సిద్దప్పా.... అన్నీ మనకు తెలియాలని లేదు....

Publish Date:Apr 10, 2020

Advertisement

* మనకు తెలిసిందల్లా జ్ఞానమూ కాదు .... 
* అప్పుడప్పుడూ ఎనస్తీష్టుల మాటలూ వినాలి మరి!

ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడిగుండంత సుఖం లేదని ఒక సామెత అచ్చు గుద్దినట్టు సరిపోతుంది ఆ జర్నలిస్టుకు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనమిది. మనకు తెలీని సబ్జెక్టు లో వేలుపెడితే, దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుందనే విషయం ఇప్పుడు ఆయనకు బోధపడింది. వివరాల్లోకి వెళితే, రెండు రోజుల క్రితం పేరు మోసిన ఒక టీ వీ ప్రెజెంటర్ తన డిబేట్ లో -ఎనస్తీష్ట్ ల గురించి, తనకున్న విజ్ఞానాన్ని ఆడియెన్స్ కు పంచడం, వైద్య, ఆరోగ్య రంగ ప్రముఖులకు కావలసినంత వినోదం పంచింది. 

ఆ జర్నలిస్ట్  ఒక అనస్థీసియా డాక్టరుతో మాట్లాడుతూ,  ఆపరేషన్ థియేటర్లలో మత్తు మందు ఇచ్చే మీకు మాస్కుల అవసరం ఎందుకని అడగటం వారిని విస్మయపరిచింది. అంతకుమించి ఏ పని చేయని మీకు మాస్కులు అవసరమే లేదు అనే తీరుగా మాట్లాడుతున్నాడు. పైగా మీరు ఆపరేషన్ థియేటర్ లో ఏం చేస్తారు ?. అని అడగటం కూడా మొదలు పెట్టాడు. వాళ్ళిద్దరికీ జన్మవైరం ఏదైనా ఉంటే ఉండనీ గానీ‌, అనెస్థీషియా ఇచ్చే డాక్టరుకు ఏమీ పనే ఉండదు అనేలా మాట్లాడిన ఆయనకు అనెస్థీషియా అంటే ఏమిటో ఆ డాక్టర్లు ఏమి చేస్తారో అణువంత కూడా అవగాహన లేదని స్పష్టమైందని డాక్టర్లు అన్నారు. 
ఏదో మత్తుమందు ఒక సూదిలో ఇచ్చి పక్కన కూర్చోవడం కాదు అనెస్థీషియా అంటే. ఒక పేషంట్ కి ఆపరేషన్ చేయాలి అని సర్జన్ డిసైడ్ చేసిన మరుక్షణమే అనెస్థెటిస్ట్ పని మొదలౌతుంది. అసలు ప్రతీ ఆపరేషన్ చేయబోయే పేషంట్ నీ అనెస్థీటిస్ట్ చెక్ చేయడం ఉంటుంది. దాన్ని PAC అంటారు. Pre anesthetic consultation. అంటే అసలు ఆ పేషంట్ ఆపరేషన్ చేసేందుకు ఆరోగ్య పరంగా అర్హుడేనా అనేది చూస్తారు. శరీరంలోని గుండే ఊపిరితిత్తులు కిడ్నీలు వంటి అన్ని రకాల వ్యవస్థలు సరిగా పని చేస్తున్నాయా లేదా అనేది చెక్ చేసుకుని అవసరం అనుకుంటే, సంబంధిత వైద్యుని ఒపీనియన్ కూడా తీసుకుంటారు. అంతా బాగుందనుకుంటేనే సర్జరీ చేసుకోవచ్చని fit for surgery అని రాస్తాడు అనెస్థెటిస్ట్. అంటే సర్జరీ జరగాలంటే ముందు అనెస్థీషియా డాక్టరు ఒప్పుకోవాల్సిందే. అంతేకాకుండా ఆ పేషంట్ కి ఎలాంటి మత్తు మందు ఇవ్వాలి ఏ విధానంలో ఇవ్వాలి ఎంత డోసులో ఇవ్వాలి ఇత్యాదివన్నీ చూసేది అనెస్థెటిస్ట్.

