నారాయణకే తెలియని మర్మం...?
Publish Date:Jun 29, 2025

Advertisement
ఏపీ లిక్కర్ స్కాం.. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అంశం ఇది. గత ప్రభుత్వం మద్యం కుంభకోణంలో కోట్లాది రూపాయలు దొడ్డిదారిన స్వాహా చేసి బినామీ కంపెనీలు.. హవాలా మార్గంలో తెచ్చుకుని ఎన్నికలకు వినియోగించారనేది సిట్ విచారణలో వెలుగులోకి వస్తున్నాయి. మద్యం కుంభకోణం తిరుపతితో కూడా సంబంధాలు ఉన్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతని కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సహా అనుచరులు, స్నేహితులు పాత్ర ఉందని స్పష్టం అయ్యింది.
ఇక కీలక పాత్రధారి పెద్దిరెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సహా తిరుపతి, శ్రీకాళహస్తి కి చెందిన పలువురు దొంగ కంపెనీలతో సిండికేట్ గా ఐదేళ్ల పాటు అక్రమ మార్గంలో సక్రమంగా మద్యం నిధులు కొల్లగొట్టారు. ఇంత జరుగుతున్న గత ఐదేళ్ల లో ఎక్సైజ్ శాఖ మంత్రి గా, డిప్యూటీ సీఎం గా, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే గా పని చేసిన కె.నారాయణ స్వామి పాత్ర పై సిట్ ఆలోచించిందా... లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఏపీ మద్యం కుంభకోణంలో ఒక మంత్రిగా డమ్మి వ్యక్తిని సొంత జిల్లాలోనే పెట్టుకుని ఇలా మద్యం కుంభకోణం చేశారనే ఆరోపణలు లేకపోలేదు.
ఇటీవల నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తన పర్యటనలో నారాయణ స్వామికి సంతకం పెట్టలేదు కూడా రాదని అన్నాడు అని వ్యాఖ్యానించారు... అయితే సంతకం కూడా రాని వ్యక్తి ఐదేళ్లలో మంత్రిగా పని చేసారా...? సంతకం రాని వ్యక్తికి... కాదు కాదు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కి కూడా తెలియకుండా ఇంత కుంభకోణం జరిగిందా.. లేదా తెలిసినా సహకరించారా.. భవిష్యత్తులో మాజీ మంత్రి హస్తం పై విచారణ జరిగే అవకాశం ఉందా అనేది తేలాల్సి ఉంది. నారాయణ స్వామిని వద్ద మద్యం కుంభకోణం పేరు ఎత్తగానే చిరెత్తుకొచ్చి నువ్వే చెప్పు చంద్రబాబు కు నన్ను అరెస్టు చేయమని అంటూ రుసరుసలాడారు. త్వరలో మద్యం కుంభకోణం ఎంతవరకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే.
http://www.teluguone.com/news/content/ap-liquor-scam-25-200890.html












