ఏపీ పంచాయతీ పోరు: తొలి విడత: తెలుగుదేశం కూటమి జోరు.. వైసీపీ బేజారు.!
Publish Date:Nov 28, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్లో జరిగిన తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలు క్షేత్రస్థాయిలో వైసీపీ దయనీయ పరిస్థితికి మరోమారు అద్దంపట్టాయి. పట్టణ ప్రాంతాలు, ఆ తర్వాత గ్రామీణ ఓటర్లలో తమకు గట్టి పట్టు ఉందంటూ వైసీపీ వర్గాలు తమ భుజాలను తామే చరుచుకుంటే చేస్తున్న ఆర్భాటం అంతా ఉత్తిదేననీ స్పష్టం చేస్తూ పంచాయతీ తొలి విడత ఎన్నికల ఫలితాలు వాస్తవ పరిస్థితిని కళ్లకు కట్టాయి. తొలి విడత పంచాయతీ ఎన్నికలలో వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. గతంలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ వైసీపీకి ప్రతికూల ఫలితాలు ఎదురైన విషయం తెలిసిందే. ఇప్పుడు గ్రామపంచాయతీ స్థాయిలోనూ అదే పరిస్థితి కొనసాగడంతో వైసీపీయులలో తీవ్ర నిరాశా నిస్ఫృహలు వ్యక్తమౌతున్నాయి. ఏకగ్రీవమైన పంచాయతీల నుంచి పోలింగ్ జరిగిన స్థానాల వరకు అత్యధిక స్థానాలలో కూటమి మద్దతుదారులే జయభేరి మోగించారు. పంచాయతీ ఎన్నికలలో అభ్యర్థులు పార్టీ గుర్తులపై పోటీ చేయకపోయినా.. అభ్యర్థుల వెనుక రాజకీయ పార్టీల మద్దతు కీలకంగా ఉంటుంది. మండల కేంద్రాలు, మేజర్ గ్రామపంచాయతీలలో అసెంబ్లీ ఎన్నికలను తలపించే స్థాయిలో ప్రచారం, సమీకరణలు, స్థానిక అంశాలు, ప్రభావం చూపుతాయి. గ్రామీణ సమాజంలో ఏ పార్టీకి క్షేత్రస్థాయిలో బలమైన యంత్రాంగం ఉందనేదానికి ఈ ఫలితాలు ఒక లాండ్ మార్క్ అనడంలో సందేహం లేదు. తొలి విడతలో 3,949 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగ్గా, వాటిలో 750కి పైగా స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఆ ఏకగ్రీవ స్థానాల్లో అత్యధిక భాగం టీడీపీ మద్దతుదారుల ఖాతాలో చేరినట్లు తెలుస్తోంది. ఇక పోలింగ్ జరిగిన 3,200కు పైగా పంచాయతీల ఫలితాలను పరిశీలిస్తే, మేజర్ పంచాయతీలలో చాలాచోట్ల కూటమి-టీడీపీ మద్దతుదారులే విజయం సాధించారని, వైసీపీకి బలమైన ప్రాంతంగా భావించే రాయలసీమలోనూ వైసీపీ మద్దతుదారులు గెలవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇది కూడా చదవండి: మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించింది: సీఎం చంద్రబాబు గ్రామీణ స్థాయిలో వైసీపీకి ఈ స్థాయిలో ప్రతికూల ఫలితాలు రావడానికి సమన్వయ లోపం, కార్యకర్తల నిరాసక్తతే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీ అధినేత జగన్ బెంగళూరు నుంచి చుట్టపు చూపుగా మాత్రమే ఏపీకి వస్తుండటం, స్థానిక నేతలు కూడా క్యాడర్ కు అందుబాటులో లేకపోవడం కారణంగానే పంచాయతీపోరులో వైసీపీ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయిందని అంటున్నారు. ఇక ఆదివారం (నవంబర్29), డిసెంబర్ 2 తేదీల్లో జరగనున్న తదుపరి విడతల పంచాయతీ ఎన్నికలపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. తొలి విడతలో కనిపించిన ధోరణే మిగిలిన విడతల్లోనూ కొనసాగుతుందా, లేక క్షేత్రస్థాయిలో సమీకరణలు మారుతాయా అనేదానిపై ఆసక్తి నెలకొంది. ఈ ఫలితాల ప్రభావం రానున్న రోజుల్లో పార్టీల సంస్థాగత వ్యూహాలు, భవిష్యత్ ఎన్నికల సన్నద్ధతపై పడే అవకాశం ఉంది. మీకు నచ్చవచ్చు: అభ్యర్థుల ప్రకటనలో తెలుగుదేశం జోరు: స్థానిక సమరం.. క్యాండేట్ల రెండో జాబితా విడుదల.! పురపోరు: తెలుగుదేశం కూటమి జోరు.! [APPanchayatElections, FirstPhase, Results, TDPAlliance, YCP, TeluguOne]
http://www.teluguone.com/news/content/appanchayatelections-25-238125.html




