తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్రంలో బాధితులే లేరన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో అంతా భేషుగ్గా ఉంది. ప్రజలకు సమస్యలే లేవు.. కానీ పాపం ఇతర రాష్ట్రాలలో జనం నానా ఇబ్బందులూ పడుతున్నారు. మిగులు రెవెన్యూ ఉన్న రాష్ట్రాంగా, సమస్యలే లేని రాష్ట్రంగా వారిని ఆదుకోవలసిన బాధ్యత తెలంగాణదే, అంటే తనదే అన్నట్లుగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారు.
తాజాగా ఆయన బీహార్ వెళ్లారు. అక్కడ గాల్వాన్ అమరుల కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే సికిందరాబాద్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన బీహార్ వలస కూలీల కుటుంబాలనూ పరామర్శించి వారికీ నష్టపరిహారం ఇచ్చారు. అదే సమయంలో ఇక్కడ తెలంగాణలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు కన్నుమూస్తే వారి కుటుంబాలను పరామర్శించడానికి మాత్రం కేసీఆర్ కు మనసు రాలేదో లేక తీరిక దొరకలేదో అర్ధంకాదు కానీ ఆయన మాత్రం బాధిత కుటుంబాలను పరామర్శించలేదు. ఐదు లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకుంటున్నారు. గతంలోనూ ఇలాగే జరిగింది. ఆయన పంజాబ్ వెళ్లారు. అక్కడా బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అంద జేశారు.
ఆ సొమ్ములేవీ కేసీఆర్ జేబులోంచో, కుటుంబ ఆస్తులు అమ్మో ఇచ్చిన సొమ్ములు కాదు. తెలంగాణ ప్రజల నుంచి ముక్కు పిండి మరీ వసూలు చేసిన పన్నుల నుంచి ఇచ్చినవి. ఆ సొమ్ములపై తొలుత అధికారం తెలంగాణలోని బాధిత ప్రజలదే. రాష్ట్రంలో ప్రజలను వారి కష్టాలకు, వారి నష్టాలకూ వదిలేసి ఇతర రాష్ట్రాలకు వెళ్లి సొమ్ములు పంపిణీ చేసి తన ప్రతిష్టను పెంచుకోవాలని కేసీఆర్ చూస్తున్నారన్న విమక్షాల విమర్శలను జనం కూడా సమర్థిస్తున్నది అందుకే. రాష్ట్రాన్ని గాలికొదిలేసి జాతీయంగా ఓ పెద్ద నాయకుడిగా ఎదగాలన్న కేసీఆర్ ప్రయత్నాన్ని ప్రజలు కూడా హర్షించడం లేదు. ముందు రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దాలని వారు కోరుతున్నారు.
తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించాయని సాక్షాత్తూ రాష్ట్ర పోలీసుల నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. అటువంటిది రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దాల్సింది పోయి.. ఇతర రాష్ట్రాలలో ప్రజలను ఉద్ధరించడానికి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందట సామెతగా అభివర్ణిస్తూ పరిశీలకులు సైతం తప్పుపడుతున్నారు.
గతంలో కొండగట్టు వద్ద బస్సు బోల్తా పడి పలువురు మరణించిన సందర్భంలో బాధిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి సాయంఅందించలేదు. కేసీఆర్ బాధి కుటుంబాలను పరామర్శించలేదు. ఇప్పుడు కేసీఆర్ బీహార్ పర్యటన సమయంలో ప్రజలు నాటి సంఘటనను గుర్తు చేసుకుని తెలంగాణ ప్రజలు ప్రజలు కారా? వారి బాధలు బాధలు కావా.. లేక రాష్ట్రంలో బాధితులకు చేసిన సాయం గురించి దేశంలో పెద్దగా మాట్లాడుకోరన్న భావమా అంటూ కేసీఆర్ వైఖరిని తప్పుపడుతున్నారు. జాతీయ స్థాయిలో తనకు గుర్తింపు కోసం ప్రజాధనాన్ని వాదించుకుంటున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇదే సందర్భంలో దేశవ్యాప్తంగా అన్ని పత్రికలలో భాషతో, వాటి సర్క్యలేషన్ తో సంబంధం లేకుండా పేజీలకు పేజీలు ప్రకటనలు ఇవ్వడాన్ని వారీ సందర్భంగా ప్రస్తావించి కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, ప్రజా ధనాన్ని దుబారా చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/are-there-no-problems-in-the-state-telangana-people-questions-kcr-25-143015.html
సీట్ల సర్దుబాటుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోనులో మాట్లాడినట్టు తెలిసింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకేతో కూటిమిలో భాగంగా 30 సీట్లకు తగ్గేది లేదని కాంగ్రెస్ ఇంత వరకూ పట్టుబడుతూ వచ్చింది. దీంతో సీట్ల పంపకాలపై పరిష్కారానికి డీఎంకేతో సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయాన్నికేంద్ర హోంమంత్రికి వివరించిన సీఎం రేవంత్.. వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణ, పరిశ్రమల వృద్ధి దృష్ట్యా రాష్ట్రానికి మరిన్ని ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని, తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచాలని కోరారు.
సంక్రాంతి సంబరాలు నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఈ రెండు వర్గాల మధ్యా పోటీ కొనసాగుతున్నది. సీతం రాజు సుధాకర్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ముగ్గుల పోటీ నిర్వహిస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కనకమాలక్ష్మి ఆలయం వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇది ఒక్కటే కాదు, కార్పొరేషన్ పదవుల విషయంలో కూడా తలో దిక్కు అడుగులు వేస్తున్నారు.
కొద్దికాలం కిందట శరద్ పవార్ తాను రాజ్యసభకు పోటీ చేసే ప్రశక్తే లేదని ప్రకటించారు. అయితే ఇటీవల ఆయన అన్న కొడుకు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.
తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిణామాలపై ఆసక్తికర చర్చ జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం (మార్చి 2) దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సమర్పించే విషయంలో కొలికపూడి దురుసుగా వ్యవహరించారు.
నెమలి వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఆలయ మర్యాదల ప్రకారం, ప్రోటోకాల్ అనుసరించి అధికారులు స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందించారు.
వాస్తవానికి మల్లు భట్టి విక్రమార్క్ జగన్ ను తన కుమారుడి వివాహానికి జనగ్ ను బెంగళూరు వెళ్లి ఆహ్వానించాల్సి ఉంది. అయితే జగన్ స్వయంగా తాను మంగళవారం తాడేపల్లి వస్తాననీ, అప్పుడు ఆహ్వానిస్తే సరిపోతుందనీ కబురు పంపారు.
ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే మండలి సభ్యత్వానికి వారు చేసిన రాజీనామాలను చైర్మన్ ఇప్పటి వరకూ ఆమోదించలేదు.
మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
రాజ్యసభ ఎన్నికలకు 9 మంది అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.
స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఆలయ పురోహితులు ఎంపీ చిన్ని దంపతులకు అందజేశారు. అయితే, తనకు కూడా వస్త్రాలు ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ఒకరికే ఇస్తారని చెప్పిన ఆలయ అధికారులు, ఆయనకు తలంబ్రాలు అందించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చేతిలోని పట్టువస్త్రాలను బలవంతంగా లాక్కుని తన తలపై పెట్టుకున్నారు.
జగన్ హయాంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందన్న మంత్రి, రాష్ట్ర వ్యాప్తంగా 198 సాగునీటి ప్రాజెక్టులకు ప్రీ-క్లోజర్ ఇస్తే, వాటిలో 102 ప్రాజెక్టులు రాయలసీమలోనే ఉన్నాయని గుర్తుచేశారు.