గవర్నర్ వద్దకు వైసీపీనేతల బృందం ఎందుకంటే?

Publish Date:Jun 27, 2025

Advertisement

జగన్ లో అరెస్టు భయం పీక్స్ కు చేరింది. జగన్ రెంటపాళ్ల పర్యటలో ఆయన కారు కింద పడి వైసీపీ కార్యకర్త మరణించిన సంఘటనపై జగన్ ఏ2గా కేసు నమోదైంది. ఆ కేసును కొట్టేయాలంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. జగన్ క్వాష్ పిటిషన్ పై కోర్టు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. విచారణను జులై 1కి వాయిదా వేసింది. అయితే కోర్టు విచారణను వాయిదా వేస్తూ జులై 1 వరకూ జగన్ పై ఎటువంటి చర్యలూ తీసుకోవద్దని పోలీసులను ఆశ్రయించింది. అంత మాత్రానికే కోర్టు జగన్ ను నిర్దోషిగా భావంచిందంటూ వైసీపీ నేతలూ, కార్యకర్తలూ అంటున్నారు. కానీ వాస్తవానికి ఈ కేసులో అరెస్టు తప్పదేమోనన్న భయం జగన్ లోనూ, ఆ పార్టీ నేతలలోనూ కనిపిస్తోంది. అందుకే  ఇంత కాలం లేనిది ఇప్పుడు హడావుడిగా వైసీపీ నేతల బృందం గవర్నర్ అబ్దుల్ నజీర్ ను  గురువారం (జూన్ 26)  కలిసి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తమపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందంటూ ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు, మండలిలో వైసీపీ పక్షనేత,   బొత్స సత్యనారాయణ నేతృత్వంలో వైసీపీ నేతలు  గవర్నర్ అబ్దుల్ నజీర్‌ని కలిశారు.  మాజీ సిఎం జగన్‌ పర్యటనలలో భద్రత కల్పించడం లేదని, ఆయనపై కూడా తప్పుడు కేసులు నమోదు చేస్తోందని ఫిర్యాదు చేశారు.   

వాస్తవానికి జగన్ రెంటపాళ్ల పర్యటన ఆద్యంతం పోలీసు ఆంక్షలను, నిబంధనలనూ తుంగలోకి తొక్కుతూ సాగింది. వంద మందితో మాత్రమే రెంటపాళ్లకు వెళ్లాలని పోలీసులు జగన్ కు  అనుమతి ఇస్తే.. దానిని ఖాతరు చేయకుండా వేలాది మందితో వెళ్లారు. జగన్ కాన్వాయ్ లో మూడు కార్లకే అనుమతి ఉంటే ఆయన పెద్ద సంఖ్యలో కార్లతో వెళ్లారు. అంతే కాకుండా అడుగడుగునా పోలీసులతో ఘర్షణ పడుతూ శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా చేశారు. జగన్  వాటిని ప్రోత్సహిస్తున్న చందంగా   అభివాదాలు చేశారే తప్ప వారించలేదు.పైపెచ్చు తరువాత తాపీగా నా కారుకుంది పడి మా పార్టీ కార్యకర్త మరణిస్తే నాకు బాధకలగదా?అంటూ..సంగమయ్య కుటుంబానిి పార్టీ తరఫున పదిలక్షలు ఇచ్చాం కదా అని చెబుతున్నారు.  తన కారు కింద పడే సింగమయ్య మరణించాడని తద్వారా అంగీకరించేశారు.  అయినా సరే తనపై తప్పుడు కేసు నమోదు చేశారంటూ దబాయిస్తున్నారు. ఆ కేసులో తనని అరెస్ట్‌ చేస్తారనే భయంతో జగన్‌ హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ కూడా వేశారు.

  ఆ క్వాష్ పిటిషన్ పై కోర్టు ఇంకా విచారించాల్సి ఉంది. కానీ అంతలోనే తమ పార్టీ నేతలను  గవర్నర్‌ వద్దకు పంపించి సిఎం చంద్రబాబు నాయుడు, ప్రభుత్వంపై ఎదురు పిర్యాదు చేయడం చూస్తే  సింగమయ్య మృతి కేసులో అరెస్ట్‌ చేస్తారేమోనని జగన్ భయంతో వణికిపోతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.