ఏపీ ప్రజల నిర్ణయం అదేనా?..మోడీ వరుస ట్వీట్లు చెబుతున్నదేమిటి?

Publish Date:Mar 17, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ పాలన అంతం కోరుకుంటున్నారా? వచ్చే ఎన్నికలలో వారు అన్ కండీషనల్ గా ఎన్డీయే కూటమికే ఓటు వేయాలన్న నిర్ణయానికి వచ్చేశారా? అంటే చిలకలూరి పేటలో ఆదివారం (మార్చి 17) సాయంత్రం జరిగిన ప్రజాగళం సభ తరువాత మోడీ వరుస ట్వీట్లు చేస్తే ఔననే అనిపిస్తున్నది. నిజం. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రధాని మోడీ ప్రజాగళం సభలో ప్రసంగించిన తరువాత గంటల వ్యవధిలోనే  తన ఎక్స్ ఖాతా వేదికగా వరుస ట్వీట్లు చేశారు.

అభివృద్ధి కోసం, అవినీతి రహిత పాలన కోసం ఏపీ జనం ఈ సారి ఎన్నికలలో ఎన్డీయే కూటమికే ఓటు వేయాలన్న నిర్ణయానికి వచ్చేశారని ఆయన పేర్కొన్నారు. అంతకు ముందు ప్రజాగళం సభలో ఆయన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్ లతో కలిసి వేదిక పంచుకున్నారు. ఆ సభలో ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్ల జగన్ పాలన మొత్తం అవినీతి మయం అని విమర్శించారు. ప్రజలు జగన్ పాలనను అంతం చేసి ఎన్డీయేకు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. అయితే సభ ముగిసిన తరువాత గంటల వ్యవధిలోనే ఆయన తన ఎక్స్ ఖాతాలో వరుస పోస్టింగులు పెట్టడం విస్తుగొలిపింది. సభకు వచ్చిన ప్రజాస్పందనకు ముగ్ధుడైన మోడీ.. ఏపీ ప్రజలు జగన్ పాలనకు తెరదించడానికి నిర్ణయం తీసేసుకున్నారని ఫిక్స్ అయ్యారని బీజేపీ శ్రేణులే కాదు, ఆయన పోస్టులు చూసిన పరిశీలకులు సైతం చెబుతున్నారు. 

ప్రజాగళం సభ ముగిసిన అనంతరం మోడీ చేసిన ట్వీట్లు ఇలా ఉన్నాయి. 


మొదటి ట్వీట్ లో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఎన్డీయేకు మద్దతుగా నిలవాలని నిర్ణయించేసుకున్నారు. ఎన్డీయే అభివృద్ధి అజెండాకే వచ్చే ఎన్నికలలో ఓటు వేయాలని డిసైడైపోయారు. పల్నాడులో ప్రజాగళం సభ అదే చెప్పిందని పేర్కొన్నారు. ఆ తరువాత కొద్ది సేపటికే మరో ట్వీట్ చేసిన ప్రధాని ఆ ట్వీట్ లో  చిలకలూరి పేట సభ ఘన విజయం ఎన్డీయేకు ప్రజా మద్దతును ఎలుగెత్తి చాటింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీలు మాత్రమే అభివృద్ధి చేయగలవనీ, వైసీపీ అవినీతి, దుష్టపాలనకు వ్యతిరేకంగా జనం ఆ జగన్ ప్రజావ్యతిరేక పాలనకు చరమగీతం పాడాలన్న నిశ్చయంతో ఉన్నారనీ పేర్కొన్నారు.  ఇక ఆ తరువాత చేసిన ట్వీట్ లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ప్రజలు ఎన్డీయే ఎంపీలు, ఎమ్మెల్యేలనూ అధికసంఖ్యలో ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.  

ఆ తరువాత కొద్ది సేపటికే తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు నివాళులర్పిస్తూ చేసిన ట్వీట్ లో ఏపీ పురోగతి కోసం ఎన్టీఆర్ దార్శనికతను కొనియాడారు. ఆయన ఆశయాల సాధనకు ఎన్డీయే పని చేస్తుందని హామీ ఇచ్చారు. ఆ తరువాతి ట్వీట్ లో ఆయన ఏపీ ప్రజలు  వైసీపీని ఓడించాలి, ఎన్డీయేకు ఓటు వేయాలన్న విషయాలలో స్పష్టంగా ఉన్నారని పేర్కొన్నారు.  ఆ తరువాత అవే ట్వీట్లను ప్రధాని మోడీ తెలుగులో కూడా పోస్టు చేశారు. మొత్తం మీద చిలకలూరి పేట సభకు వచ్చిన ప్రజాస్పందన సందేహాలకు అతీతంగా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్న ప్రజా నిర్ణయాన్ని నిర్ద్వంద్వంగా చాటిందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
యాక్సిస్ మై ఇండియాతన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది.
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.