Publish Date:Jan 27, 2022
ఒక పక్కన కొత్త పీఆర్సీ వద్దు.. పాత పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇవ్వాలంటున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు.. వారికి ట్రెజరీ సిబ్బంది కూడా మద్దతుగా నిలిచారు. ట్రెజరీ ఉద్యోగులు కూడా పీఆర్సీ ఉద్యమంలో భాగం అయ్యారు. కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు, పెన్షన్ బిల్లులు ప్రాసెస్ చేయాలని జగమొండి జగన్ సర్కార్ ట్రెజరీ సిబ్బందిపై తీవ్రంగా ఒత్తిడి పెంచుతోంది. రివైజ్ డ్ పేస్కేల్ కు సంబంధించిన ప్రక్రియను ట్రెజరీ సిబ్బంది ప్రారంభించ లేదు. ఈ నేపథ్యంలో భారత గణతంత్ర దినోత్సవం నాడు సెలవు రోజైనా రాష్ట్ర ఆర్థికశాఖ ఓ సరికొత్త సర్క్యులర్ జారీ చేయడం కలకలం రేపుతోంది. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ ఎస్ రావత్ సర్క్యులర్ విడుదల చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి నెల వేతనాలు, పెన్షన్ బిల్లులను రివైజ్డ్ పే స్కేల్ 2022ను అనుసరించి ప్రాసెస్ చేయాలంటూ ఆ సర్క్యులర్ లో ట్రెజరీ ఉద్యోగులను ఆయన ఆదేశించారు. రివైజ్డ్ పే స్కేల్ ప్రకారం బిల్లుల ప్రక్రియ నిర్వహించకపోతే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కూడా ఆ సర్క్యులర్ లో ఎస్ ఎస్ రావత్ హెచ్చరించడం గమనార్హం. చెప్పిన పని చేయకపోతే డీడీఓలు, పీఏఓలు, ట్రెజరీ అధికారులపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఫిబ్రవరి 1వ తేదీ నాటికి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు జమ అయ్యేలా చర్యలు చేపట్టాలని ట్రెజరీ అధికారులకు ఆర్థిక శాఖ సూచించింది.
అయితే.. గత కొన్ని నెలలుగా వైసీపీ సర్కార్ ఉద్యోగులకు ప్రతి నెలా ఠంచన్ గా ఫస్ట్ తారీఖునే జీతాలు ఇవ్వడం లేదనేది ఇక్కడ ప్రస్తావించదగ్గ అంశం. కొత్త పీఆర్సీ వద్దు, పాత పీఆర్సీ ప్రకారమే తమకు జీతాలు ఇవ్వాలని పట్టుబట్టి, ఫిబ్రవరి 6 నుంచి సమ్మెలోకి వెళ్తున్న ఉద్యోగులపై కక్షతోనే ఏపీ సర్కార్ ఇలా వేధింపుల సర్క్యులర్ జారీ చేసిందని ఉద్యోగ సంఘాల నేతలు ఫైరవుతున్నారు. జీతాల బిల్లులు ప్రాసెస్ చేయబోమంటున్న ట్రెజరీ సిబ్బందిపై ఇలా సర్క్యులర్ జారీచేయడాన్ని తప్పుపడుతున్నారు. పైగా టైమ్ లైన్ విధిస్తూ.. గురువారం సాయంత్రంలోగా రివైజ్డ్ బిల్లులు అప్ లోడ్ చేయాలని పే అండ్ అకౌంట్స్ విభాగంలోని డీడీఓలకు సర్క్యులర్ లో సూచించడాన్ని ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్ర ఆర్థిక శాఖ ఇలా ఒత్తిడి పెంచుతూ సర్క్యులర్ జారీ చేయడంపై పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాసరావు ఫైరవుతున్నారు. వేతన సవరణపై అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో నిర్ణయించి మధ్యంతర భృతి 27 శాతం కన్నా ఫిట్ మెంట్ తక్కువకు అంటే 14.29 శాతానికే పరిమితం చేయడం ఏంటని నిలదీస్తున్నారు. ఇలా ఐఆర్ కన్నా ఫిట్ మెంట్ తక్కువ ఇచ్చిన దాఖలాలు చరిత్రలో లేవంటున్నారు.
ఒక పక్కన ట్రెజరీ ఉద్యోగుల సహాయ నిరాకరణ.. మరో పక్కన రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరితో జనవరి నెల జీతాలు అందుతాయో లేదో అని పలువురు చిన్నా చితకా ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-new-circular-on-new-pay-scale-39-130815.html
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.