ఏపీ నూతన సీఎస్ గా సాయిప్రసాద్.. బాధ్యతల స్వీకరణ ఎప్పుడంటే?

Publish Date:Feb 27, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్ గా జీ. సాయిప్రసాద్ ను నియమించిన సంగతి విదితమే.   గత ఏడాది నవంబరు 29వ  ప్రస్తుత సిఎస్ విజయానంద్ పదవీ కాలాన్ని మూడు మాసాలు అంటే ఈనెల 28  వరకూ పొడిగిస్తూ, అలాగే  తదుపరి సిఎస్ గా ప్రస్తుతం జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా,  స్పెషల్ సిఎస్ టు సియంగా ఉన్న సాయి ప్రసాద్ ను తదుపరి సీఎస్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల మేరకు సాయిప్రసాద్ ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్ గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.

1991 ఐఏఎస్ బ్యాచ్ ఎపి క్యాడర్ కు చెందిన సాయి ప్రసాద్  1991 సెప్టెంబరు 15న ఐఏఎస్ కు ఎంపికై 1992 జూన్ నుంచి 1993 మే వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వరంగల్ అసిస్టెంట్ కలెక్టర్ గా పని చేశారు. అనంతరం 1993 సెప్టెంబరు నుంచి 1995 ఏప్రిల్ వరకు పాడేరు అసిస్టెంట్ కలెక్టర్ గా,1995 ఆగస్టు నుంచి 1997 మార్చి వరకు గుంటూరు మున్సిపల్ కమిషనర్ గా పని చేశారు.  1997 మే నుంచి 1998 ఆగస్టు వరకు కడప జాయింట్ కలెక్టర్ గా, ఆ తరువాత 2000 జూలై నుండి 2003 జూన్ వరకూ కర్నూల్ కలెక్టర్ గా పని చేశారు. ఇక  2003 జూన్ నుండి 2003 అక్టోబరు వరకు చిత్తూరు జిల్లా కలెక్టర్ గా, 2003 అక్టోబరు నుండి 2004 ఆగస్టు వరకు ఎపి ట్రాన్సుకో జెఎండిగా, 2004 ఆగస్టు నుండి 2006 మే వరకు ఇపిడిపిసిఎల్ సిఎండిగా, 2006 మే నుండి 2010 ఫిబ్రవరి వరకు ఎపి సిపిడిసిఎల్ సిఎండిగా పని చేశారు. 2010 ఫిబ్రవరి నుండి 2011 అక్టోబరు వరకు ఎపి హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా పని చేశారు.

అనంతరం 2011 అక్టోబరు నుండి 2014 జూన్ వరకు కేంద్ర ప్రభుత్వ ఇంధన శాఖ సంయుక్త కార్యదర్శిగా పని చేశారు. ఇఖ  2014 జూన్ నుండి 2016 ఫిబ్రవరి వరకు సిఎం కార్యదర్శిగా, 2016 ఫిబ్రవరి నుండి 2019 మే వరకు సిఎం ముఖ్య కార్యదర్శిగా పని చేశారు. తదుపరి 2020 జనవరి నుండి 2022 ఫిబ్రవరి వరకు ఎపి సోలార్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కు సిఎండి, ఇంధన శాఖ ఎక్స్ అఫిషియో ప్రిన్సిపల్ సెక్రెటరీగాను పని చేశారు. అనంతరం 2022 ఫిబ్రవరి నుండి 2024 జూన్ వరకు సిసిఎల్ఏగా పనిచేశారు. తదుపరి 2024 జూన్ నుండి 2025 జనవరి దాకా జలవరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ 2025 జనవరి నుండి అదే హోదాలో పనిచేస్తూ సిఎం ఎక్స్ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగాను పని చేస్తున్నారు.  