ఆపరేషన్ చేసేటపుడు పేషంట్ బీపీ పల్స్ ఆక్సిజన్ శాతం అన్నీ కూడా మానిటర్ చేసేది అనెస్థెటిస్ట్. ప్రతీ నిముష నిముషం బీపీని చెక్ చేయడం జరుగుతుంది. ఆపరేషన్ చేస్తున్నపుడు పేషంట్ బీపీ పడిపోతున్నా, పల్స్ పడిపోతున్నా ఎప్పటికప్పుడు అలర్ట్ అయి వాటిని తిరిగి కంట్రోల్ లోకి తెచ్చుకుంటూ సకల ఎమర్జెన్సీ మందులతో రెడీగా ఉంటూ సర్జరీ సక్సెస్ కావడానికి దోహదపడతాడు. సర్జన్ నిరంతరాయంగా సర్జరీ చేయాలంటే అనెస్థెటిస్ట్ పక్కన ప్రతీ విషయాన్నీ సక్రమంగా మానిటర్ చేస్తూ నడపాల్సి ఉంటుంది. సర్జరీ చేసేటపుడు పేషంట్ కార్డియాక్ అరెస్ట్ ఐతే...సెకన్లలో అతడి ప్రాణాలను కాపాడగలిగేవాడే అనెస్థెటిస్ట్.

అంతే కాకుండా ఏ పేషంట్ కి సీరియస్ గా ఉన్నా మొదట చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి. ABCs అంటారు. Airway , Breathing, circulation. అంటే ఇపుడు అకస్మాత్తుగా ఒక పేషంట్ నిలబడుకున్నవాడు నిలబడుకున్నట్లే కుప్పకూలాడనుకుందాం. అతడిని బతికించాలంటే మన ఊపిరితిత్తుల లోకి గాలి పోవాలి‌, అతడి రక్త సరఫరా ఆగకూడదు. ఈ రెంటినీ సెకన్లలో అమర్చగలిగే వాడు అనెస్థెటిస్ట్. ఊపిరితిత్తుల లోకి డైరెక్ట్ గా గాలి పోవాలంటే గొంతు ద్వారా గొట్టం వేయాల్సి ఉంటుంది..endotracheal tube అంటారు. మామూలుగా డాక్టర్లు ఈ ట్యూబ్ వేయడంలో కష్ట పడవలసి ఉంటుంది. గొంతు చిన్నగా లావుగా ఉన్న వ్యక్తులలో మరింత కష్టపడవలసి ఉంటుంది. ఎంత కష్టమైతే అంత లేట్ అవుతుంది. ఎంత లేట్ అవుతే అంత బతికే అవకాశాలు తగ్గిపోతాయి. అటువంటి సమయాల్లో ప్రతీ ఒక్క క్షణమూ విలువైనదే. మామూలుగా డాక్టర్లు ముప్పై సెకన్లనుంచి ఒక నిమిషం లోపల గొట్టం వేయగలిగితే ఒక అనెస్థెటిస్ట్ పది సెకన్ల లోపలే వేయగలడు. అంత పర్ఫెక్షన్ ఉంటుంది. ఆ తరువాత దానిని వెంటిలేటర్ కి అనుసంధానం చేసి ఏయే పేషంట్ కి ఏ రకమైన వెంటిలేటర్ సెట్టింగులు పెట్టాలి అనేది కూడా అనెస్థెటిస్టే నిర్ణయించి ఆ సెట్టింగులను అమరుస్తాడు.

