Publish Date:Jan 30, 2025
ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా హరీశ్ గుప్తాను నియమిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీకాలం ఈ నెల 31వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో హరీశ్ గుప్తాను కొత్త డీజీపీగా నియమించింది. ఈయన గతంలో కూడా ఒక సారి రాష్ట్ర డీజీపీగా పని చేశారు. గత ఏడాది ఎన్నికల సమయంలోనూ హరీశ్ గుప్తాను ఎన్నికల సంఘం డీజీపీగా నియమించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత ద్వారకా తిరుమలరావును డీజీపీగా నియమించింది.
ఇప్పుడు మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం హరీష్ గుప్తాను డీజీపీగా ఎంపిక చేసింది. 1992 బ్యాచ్కు చెందిన ఈయన ప్రస్తుతం విజిలెన్స్ డీజీగా ఉన్నారు. ఒక సారి డీజీపీగా పని చేసిన అధికారికి మరోసారి డీజీపీగా బాధ్యతలు అప్పగించడం చాలా చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఈ కారణంగా ఏపీ డీజీపీగా హరీష్ కుమార్ పగ్గాలు చేపట్టనుండటం ప్రత్యేకతను, ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం కొత్తగా డీజీపీ బాధ్యతలు చేపట్టనున్న హరీష్ కుమార్ గుప్తాను గత ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం ఏపీ డీజీపీగా ఎంపిక చేసింది. అప్పటి వరకూ రాష్ట్ర డీజీపీగా ఉన్న కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని తప్పించి హరీష్ కుమార్ ను ఎంపిక చేసింది. దీంతో హరీష్ కుమార్ 2024 మే 6 నుంచి 2024 జూన్ 19 వరకు ఆయన డీజీపీగా ఉన్నారు.
హరీష్ కుమార్ గుప్తా 1992 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. జమ్మూ కాశ్మీర్ కు చెందిన ఈయన కెరీర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఖమ్మం జిల్లా ఏఎస్పీగా మొదలైంది. ఆ తరువాత ఆయన మెదక్, పెద్దపల్లి లలొఏఎస్పీగా పని చేశారు. అదనపు ఎస్పీగా కరీంనగర్‌లో పని చేశారు. కృష్ణా, నల్గొండ జిల్లాల్లో ఎస్పీగా పని చేసిన ఆయన ఆ తరువాత సీఐడీలో ఎస్పీగా పని చేశారు.
ఇక 2017 నుంచి 2019 వరకు లా అండ్ ఆర్డర్ విభాగంలో అడిషనల్ డీజీగా పని చేసిన హరీష్ కుమార్ గుప్తా ఆ తరువాత పోలీసు రిక్రూర్‌మెంట్ బోర్డు చైర్మన్‌గాను, హోం శాఖ ముఖ్య కార్యదర్శిగాను పని చేశారు. ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డీజీగా ఉన్నారు. ఈ మధ్యలో ఆయన హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో సౌత్‌జోన్ డీసీపీగా పని చేశారు. తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మంట్ విభాగానికి డీఐజీగా కూడా విధులు విర్వర్తించారు. అలాగే గుంటూరు రేంజ్ ఐజీగాను బాధ్యతలు నిర్వర్తించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-new-dgp-harish-kumar-gupta-career-progressed-like-39-192063.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.