Publish Date:Jul 26, 2022
ఏపీ సర్కార్ అప్పుల విషయంలో కేంద్రం కొట్టినట్టు చేస్తోంది. ఏపీ ప్రభుత్వం మాత్రం ఏడ్చినట్లు చేయడం లేదు. కేంద్రం చేసిన హెచ్చరికలను, వెల్లడించిన జాబితాను తనకు అనుకూలంగా ఉన్నాయని సంబరపడిపోతోంది. ఏపీ ప్రభుత్వం కంటే ఎక్కువ అప్పులు చేసిన రాష్ట్రాలు ఉన్నాయని మురిసిపోతోంది.
అయితే కేంద్రం పార్లమెంటు సాక్షిగా వెల్లడించిన గణాంకాలు పాక్షికం మాత్రమే. పూర్తి వివరాలు సేకరించకుండా జగన్ సర్కార్ చెప్పిన లెక్కలు, అబద్ధాలనే ఆధారం చేసుకుని ఏపీ అప్పులను ప్రకటించింది. అలా అరకొర వాస్తవాలతో కేంద్రం వెల్లడించిన వివరాలే ఇక ఏపీకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అప్పులు గగనమే అవుతాయని తేల్చేసింది. కానీ నొసటితో మాత్రం మీకేం భయంలేదు.. మా అభయం ఉందని భరోసా ఇచ్చేస్తోంది. అందుకే పార్లమెంటులో రాష్ట్రాల అప్పుల జాబితా ప్రకటించిన రోజే రాష్ట్రం కొత్తగా రెండు వేల కోట్ల రూపాయల అప్పు చేసింది. జగన్ సర్కార్ రుణగొణ ధ్వని కేంద్ర ప్రభుత్వానికి సంగీతంలా వినిపిస్తున్నదని భావించాల్సి వస్తోందని పరిశీలకులు అంటున్నారు.
పార్లమెంటులో రాష్ట్రం అప్పుల చిట్టాను ప్రకటిస్తూ కేంద్రం ఆర్బీఐ ఇచ్చిన వివరాల మేరకు అని తెలిపింది కానీ వాస్తవంగా పూర్తి సమాచారాన్ని వెల్లడించలేదు. ఆర్బీఐ విడుదల చేసిన డేటానే యథాతథంగా పార్లమెంటులో ప్రకటించేశారు. ఇక తాజాగా జగన్ సర్కార్ మంగళవారం (జులై 26) మరో రెండు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకుంది.
ఇది కూడా ఎలాగంటే వేయి కోట్ల రూపాయలు సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ఏడు సంవత్సరాలకు 7.79 శాతం వడ్డీతోనూ. మరో వేయి కోట్ల రూపాయలు 8.04 శాతం వడ్డీతోనూ తీసుకుంది. కేంద్రం పదే పదే రాష్ట్రాన్ని పరిమితికి మించి అప్పులు చేస్తోందంటూ హెచ్చరిస్తూనే అడగడమే ఆలస్యం అన్నట్లు రుణాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంలోని ఆంతర్యమేమిటని పరిశీలకులు, ఆర్థిక రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-takes-another-2000-crores-loan--through-auction-of-security-bonds-25-140606.html
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.