సిట్ విచారణకు హాజరైన ఎంపీ మిథున్‌రెడ్డి
Publish Date:Jul 19, 2025
Advertisement
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి విజయవాడలో సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ మేరకు ఢిల్లీలో ఉన్న ఆయన కాసేపటి క్రితం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి విజయవాడలోని సిట్ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఆయన ఈ కేసులో ఏ4గా ఉన్నారు. ఇప్పటికే మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. శుక్రవారం సుప్రీంకోర్టు కూడా ఆయన పిటిషన్‌ను తోసిపుచ్చింది. మిథున్‌రెడ్డి రాక నేపథ్యంలో సిట్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాల రాకపోకలను పోలీసులు నియంత్రిస్తున్నారు ఈ క్రమంలోనే ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ కక్షతో పెట్టిన తప్పుడు కేసు ఇది అని.. ఎట్టి పరిస్థితుల్లో ఇది నిలబడదని అన్నారు. నోటి మాటలతో తనపై అక్రమంగా కేసులు బనాయించారని, అందుకు ఎలాంటి సాక్ష్యాధారాలు మిథున్‌రెడ్డి తెలిపారు.
http://www.teluguone.com/news/content/ap-liquor-scam-case-39-202265.html





