జీతాలడిగితే శత్రువులేనా? జగన్ సర్కార్ పై ఉద్యోగులు ఫైర్

Publish Date:Dec 31, 2022

Advertisement

ఆడ లేక మద్దెలు ఓడు అన్నట్లు తయారైంది ఏపీలో జగన్ సర్కార్ పరిస్థితి. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు, విధ్వంసక  పాలన, అన్నిటినీ మించి ఆర్థిక అరాచకత్వం, క్రమశిక్షణా రాహిత్యం కారణంగా  రాష్ట్రం దివాళా అంచుకు చేరింది.

ఇంత కాలం అప్పులు చేసి పబ్బం గడుపుకున్న జగన్ సర్కార్ కు రానున్న మూడు నెలల కాలం.. అంటే బడ్జెట్ వరకూ చిల్లు కానీ కూడా ఖర్చు చేయడానికి సొమ్ములు లేని పరిస్థితిలో ఉంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కాదు కదా, రోజువారీ ఖర్చులకు కూడా ఖజానాలో సొమ్ములు లేని పరిస్థితి. ఈ పరిస్థితి ఎదురు  కావడానికి జగన్ సర్కార్ విధానాలే కారణమనడంలో సందేహం లేదు. అయినా వాస్తవాలను దాచి పెట్టి మసిపూసి మారేడు కాయ చేయడానికి ప్రయత్నిస్తోంది.

సమయానికి జీతాలందని ఉపాధ్యాయుులు వేతనాలెప్పుడని నిలదీస్తుంటే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. వేతనాలివ్వండి అని ఉద్యోగులు అడుగుతుంటే.. ప్రభుత్వం మాత్రం అలా అడిగినందుకు ఉద్యోగులపై కారాలూ మిరియాలూ నూరుతోంది. అసలు వారి పొడే గిట్టదన్నట్లుగా వ్యవహరిస్తోంది. వారికి ఇవ్వాల్సిన రాయితీలు, అలవెన్నుల మాట దేవుడెరుగు జీతాల కోసమే దేబిరించాల్సిన పరిస్థి కల్పించింది. అక్కడితో ఆగకుండా వేతనాలు అడిగినందుకు ఎదురు అసలు మీరు పని చేస్తున్నారా అంటూ ప్రశ్నిస్తోంది.

సమయపాలన ఏదీ అంటూ నిలదీస్తోంది. జనవరి 1నుంచి ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ కు అమలు చేస్తోంది. తన తప్పు కప్పిపుచ్చుకుని ఎదురు ఉద్యోగులను పని చేయకుండా జీతాలు తీసుకుం టున్నారన్నట్లుగా మీరు ఏ రోజు సమయానికి వచ్చారని నిందలేస్తోంది. ఈ ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్సు ను ఉద్యోగులు తమ ఫోన్లలో యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని హాజరు వేసుకోవాల్సి ఉంటుంది. పది నిముషాలు ఆలస్యమైనా గైర్హాజరుగా పరిగణించి వేతనాలు కట్ చేస్తామనిన హెచ్చరిస్తోంది. పది నిముషాలు ఆలస్యం చేస్తే ప్రభుత్వం జీతం కట్ చేస్తుంది సరే.. మరి వేతనం ఆలస్యంగా ఇస్తున్న ప్రభుత్వానికి ఏం కట్ చేయాలన్న ప్రశ్న ఎదురౌతోంది. పవర్ కట్ చేయడమొక్కటే మార్గమని అధిక శాతం మంది ఉద్యోగులు అంటున్నారు. హాజరు విషయంలో ఇంత కచ్చితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం మరి వేతనాలు ఇచ్చే విషయంలో ఎందుకు అంత కచ్చితంగా ఉండటం లేదని ఉద్యోగులు అంటున్నారు.

ఉపాధ్యాయులు, ఉద్యోగుల పట్ల ప్రభుత్వం మొదటి నుంచీ కక్ష పూరితంగనే వ్యవహరిస్తోంది. వేతనాలు జాప్యం, పీఎఫ్ తదితర ప్రయోజనాల విషయంలోనూ అలసత్వం, ఏకంగా ఉద్యోగుల పీఎఫ్ ను వాడేసుకుని తిరిగి ఇవ్వకపోవడం వంటి చర్యలతో ప్రభుత్వం ఉద్యోగుల సహనాన్ని పరీక్షిస్తోంది. తమ హక్కుల పరిరక్షణ కోసం, వేతనాల కోసం ఉద్యమిస్తే కేసులు పెట్టివేయడం, అణచివేతకు గురి చేయడం వంటి చర్యలతో దమనకాండకు తెగపడుతోంది.

సమస్యలు పరిష్కరించడం మాట అటుంచి వారిపై ఒత్తిడి పెంచి ఆందోళనకు గురి చేస్తోంది. ప్రభుత్వ తీరు మారకుంటే సంక్రాంతి తరువాత నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన బాట పడతామని హెచ్చరిస్తున్నారు. హక్కుల పరిరక్షణ కోసం తగ్గేదేలే అని ఉద్యోగులు అంటున్నారు. ముందు ముందు ప్రభుత్వం ఉద్యోగుల మధ్య అగాధం మరింత పెరగడం తథ్యమని పరిశీలకులు అంటున్నారు. ఉద్యోగులు సహాయ నిరాకరణకు దిగితే ప్రభుత్వానికి చిక్కులు తప్పవంటున్నారు. 

By
en-us Political News

  
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.