ప్యాకేజీ అంటే... నేతి బీరకాయలోని నెయ్యే!

Publish Date:Sep 3, 2016

Advertisement


మన పురాణాల్లోని కథలు మీరెప్పుడైనా గమనించారా? చాలా మంది తపస్సు చేస్తుంటారు. వెంటనే బ్రహ్మో, శివుడో ప్రత్యక్షం అవుతుంటారు. వాళ్లని తపస్సు చేసిన వారు మరణం లేకుండా వరం ఇవ్వమంటారు. అది కుదరదని నానా రకాల ఇతర టెంప్టింగ్ ఆఫర్స్ అందిస్తారు దేవుళ్లు! అవ్వన్నీ విని కొందరు సంబరపడిపోయి అమాయకంగా ఓకే చేసేస్తారు! మరికొందరికి ఆ వరాలన్నీ ఉత్తివే అని తెలిసినా, మరణం తప్పదని అర్థమైనా... కష్టపడి తపస్సు చేశాం కదా అని తలాడిస్తారు! లేదంటే ఏ వరమూ ఇవ్వకుండా దేవుడు మాయమైపోవచ్చు! అదీ ప్రాబ్లం...


ఈ ఇంట్రడక్షన్ అంతా ఎందుకు అంటే... ప్రస్తుతం హాట్ టాపిక్ గా నడుస్తోన్న ప్రత్యేక ప్యాకేజ్ గురించే! మీరు సరిగ్గా గమనించారో లేదో చర్చ అటు తిరిగి ఇటు తిరిగి ఈ మధ్య ఎక్కడి దాకా వచ్చిందంటే... మీడియాలో నేరుగా ప్రత్యేక ప్రకటన, ప్రత్యేక ప్యాకేజీ అనౌన్స్ మెంట్ అనేస్తున్నారు! అసలు ప్రత్యేక హోదా అన్న పదమే తక్కువగా వినిపిస్తోంది! అది పూర్వకాలంలో తపస్సు చేశాక మరణం లేకుండా వరం ఇమ్మన్నట్టుగా తయారైపోయింది! ప్రత్యేక హోదా ఆంధ్రుల తీరని కోరికే తప్ప ప్రాక్టికల్ గా వర్కవుట్ అయ్యేది కాదు అన్నట్టుగా వుంది ఛందం!

 

మీడియా, తెలివైన మేధావులు, వాళ్లకంటే తెలివైన రాజకీయ నాయకులు అంతా కలిసి గత కొన్ని రోజుల్లో ప్రత్యేక హోదా అనేది అసాధ్యం అన్నట్టుగా కలరింగ్ ఇచ్చేశారు. ఎక్కడైనా ఎవరైనా ప్రత్యేక హోదా కావాల్సిందే అనే స్టేట్మెంట్ ఇస్తే ... వాళ్లది వితండవాదం అన్నట్టుగా, స్కూలుకు పోనని ఏడుస్తున్న చిన్న పిల్లల పెంకితనం మాదిరిగా బిల్డప్ ఇస్తున్నారు! జనం కూడా ప్రత్యేక హోదా అనేది ... రెండు కాళ్లు లేని వాడు నాట్యం చేయటం లాంటిది, రెండు చేతులు లేని వాడు కుస్తీ పట్టు పట్టడం లాంటిది అన్నట్టుగా లైట్ తీసుకుంటున్నారు!

 

ఏపీకి ప్రత్యేక హోదా... దీన్ని అసలు ఎవరు ఇస్తామన్నారు? కేంద్రం! కాని, ఇప్పుడు కుదరదని చెప్పకనే చెబుతోన్నది ఎవరు? కేంద్రమే! అప్పుడు ఇస్తామన్నది యూపీఏ. ఇప్పుడు ఇవ్వటం కుదరదని చెబుతోన్నది ఎన్డీఏ. ఆంధ్ర ప్రజల అభిప్రాయం, వాళ్లకు జరిగే లాభ, నష్టాలు ఇవేవీ చర్చలోకే రావటం లేదు. ప్యాకేజీ ఇస్తాం, పారిశ్రామిక అభివృద్ధికి నిధినిస్తాం, హోదాలో వుండే లాభాలన్నీ ప్యాకేజీలోనే ఇచ్చేస్తాం అంటూ బురిడీ మాటలు చెప్పేస్తున్నారు! అన్నీఇచ్చేదే వుంటే... హోదానే ఇవ్వొచ్చు కదా? ఇక్కడే వుంది అసలు ట్విస్ట్!

 

ఢిల్లీ ప్రభుత్వం... ''హోదాలో వున్న సరుకంతా ఇస్తాం కాని, దానికి ప్యాకేజీ అని లేబుల్ పెడతాం... '' అనటం ఎలాగుందంటే... చీరా, సారె, నగలు, నట్రా అన్నిటితో అలంకరించిన పెళ్లికూతుర్ని ఇస్తాం... కాని, ఆ పెళ్లి కూతురు బొమ్మ పెళ్లి కూతురు! మనిషి కాదు అన్నటుగా వుంది! హోదా కాకుండా ప్యాకేజీ ఇవ్వటం అంటే.... అయిదేళ్లో, పదేళ్లో ఆంధ్ర రాష్ట్రానికి అన్ని ఖర్చులు భరించి వైద్యం చేయించటం! ప్యాకేజీ అంటే ... కెమెరాల ముందు మంచం వద్దకొచ్చి.. పళ్లు, బ్రెడ్డు అందించి చెక్కేయటం! ఈ తేడా మన మీడియా, మేధావులు, జనం గుర్తించాలి! రాజకీయ నాయకులు తెలిసినా తెలియనట్లు నటించే అవకాశాలే పుష్కలం...