By
en-us Political News

  
యుద్ధం సృష్టించిన మానవ విషాదాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ఇరాన్ ప్రతినిధి బృందం యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులకు చెందిన రక్తసిక్తమైన స్కూల్ బ్యాగులు, బూట్లు, వారి ఛాయాచిత్రాలను తమ వెంట తీసుకువచ్చింది.
గడిచిన ఆర్థిక సంవత్సరంలో అంటే 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు మొత్తం 13,95,43,231 లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది భారీ పెరుగుదల. 2024-25 కాలంలో 12,18,53,535 లడ్డూలు అమ్ముడవగా, కేవలం ఒక్క ఏడాది వ్యవధిలోనే అదనంగా సుమారు 1.76 కోట్ల లడ్డూల విక్రయాలు పెరగడం గమనార్హం.
సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లే వందే భారత్ రైలు ఆక్యుపెన్సీ రేటు 100 శాతానికి పైగా నమోదవుతోంది. కొన్ని సందర్భాల్లో వెయిటింగ్ లిస్ట్ కూడా భారీగా ఉంటోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న ఇతర రైళ్లతో పోలిస్తే, సికిందరాబాద్, విశాఖ మార్గంలో నడిచే వందే భారత్ లో ప్రయాణానికే ప్రయాణీకులు మొగ్గు చూపుతున్నారు.
ఐలాపురంలోని సర్వే నంబర్ 101లో సుమారు 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిలో గత కొంతకాలంగా అక్రమార్కులు పాగా వేసి నివాసాలను, బహుళ అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే సుమారు 400 గజాలకు పైగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఒక బిల్డర్ ఆరంతస్తుల భవనాన్ని నిర్మించారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న హైడ్రా బృందం, భారీ పోలీసు బందోబస్తు నడుమ ఘటనా స్థలానికి చేరుకుని కూల్చివేతలు చేపట్టింది.
ఖాజీపేటలో ఒక విద్యార్థిని ప్రేమోన్మాది చేతిలో బలవ్వగా, రాజూపాలెం మండలంలో పాత కక్షలు ఒక యువకుడి ప్రాణాన్ని బలితీసుకున్నాయి. ఈ రెండు ఘటనలు జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితికి, యువతలో పెరుగుతున్న హింసా ప్రవృత్తికి అద్దం పడుతున్నాయి.
202 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టుకు వైభవ్ సూర్యవంశీ మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 26 బంతుల్లోనే 78 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ కేసులో ఆయనను దోషిగా తేల్చిన అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ వరలక్ష్మి, ఆరు నెలల సాధారణ జైలు శిక్షతో పాటు 5 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
అన్‌క్యాప్డ్ ప్లేయర్లు, అండర్-19 ప్రతిభావంతులు మెగా లీగ్‌లో అనుభవజ్ఞులను అధిగమిస్తూ, కీలకమైన మ్యాచుల్లో విజయావకాశాలను మారుస్తూ రికీ పాంటింగ్ వంటి కోచ్‌ల ప్రశంసలు పొందుతున్నారు. తాజాగా ఐపీఎల్ ప్లాట్‌ఫారమ్‌పై లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కుర్రాడు ముకుల్ చౌదరి అందరి దృష్టి ఆకర్షిస్తున్నాడు.
మహిళా భద్రతకు మరింత బలం చేకూర్చేలా షీ నేత్ర పేరిట ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. నగర కమిషనరేట్ పరిధిలోని ఏడు జోన్లకు ఒక్కో బృందం చొప్పున మొత్తం ఏడు ప్రత్యేక టీమ్స్‌ను రంగంలోకి దించారు.
మదీనా కాలనీలో ఉన్న సలామి కోల్డ్ స్టోరేజ్‌ లో కుళ్ళిన మాంసాన్ని విక్రయిస్తున్నట్లుగా అందిన విశ్వసనీయ సమాచారం మేరకు బాలాపూర్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కనీస పారిశుద్ధ్యం లేకుండా, మాంస వ్యర్థాలను నిల్వ ఉంచినట్లుగా అధికారులు గుర్తించారు.
గతంలో బడ్జెట్ లీక్ అయితే 30 మంది మంత్రులు రాజీనామా చేశారని, ఎన్టీఆర్ ఎవరూ లేకుండా 15 రోజులు ప్రభుత్వాన్ని నడిపారని చంద్రబాబు గుర్తు చేశారు. అలాగే. పేపర్ లీక్ కేసులో గతంలో ఓ మంత్రి రాజీనామా చేసిన విషయాన్నీ ప్రస్తావించారు.
పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నడుమ ప్రపంచ వ్యవస్థ గణనీయమైన పరివర్తనకు లోనవుతున్న తరుణంలో, భారతదేశం ఆర్థిక వృద్ధికి కీలక చోదకంగా తనను తాను నిలబెట్టుకుంటోంది.
లొంగిపోయిన వారిలో ప్రధానంగా పీఎల్జీఏ బెటాలియన్ ఇన్-చార్జ్ కమాండర్ సోది కేశాలు, , తెలంగాణ స్టేట్ కమిటీ మిలిటరీ చీఫ్ చప నారాయణ అలియాస్ మధు, డివిజనల్ కమిటీ సభ్యుడు కడ్తి సన్ను అలియాస్ మంతు వంటి అగ్రశ్రేణి నాయకులు ఉన్నారు. వీరితో పాటు మొత్తం 42 మంది క్యాడర్ బయటకు రావడంతో తెలంగాణలో మావోయిస్టు సంస్థాగత నిర్మాణం దాదాపుగా కుప్పకూలిందని పోలీసు వర్గాలు ప్రకటించాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.