచి మాయమైన బియ్యం బస్తాల సంఖ్య ఎంతో తేల్చడానికి నెల రోజుల సమయం ఎందుకు పట్టిందంటూ వైసీపీ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గోడౌన్ నుంచి భారీగా బియ్యం అక్రమంగా తరలించారని చెప్పడం కోసమే అంత సమయం తీసుకున్నారంటూ విమర్శిస్తున్నారు. అయితే అధికార వర్గాలు మాత్రం ఇంత స్థాయిలో బియ్యం తరలించడం మామూలు విషయం కాదనీ,  పూర్తి స్థాయిలో లెక్కలు తేల్చడానికి ఆ మాత్రం సమయం పడుతుందనీ చెబుతున్నారు. బియ్యం బస్తాల మాయం విషయంలో అవాస్తవముంటే..  మాయమైన బియ్యానికి  పేర్ని నాని తాలూకు న్యాయవాది డీడీలు ఎందుకు చెల్లిస్తారని ప్రశ్నిస్తారు. 

ఇదంతా అలా ఉంచితే.. మరో వైపు పోలీసులు ఇచ్చిన నోటీసులపైన హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌ను పేర్ని నాని ఉపసంహరించుకున్నారు. కేసు జిల్లా కోర్టులో విచారణలో ఉంది. కేసు విచారణలో ఉండగా కేసుకు సంబంధించిన పలు అంశాలు తెరపైకి వస్తుండటం ఆసక్తి కరంగా మారింది.  గోడౌన్‌లో రేషన్‌ బియ్యం మాయమయ్యాయని పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధపై డిసెంబరు 10న పోలీసులు కేసు నమోదు చేశారు. నాటి నుంచి పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లింది. అంతే కాకుండా పేర్ని నాని జయసుధకు చెందిన గోడౌన్ నుంచి మాయమైన బియ్యం ఇప్పటికే   కాకినాడ పోర్టు నుంచి దేశం దాటేసిందంటూ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపణలు చేస్తున్నారు.  
వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా మంత్రిగా పనిచేసిన పేర్నినాని తన భార్య పేర్ని జయసుధ పేరిట రేషన్ డీలర్ షిప్ తీసుకున్నారు.   ప్రభుత్వం నుంచి తమకు పంపిణీ కోసం అందిన బియ్యాన్ని తమ కుటుంబానికే చెందిన గోడౌన్ లో భద్రపరిచేవారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో  అధికారం మారిన తరువాత  అదే గోడౌన్ లో ఉండాల్సిన  బియ్యం నిల్వలు మాయం అయినట్లు ఫిర్యాదు అందింది. దీనిపై కేసు నమోదు అయ్యింది.  ఈ కేసులో నిందితులుగా ఉన్న పేర్ని కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచినా వారు రాలేదు. అయినా పోలీసులు ఇప్పటి వరకూ వారినెవరినీ అరెస్టు చేయలేదు. ఈ లోగా పేర్ని జయసుధ ముందస్తు బెయిలు కోసం కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు వెలువరించిన తరువాత పోలీసులు తదుపరి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది.  ఇంత జరిగినా పేర్ని నాని కనీసం స్పందించక పోవడంతో బియ్యం బస్తాల మాయం విషయంలో ఆయన కుటుంబం ప్రమేయం ఉందన్న వాదనకు బలం చేకూరుతోంది.  అయిన దానికీ కాని దానికీ తెలుగుదేశం, జనసేనలపై నోరెట్టుకు పడిపోయే పేర్ని నాని.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో తన కుటుంబంపై కేసు నమోదైనా కిమ్మనకపోవడంతో ఆయన కుటుంబం తప్పిదం ఉందన్న సంగతిని పరోక్షంగా అంగీకరించేసినట్లేనని అంటున్నారు. పోలీసుల విచారణకు డుమ్మా కొట్టి మరీ ముందస్తు బెయిలు కోసం కోర్టును ఆశ్రయించినందున జయసుధకు కోర్టులో ఊరట దక్కే అవకాశాలు అంతంత మాత్రమేనని న్యాయ నిపుణులు అంటున్నారు.

ముందస్తు బెయిలు పిటిషన్ దాఖలు చేసిన ఆమె విచారణకు హాజరై ఉంటే కోర్టు అరెస్టు నుంచి మినహాయింపు ఇస్తూ ఆదేశాలు జారీ చేసి ఉండేదనీ, ఇప్పుడామె అజ్ణాతంలో ఉన్నందున కోర్టులో ఊరట లభించే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయనీ వివరిస్తున్నారు. కోర్టు అరెస్టు నుంచి తాత్కాలిక మినహాయింపు ఇచ్చినా కూడా విచారణకు హాజరై తీరాల్సిందేనని జయసుధకు ఆదేశాలు జారీ చేసే అవకాశాలే మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. 

By
en-us Political News

  
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
ఒక్క తెలంగాణ అని కాదు, ఏ రాష్ట్రంలోనైనా ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పారు. ఆ దిశగా ముందు.. తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమౌతున్నట్లు చెప్పారు.
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.