ఏపీ ఆర్ధిక పరిస్థితి అస్థవ్యస్థం.. జీవీ రెడ్డి
Publish Date:Aug 26, 2022
Advertisement
చాక్లెట్ బావుందని వెనకటికి ఓ పిల్లాడు చదువు అశ్రద్ధచేసి చాక్లెట్లకోసం పెద్ద బడి దగ్గర దుకాణాన్ని మరిగాట్ట. అలా ఉంది ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వ్యవహారం. చాక్లెట్లు అడిగినంత సులువుగా ఆర్బీఐ ని అప్పు అడిగేస్తున్నారు. రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా కూడా రుణాలు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం అప్పుల్లో రికార్డ్ సృష్టిస్తోందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి తప్పుబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఐదు నెలల వ్యవధిలో ఏపీ రూ.46,603 కోట్లు రుణం సమీ కరించిందని, ఏపీ చరిత్రలో ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని తెలిపారు. వచ్చే మంగళవారం మరో రూ.2 వేల కోట్లు అప్పుకు ఆర్బీఐ కి ఏపీ ప్రభుత్వం ఇండెంట్ పెట్టిందని జీవీ చెప్పారు. ఇవికాక కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అప్పులు అదనంగా తెస్తున్నారని జీవీ రెడ్డి పేర్కొన్నారు. ఏపీ ఆర్ధిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ సమస్య లు, విభజన అంశాలపై కేంద్ర ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ ఆధ్వర్యంలోని కమిటీ రాష్ట్ర బృందం తో గురువారం సమావేశమైంది. రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ బృం దంలో ఉన్నారు. ప్రధాని కార్యాలయం (పీఎంవో) ఈ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో జరిగిందొకటి.. బయటికొచ్చాక విజయసాయి, బుగ్గన చెప్పింది వేరొకటి కావడం గమనార్హం. వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటా సమకూర్చకపోవడం, డిస్కమ్‌లు చెల్లించా ల్సిన రుణాలపై నివేదికలు ఇవ్వకపోవడం, రైల్వే ప్రాజెక్టులకు నిధులు, భూములు ఇవ్వకపోవడంపై కూడా చర్చ జరిగినట్లు తెలిసింది.
http://www.teluguone.com/news/content/aps-economic-situation-is-a-mess-says-tdp-39-142714.html





