జైలుకు ఏపీ మ‌హేష్ బ్యాంక్ డైరెక్ట‌ర్లు

Publish Date:Aug 31, 2022

Advertisement

కోర్టు ధిక్కరణ నేరం రుజువవడంతో హైదరాబాద్‌లోని ఏపీ మహేశ్‌ బ్యాంకు ఎండీ,సీఈవో సహా 11 మందికి హైకోర్టు జైలు శిక్ష విధించింది. 15 రోజుల సాధారణ జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధిస్తూ జస్టిస్‌ పి.నవీన్‌రావు ధర్మాసనం   తీర్పు వెలువరించింది. ఏపీ మహేశ్‌ కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు సొసైటీకి ఎన్నికలు నిర్వహించే విషయంలో సొసైటీకి చెందిన రెండు వర్గాల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఓటర్ల జాబితా రూపకల్పనలో అక్రమాలు జరిగాయని, ఎన్నికల నిర్వహణను నిలిపేయాలని పలువురు కోర్టును ఆశ్రయించారు. 
విచారణ చేపట్టిన హైకోర్టు గత ఏడాది జనవరిలో కామన్‌ ఆర్డర్‌ జారీ చేసింది. ఎన్నికల ఫలితాలు ప్రకటించవచ్చనీ.. అయితే తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు కొత్తగా ఎన్నికైన డైరెక్టర్లు ఎటువంటి విధానపరమైన నిర్ణయాలూ తీసుకోరాదని తెలిపింది. అయితే హైకోర్టు తీర్పునకు విరుద్ధంగా రూ.100 కోట్ల మేర రుణాలు జారీ చేశారని.. పేర్కొంటూ బ్యాంకు షేర్‌హోల్డర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేసింది. వాదనలు విన్న ధర్మాసనం డైరెక్టర్ల బోర్డు కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడినట్లు నిర్ధారించింది. కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు తేలినందున వారికి 15 రోజుల సాధారణ జైలుశిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.

ఇప్పటి వరకూ వ్యక్తుల ఖాతాలపై దాడి చేసి దోచుకున్న నేరగాళ్లు ఏకంగా బ్యాంక్‌ సర్వర్‌నే హ్యాక్‌ చేశారు. మహేష్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంకు సర్వర్‌ను హ్యాక్‌ చేసి రూ.12.90 కోట్లు లాగేశారు. బ్యాంకు సాంకేతిక సిబ్బంది స్పందించే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బ్యాంకు మెయిన్‌ సర్వర్‌ను హ్యాక్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు దోచుకున్న మొత్తాన్ని 100 వేర్వేరు ఖాతాలకు బదిలీ చేసేశారు. ఈ కేసుని సవాల్ గా తీసుకున్న పోలీులు.. నిధులు కాజేసిన ప్రధాన సూత్రధారిని గుర్తించారు. నైజీరియా నుంచే బ్యాంకు సర్వర్లను హక్ చేసి డబ్బు కొట్టేసినట్లు కనుగొన్నారు. భారత్‌లో ఉండి నైజీరియన్ కి సపోర్ట్ చేసిన కీలక సూత్రధారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 సైబర్ నేరగాళ్లు డబ్బుని బదిలీ చేసిన ఖాతాలన్నీ ప్రస్తుతం ఫ్రీజ్ అయి ఉన్నాయి. కోర్టులో కేసు నడుస్తోంది. అయితే కోర్టు అనుమతి లేకుండా బ్యాంకు లావాదేవీలు జరిపినట్లు కోర్టు దృష్టికి వచ్చింది. దీన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. కోర్టు ఆదేశాలు ఉల్లంఘించినందుకు బ్యాంకు చైర్మన్ తో పాటు 10 మంది డైరెక్టర్లకు జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

By
en-us Political News

  
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్‌మెన్‌లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.