By
en-us Political News

  
ఇటు జగన్ కు, ఆయన పార్టీ వైసీపీకీ, అలాగే అటు కేటీఆర్ కు, బీఆర్ఎస్ కు కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వ నిర్ణయాలను సమర్ధించడం, మద్దతు పలకడం అత్యావశ్యకం. ఇక్కడ బీఆర్ఎస్ అయితే ఏకంగా బీజేపీలో కలిసిపోవడం ఖాయం అన్న మాట వినిపిస్తోంది. మిగిలేది టీఆర్ఎస్ ప్రతిరూపంగా తెలంగాణ జాగృతి ఒక్కటేనని గత కొంత కాలంగా ఒక ప్రచారం అయితే జోరుగా నడుస్తోంది.
వైసీపీలో ఇప్పుడు పేర్ని నాని పాటి నోరున్న నేతలు వేళ్ల మీద లెక్కపెట్టగలిగేంత మందే ఉన్నారు. దీంతో పేర్ని నాని అనివార్యంగా రాజకీయాలలో క్రియాశీలంగా ఉండడమన్నది.. ఆయనకు తన కుమారుడి రాజకీయ భవిష్యత్ దృష్ట్యా మాత్రమే కాకుండా, రాష్ట్రంలో వైసీపీ ఉనికికి కూడా ఒక అవసరంగా మారిపోయింది.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మరో కీలక నేత రాజిరెడ్డితో కలిసి లొంగిపోవడం సంచలనంగా మారింది.
గాంధీల కుటంబానికి మ‌న‌మంతా ఒక చేయి వేసి వెయ్యి కోట్ల రూపాయ‌లు విరాళంగా ఇద్దాం. ఇదీ ఇటీవ‌ల రేవంత్ చేసిన కామెంట్.
కనీసం తండ్రిని నాన్నా అని కూడా సంబోధించకుండా, బీఆర్ఎస్ అధినేత అన్న ప్రస్తావన కూడా చేయకుండా కేవలం పొడి మాటలతో కవిత చెప్పిన శుభాకాంక్షలపై రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
వాస్తవానికి వైసీపీ ఆరోపణలు, విమర్శల స్థాయి రోజురోజుకూ పతనం నుంచి పతనానికి అన్నట్లుగా దిగజారుతోంది. జగన్ సొంత మీడియాలో లోకేష్ శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన పాకిస్థాన్, ఇండియా మ్యాచ్ చూడడానికి వెళ్లిన ప్రైవేట్ పర్యటనపై చేసిన ఆరోపణలు అవాస్తవంగా తేలడంతో ఆ పార్టీ ప్రతిష్ఠ మరింత దిగజారింది.
అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు, పని తీరు, ప్రజా సంక్షేమం చూసి వారంతట వారే స్వచ్ఛందంగా పార్టీలో చేరారని ఘనంగా ప్రకటించుకుంది. ఇప్పుడు అదే పరిస్థితి రివర్స్ లో కనిపిస్తుంటే మాత్రం.. ప్రజాస్వామ్యం ఖూనీ, మా పార్టీ వారికి కాంగ్రెస్ గేలం అంటూ గుండెలు బాదుకుంటోంది. పైగా ఆ ఆరోపణలను స్వయంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుకు కల్వకుంట్ల తారకరామారావు నుంచే రావడంతో తెలంగాణ సమాజం ముక్కున వేలేసుకుంటోంది.
పార్టీ నుంచి సస్పెండైన ఇద్దరు ఎమ్మెల్సీలు కలిశారు. జగన్ వారితో ఆప్యాయంగా మాట్లాడారు. పార్టీ గొంతు బలంగా వినిపించాలని వారికి దిశానిర్దేశం చేశారు.
ఇక అది పక్కన పెడితే ప్రతిపక్ష హోదా డిమాండ్ నుంచి వెనక్కు తగ్గి కేవలం హాజరు కోసం బుధవారం సభకు హాజరైన జగన్ కు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలకూ వ్రతమూ చెడింది, ఫలమూ దక్కలేదని అంటున్నారు. ఎందుకంటే బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది.
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఉండవల్లిని పరామర్శించిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై నెటిజనులు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు.
ఇప్పటి వరకూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బాయ్ కాట్ చేసినా.. సభలో చర్చించిన అంశాలు, ఆమోదించిన బిల్లులపై తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొని ఆ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ ప్రెస్‌మీట్లు పెట్టి మాట్లాడుతూ వచ్చారు. శాసనసభకు రాకపోయినా ఆ విధంగా తన అభిప్రాయాలు ప్రజలకు తెలియజేస్తే సరిపోతుందని జగన్ స్వయంగా ప్రకటించారు కూడా.
కేంద్ర ఎన్నికల సంఘం టీవీకే పార్టీకి విజిల్ గుర్తు కేటాయించింది. ఈ నేపథ్యంలో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో విజిల్ సౌండ్ పై ప్రభుత్వం నిషేధం విధించింది. ఎన్నికల కోడ్ అమలులోకి రాకుండానే విజల్ పై బ్యాన్ విధించడంతో విజయ్ టీవీకే పార్టీ అంటే అధికార డీఎంకే భయపడుతోందా అన్న చర్చ మొదలైంది.
ప‌రామార్శ పేర బలప్రదర్శనలకు దిగడం జగన్ కు రివాజుగా మారిపోయిందంటున్నారు. బలప్రదర్శన పేర జరిగే ఈ నాటకాన్ని రక్తికట్టించేందుకు పేర్ని నాని వంటివారు జగన్ కు ఇతోధికంగా సహాయపడుతుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.