సర్జికల్ స్ట్రైక్స్... అంటే ఏంటి?
Publish Date:Sep 29, 2016
Advertisement
పర్జికల్ స్ట్రైక్స్... ఇప్పుడు దేశంలో ఎక్కడ విన్నా వినిపిస్తోన్న పదం ఇది! ఇండియన్స్ అంతా గర్వంగా చెప్పుకుంటున్నారు మన ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ చేసిందని! కాని, ఇంతకీ సర్జికల్ దాడులంటే ఏంటి? ఇది చాలా మందికి తెలిసినట్టు లేదు. తెలిసినా పూర్తిగా అవగాహన వున్నట్టు లేదు. చాలా మంది సర్జికల్ స్ట్రైక్స్ అంటే పూర్తి స్థాయి యుద్ధం లాంటి పరిస్థితులు అనుకుంటున్నారు. కాని, అది నిజం కాదు...
సర్జికల్ స్ట్రైక్స్ అంటే... ఒక నిర్ధిష్ట గమ్యాన్ని ఎంచుకుని అక్కడికి వెళ్లి శత్రువుల్ని అంతం చేయటం, వారి స్థావరాల్ని ధ్వంసం చేయటం. దీని వల్ల వీలైనంత తక్కువ ప్రాణ , ఆస్తి నష్టం జరుగుతుంది. మరీ ముఖ్యంగా సాధారణ పౌరుల్ని చనిపోయే అవకాశం అస్సలు వుండదు. కాకపోతే, సర్జికల్ స్ట్రైక్స్ మామూలు దాడుల కంటే చాలా ఎక్కువ ప్రతిభ, నైపుణ్యంతో కూడుకున్న విషయాలు. చాలా పక్కగా లెక్కలు వేసుకుని, టెక్నాలజీ సాయంతో ఆర్మీ ముందుకు పోతుంది. ఎక్కడా తేడా రాకూడదు. అప్పుడే టార్గెట్ నాశనమయ్యేది!
ఇండియా తాజాగా చేసిన సర్జికల్ దాడుల్లో... టార్గెట్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలు. అక్కడ టెర్రరిస్టులకి నివాసం, ట్రైనింగ్ ఇస్తుంటుంది పాకిస్తాన్ ఐఎస్ఐ. మొన్న జరిగిన ఉడీ దాడుల్లాంటి వాటిల్లో పాల్గొన్న ఉగ్రమూకలు ఇక్కడ్నుంచి వచ్చినవే. జైషే మహ్మద్, లష్కరే తోయిబా లాంటి టెర్రరిస్టు సంస్థలు ఇక్కడ తిష్టవేశాయి. వాటికి రక్షణగా పాకిస్తాన్ మిలటరీ వుంటుంది.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని టెర్రర్ క్యాంపులపై దాడి చేయాలనుకున్న ఇండియన్ ఆర్మీ ఎగ్జాక్ట్ గా ఏం చేసిందో మనకు తెలియదు. అది బయటకు వచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే, సీక్రెట్ ఆపరేన్స్ ఎలా జరిగాయో స్పష్టంగా ఎవ్వరూ చెప్పరు. కాకపోతే, సర్జికల్ స్ట్రైక్స్ అన్న పదం వాడకంతో ఒకటి మాత్రం క్లియర్. మన స్పెషల్లీ ట్రైన్డ్ ఆర్మీ కమాండోస్ మొదటగా హెలికాప్టర్స్ లో వెళ్లి సరిహద్దుల కావల దిగారు. తరువాత కంట్రోల్ రూం నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం ముందుకు పోతూ టార్గెట్స్ రీచ్ అయ్యాక శత్రవుల్ని మట్టుబెట్టారు. అయితే, ఇక్కడ మనం చెప్పుకున్నంత సింపుల్ గా వుండదు దాడులు జరుగుతున్న సమయంలో. అదీ రాత్రి వేళ దాడి జరిగింది కాబట్టి చాలా ప్రమాదకరంగా ఆపరేషన్ నడిచి వుంటుంది. ఏ మాత్రం తేడా వచ్చిన మన సైనికుల ప్రాణాలకు ప్రమాదమే!
సర్జికల్ స్ట్రైక్స్ సక్సెస్ లో ఆర్మీదే కీలక పాత్ర అయినప్పటికీ ఎక్స్ టర్నల్ ఇంటలిజెన్స్, ఇంటలిజెన్స్, రా ఏజెంట్ల పాత్ర కూడా ఎంతో ముఖ్యం. అనేక విభాగాల ఇంటలిజెన్స్ సమాచారంతోనే ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తుంది. పక్కా ప్లానింగ్, పక్కా సమన్వయం చాలా ముఖ్యం...
సర్జికల్ దాడుల్ని మోదీ ఎంచుకోవటానికి మరో కారణం వీటి వల్ల పూర్తి స్థాయి యుద్దం జరిగే అవకాశాలు లేకపోవటమే. పాక్ ఫుల్ లెంగ్త్ వార్ జరిగితే న్యూక్లియర్ వెపన్స్ అంటోంది కాబట్టి ఈ సర్జికల్ స్ట్రైక్స్ వల్ల ఆ దేశానికి అణు బాంబులు వేసే అవకాశం వుండదు. ఈ దాడులు అధికారికంగా పాక్ మీద కాదు. కేవలం టెర్రరిస్టుల మీదే. కాబట్టి అంతర్జాతీయంగా ఎదురయ్యే ఒత్తిడితో పాక్ అణు ఆలోచనలు పక్కన పెట్టాల్సి వస్తుంది.
మొత్తానికి సర్జికల్ స్ట్రైక్స్ తో ఇండియా పాక్ ని షాక్ చేసిందనే చెప్పొచ్చు!
http://www.teluguone.com/news/content/army-45-67147.html