అనెస్థెటిస్ట్ లు కొంత కోపంగా దురుసుగా ఉన్నట్టు అరుస్తూ ఉన్నట్టు కనబడతారు. కానీ వాళ్ళు పర్ఫెక్షనిస్టులు. ముఖ్యంగా పేషంట్ ప్రాణాలు కోల్పోతున్న సమయంలో వాళ్ళ దురుసుతనమే వాళ్ళ వేగాన్ని పర్ఫెక్షన్ ని తెలుపుతుంది. ఆసుపత్రులలో ఎవరైనా ఒక పేషంట్ సడన్ గా కొలాప్స్ ఐతే ఒక టీం ఆఫ్ డాక్టర్లు పరిగెత్తుతూ వస్తుంటారు. ఒక అనెస్థెటిస్ట్ ఒక పల్మోనాలజిస్టు‌, ఒక కార్డియాలజిస్టు, ఒక ఇంటర్నల్ మెడిసిన్ డాక్టరూ, ఓ ఇద్దరు ముగ్గురు సిస్టర్లూ మొదలైనవారు. ఆ సమయంలో పేషంట్ ని కాపాడటానికి అవసరమైన అన్ని మందులూ‌ వెంటిలేటర్లూ మానిటర్లూ డీఫిబ్రిలేటర్లూ అన్నీ క్షణాల్లో అక్కడికి వచ్చేస్తాయి. కానీ ఇంత టీంని లీడ్ చేసేది మాత్రం అనెస్థెటిస్ట్. ఎవరి పనులను వాళ్ళకు పురమాయిస్తూ తన పని తాను చేసుకుపోతూ ఉంటాడు. గొంతులోకీ గొట్టం వేయడం ద్వారా AIRWAY ని, గొంతు రక్తనాళాల్లోకి పైపు వేయడం ద్వారా BLOOD CIRCULATION ని డాక్టర్ల గ్రిప్ లోకి తెచ్చుకోవడం మొదటి మెట్టు. దానిని మొట్టమొదట సెకన్ల వ్యవధిలో సాధించగలిగేవాడే అనెస్థెటిస్ట్. ఇంత ప్రాసెస్ లో ఒక టీం లీడర్ గా అప్పటికప్పుడు ఆ వాతావరణాన్ని మొత్తం గ్రిప్ లో పెట్టుకుంటాడు. ఇదంతా స్పాంటేనియస్ గా సహజంగా చేయగలగటమే అతడి ప్రతిభ. అతడు అలర్ట్గా పర్ఫెక్ట్ గా ఉండటమే కాక చుట్టూ ఉన్నవారిలో కూడా అంతే అలర్ట్ నీ పర్ఫెక్షన్ నీ డిమాండ్ చేస్తాడు. బయటివాళ్ళకు అది అరోగాన్సీ లాగా కనిపిస్తుంది. కానీ తోటి డాక్టర్లకు అది పర్ఫెక్షన్ లాగా కనిపిస్తుంది. ఒక్కోసారి ఈ చుట్టు ఉన్న స్టాఫ్ లో ఈ పర్ఫెక్షన్ కనపడకపోతే తిట్టడం కోపగించుకోవడమూ ఉంటుంది. ఐతే అది వ్యక్తి మీద కోపం కాదు...పేషంట్ ని బతికించుకోవడంలోని ఆత్రుత. ఆ సమయంలో అనెస్థెటిస్ట్ అక్కడ ఉండటం ఆ పేషంట్ చేసుకున్న అదృష్టంగా కూడా మారుతుంటుంది ఒక్కోసారి.

కోవిడ్ వంటి జబ్బు తీవ్ర దశకు చేరేకొద్దీ వెంటిలేటర్స్ మీద పేషంట్ కి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అతి ఎక్కువగా వైరస్ లు ఒక వ్యక్తినుంచి మరొక వ్యక్తికి పాకేది ఇలా గొంతులోకి గొట్టం వేస్తున్నపుడే. పేషంట్ oral cavity లోకి డైరెక్ట్ గా ముఖం పెట్టాల్సి ఉంటుంది అనెస్థెటిస్ట్. కాబట్టి హాస్పిటల్ లో అడ్మిట్ ఐన పేషంట్లనుంచి డాక్టర్లకు వైరస్ పాకేది ఉంటే అతి ఎక్కువ రిస్క్ ఉన్నది అనెస్థెటిస్ట్ లకే.

ఏ హాస్పిటల్ పర్ఫెక్ట్ గా నడవాలన్నా ఇరవైనాలుగు గంటలు అనెస్థెటిస్ట్ సర్వీసులు అవసరం. అనెస్థెటిస్ట్ లేని హాస్పిటల్ లలో ఎమర్జెన్సీ కేసులు తీసుకునే అవకాశమే ఉండదు. అలా వైద్య రంగానికి పిల్లర్ వంటి ఒక అనెస్థెటిస్ట్ ని అవమానిస్తూ...నీకేమి పని ఉండదు అనే అర్థం వచ్చేలా ఒక జర్నలిస్ట్ మాట్లాడటం అంటే అది ఆ ఒక వ్యక్తినే కాదు అనెస్థీషియా అనే గొప్ప వైద్య విధానాన్నే అవమానించినట్టు. దానికి క్షమాపణ చెప్పాలని మనం కోరుకోవడంలో అర్థం కూడా ఉండదు...!. కానీ ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎందరో అనెస్థెటిస్ట్ లు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎందరెందరి జీవితాల్నో బాగు చెస్తున్నారు. వాళ్ళందరి సేవలూ ఆ జర్నలిస్ట్ కు తెలియకపోయినా పెద్ద నష్టమేమీ లేదనీ,  కానీ సామాన్యులకు ఇవన్నీ తెలియాలనీ  డాక్టర్ విరించి విరివింటి తన సోషల్ మీడియా లో చేసిన పోస్టింగ్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.