ఎపి మెట్రోరైల్ కార్పోరేషన్ ఎండీగా రామకృష్ణారెడ్డి నియామకం
Publish Date:Aug 3, 2024
Advertisement
ఆంధ్రప్రదేశ్ మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీ గా రామకృష్ణారెడ్డి మరోసారి నియమితులయ్యారు. ఈ మేరకు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన మూడేళ్లపాటు ఎంఆర్‌సీఎండీగా కొనసాగనున్నారు. రామకృష్ణా రెడ్డి గతంలోనూ ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీగా పనిచేశారు. ప్రస్తుతం ఎండీగా పనిచేస్తున్న జయమన్మథరావును ఆ పోస్టు నుంచి రిలీవ్ చేస్తూ ఉత్తర్వులను విడుదల చేశారు. రామకృష్ణారెడ్డి మూడేళ్లపాటు పదవిలో ఉంటారు. టీడీపీ గత ప్రభుత్వ హయాంలోనూ ఆయన అమరావతి మెట్రో రైల్ ఎండీగా పనిచేశారు. విజయవాడ, విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టులకు నివేదికల తయారీ, వాటిని కేంద్ర పరిశీలనకు పంపడంలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు. ప్రాజెక్టు దాదాపు పట్టాలెక్కే సమయంలో టీడీపీ అధికారం కోల్పోయింది. అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ప్రాజెక్టును పక్కన పెట్టేయడంతో 31 మే 2021న రామకృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా, మరోమారు ఆయనను అదే పదవిలో నియమించింది. కాగా, ప్రస్తుతం పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న జేఎం రావును ప్రభుత్వం రిలీవ్ చేసింది.
http://www.teluguone.com/news/content/appointment-of-ramakrishna-reddy-as-ap-metrorail-corporation-md-39-182159.html





