రాహుల్ టార్గెట్ గా అరవింద్ విమర్శల వర్షం.. మర్మమేంటంటే?

Publish Date:Aug 28, 2025

Advertisement

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి బిగ్ షాక్ తగిలింది.  బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో విజయాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్ అధికార్ యాత్ర పేరుతో బీహార్ లోనే మకాం వేశారు. కీలక నాయకురాలు, ఆయన సోదరి ప్రియాంక గాంధీ కూడా బీహార్ లో పర్యటిస్తున్నారు. ఓట్ చోర్ అంటూ ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం బీహార్ పర్యటనలు చేస్తున్నారు. దీంతో బీహార్ ఎన్నికలు కాంగ్రెస్ కు గేమ్ చేంజర్ గా మారనున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది.   జాతీయ మీడియాలో మాత్రం రాహుల్ చేస్తున్న ఓటు అధికార్ యాత్రకు విస్తృత కవరేజ్ అయితే లభిస్తోంది. అంతే కాదు, విశ్లేషకులు కాంగ్రెస్ కూటమికి  బీహార్ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. సర్వేల ఫలితాలు సైతం అదే చెబుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలలో ఐక్యత కనిపిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రూపంలో రాహుల్ కు గట్టి షాక్ తగిలింది.  ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకూ ఇండియా కూటమిలోనే ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆ తరువాత బయటకు వచ్చేసింది. ఇప్పుడు బీహార్ ఎన్నికల సమయంలో మరోమారు కాంగ్రెస్ కు, రాహుల్ కు వ్యతిరేకంగా గళమెత్తింది. ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రాహుల్ పై విమర్శలు గుప్పించారు. గురువారం (ఆగస్టు 28) ఆయన మీడియా సమావేశంలో  బీజేపీ, కాంగ్రెస్ ను ఒకే తాను ముక్కలు, పరిస్థితులను చూస్తుంటే ఇరు పార్టీల మధ్యా పొత్తు ఉందా అనిపిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీల పొత్తుకు నేషనల్ హెరాల్డ్ కేసుకు ముడిపెట్టారు. 

 నేషనల్ హెరాల్డ్ కేసు మూతపడిందా? అన్న అనుమానం వ్యక్తం చేశారు. మద్యం కేసులో తాను అన్యాయంగా జైలుకు వెళ్లాననీ.. కానీ నేషనల్ హెరాల్డ్ కేసులో గాంధీ కుటుంబం నుంచి ఎవరూ జైలుకు వెళ్లలేదన్నారు. దీని వెనుక ఏదో మర్మం ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు. అంతే కాదు   2 జి, బొగ్గు కుంభకోణం వంటి స్కాంల కథ ముగిసిపోయినట్లే కనిపిస్తోందన్న అరవింద్ కేజ్రీవాల్   కాంగ్రెస్ రాజీపడటమే ఇందుకు కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనేత ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ చేస్తున్న ఆందోళన, యాత్రలూ అన్నీ వ్యక్తిగత రక్షణ కోసమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

రాహుల్ గాంధీ ఇటీవలి కాలంలో బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఆయన విమర్శలకు జాతీయ స్థాయిలో స్పందన లభించడమే కాకుండా, చర్చకు కూడా కారణమౌతున్నాయి. రాహుల్ విమర్శలతో ఎంత కాదనుకున్నా బీజేపీ డిఫెన్స్ లో పడిందన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తం అవుతోంది. రాహుల్ దూకుడు కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు కూడా కాంగ్రెస్ వెనుక ర్యాలీ అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అరవింద్ కేజ్రీవాల్ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ లక్ష్యంగా  చేసిన విమర్శలు, వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.  ఇవి బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రభావం చూపే అవకాశం ఉందా? అన్న చర్చకు తెరలేచింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉన్న ఆప్.. ఇప్పుడు కాంగ్రెస్ లక్ష్యంగా, రాహుల్ టార్గెట్ గా ఎందుకు గళమెత్తుతోందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  

By
en-us Political News

  
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.