హైదరాబాద్‌లో సీమాంధ్రులకు భయం లేదు: నరసింహన్
Publish Date:Sep 15, 2014
Advertisement
హైదరాబాద్‌లో సీమాంధ్రులకు అభద్రతాభావం ఉందనటం అవాస్తవమని, హైదరాబాద్ నగరంలో సీమాంధ్రులకు ఎలాంటి అభద్రత లేదని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ అన్నారు. ప్రస్తుతం ఒకరోజు ఢిల్లీ పర్యటనలో వున్న గవర్నర్ సోమవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. మొదట కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంచి విజన్‌తో పనిచేస్తున్నారని గవర్నర్ ఈ సందర్భంగా కితాబు ఇచ్చారు. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 9, 10లలో ఎలాంటి వివాదం లేదని, అయితే వాటిపై మరింత స్పష్టత రావలసిన అవసరం వుందని గవర్నర్ నరసింహన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-ts-governor-narasimhan-comments-on-hyderabad-andhra-pradesh-people-narasimhan-delhi-39-38325.html
http://www.teluguone.com/news/content/ap-ts-governor-narasimhan-comments-on-hyderabad-andhra-pradesh-people-narasimhan-delhi-39-38325.html
Publish Date:Oct 6, 2026
Publish Date:Oct 6, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 28, 2026





