Publish Date:Sep 30, 2024
జగన్ పాలనలో ఐదేళ్ల పాటు అభివృద్ధి అన్న మాటే వినిపించని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు పెట్టుబడులు తరలి వస్తున్నాయి. ఐదేళ్ల అరాచకపాలన నుంచి విముక్తి చెందిన ఆంధ్రప్రదేశ్ ఇప్పడు పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మారుతోంది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన క్షణం నుంచీ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి.
ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు అధికార పగ్గాలు చేపట్టారు. ఆయన ప్రతి అడుగూ రాష్ట్ర అభివృద్ధి దిశగానే సాగుతోంది. చంద్రబాబు రాష్ట్ర ప్రగతి కోసం చాలా క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలోని పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటోంది. వివిధ పరిశ్రమలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. జగన్ ఐదేళ్ల అరాచకపాలనలో రాష్ట్రం వదిలి వెళ్లిపోయిన ఒక్కో పరిశ్రమా తిరిగి ఆంధ్రప్రదేశ్ వైపు అడుగులు వేస్తున్నది.
అందులో భాగంగానే ప్రసిద్ధ లులు గ్రూప్ రాష్ట్రంలో అడుగుపెట్టేందుకు రెడీ అయ్యింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రధాన నగరాలలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. ఆ గ్రూప్ చైర్మన్ యుసుఫ్ అలీ చంద్రబాబుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడుల విషయంపై చర్చించారు. ఈ విషయాన్ని చంద్రబాబు స్వయంగా ఎక్స్ వేదికగా పంచుకున్నారు. లులు గ్రూప్ తన వ్యాపార విస్తరణకు ఆంధ్రప్రదేశ్ ను ఎన్నుకోవడాన్ని స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. లులు గ్రూప్ ఎండీ యుసుఫాలీలో అమరావతిలో జరిగిన చర్చల్లో విశాఖపట్నంలో 8 స్క్రీ న్ల ఐమ్యాక్స్ మల్టీప్లెక్స్ సహా అంతర్జాతీయ స్థాయి షాపింగ్ మాల్ నిర్మిం లులూ గ్రూప్ ఛైర్మన్ అంగీకరించినట్లు పేర్కొన్నారు. అదే విధంగా విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్కెట్లను కూడా లులూ గ్రూప్ ఏర్పాటు చేయ నున్నది. ఇలా ఉండగా తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో అమరావతిలో శనివారం (సెప్టెంబర్ 28) భేటీ అయినట్లు పేర్కొన్న లులూ గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తమకు సాదర స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలియ జేశారు. చంద్రబాబుతో తనకు ఉన్న 18 ఏళ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చంద్రబాబుతో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయని పేర్కొన్నారు. మల్టీప్లెక్స్ లు, షాపింగ్ మాల్స్, హైపర్ మార్కెట్లతో పాటు రాష్ట్రంలో ఆధునిక ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్ ల్యాబ్ లను కూడా ప్రారంభించ నున్నట్లు లులు ఎండీ తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/aps-ist-imax-in-vizag-25-185877.html
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.