ఏపీలో సంక్రాంతి.. మందు బాబులు ఎంత తాగేశారో తెలుసా?

Publish Date:Jan 17, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో దశల వారీ మద్య నిషేధం ఒక మిధ్య. గత ఎన్నికల ముందు సంపూర్ణ మద్య నిషేధం వాగ్దానంతో అధికారంలోకి వచ్చిన జగన్ ఆ తరువాత దశల వారీ మద్య నిషేధం అంటూ ఏపీలో సరి కొత్త మద్యం విధానాన్ని ప్రవేశ పెట్టారు. స్వయంగా ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేసేలా ఆ కొత్త విధానాన్ని రూపకల్పన చేసిన జగన్ సర్కార్.. ఇక అక్కడ నుంచీ దశల వారీగా మద్యం అమ్మకాల పెంపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

దేశంలో ఎక్కడా కనబడిన బ్రాండ్ లను ఏపీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  విక్రయిస్తోంది. ధరలను విపరీతంగా పెంచేసింది. దశలవారీ మద్య నిషేధం అన్న వాగ్దానాన్ని ఆరు నిలువుల గోతిలో పాతేసి రోజు రోజుకూ మద్యం విక్రమాయలను పెంచేస్తోంది. అలు మద్యం అలవాటు మాన్పించడానికి ధరలు పెంచామని చెప్పుకున్న సర్కార్.. మందు బాబుల బలహీనతను సొమ్ము చేసుకోవడమే కాకుండా నాసిరకం బ్రాండ్లతో వారి ఆరోగ్యాలనూ గుల్ల చేస్తోంది. తాజాగా సంక్రాంతి వేళ ఏపీలో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి.   ఈ సంక్రాంతి వేళ రాష్ట్ర సర్కార్ కు మద్యం అమ్మకాల ద్వారా భారీగా లాభాలు వచ్చాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా రోజుల్లో రోజుల్లో ఏకంగా రూ.214 కోట్ల మద్యం అమ్ముడుపోయినట్లు ఎక్సైజ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 2 .33 లక్షలకుపైగా లిక్కర్, 83 వేలకుపైగా బీర్ కేసులు అమ్ముడుపోయినట్లు అధికారులు చెబుతున్నారు.

అత్యధికంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో రూ.27.81 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. అసలు ఏపీలో  జగన్ ఎన్నికల సమయంలో మ‌ద్య నిషేధం అమ‌లు చేస్తామ‌ని హామీ ఇచ్చి మ‌హిళా ఓట్లు దండుకుని ఇప్పుడు ఆ వాగ్దానాన్ని విస్మరించి మద్యపానాన్ని ప్రోత్సహించడమే ప్రభుత్వ విధానం అన్నట్లుగా ఏపీ సర్కార్ ముందుకు సాగుతోంది.  మ‌ద్య నిషేధం అమ‌లు చేయ‌క‌పోవటంపై ప్ర‌జ‌ల నుంచి విమ‌ర్శ‌లు ఎదుర‌వ్వ‌డంతో వైసీపీ ప్ర‌భుత్వం.. మ‌ద్యం రేట్లు పెంచింది. మ‌ద్యం ధ‌ర‌లు పెంచ‌డం ద్వారా మ‌ద్యం తాగేవారి సంఖ్య త‌గ్గుతుంద‌ని ప్ర‌భుత్వం చెబుతూ వస్తోంది.  మ‌ద్యం తాగేవారి సంఖ్య త‌గ్గ‌డం అటుంచితే.. మ‌ధ్య త‌ర‌గ‌తి, పేద వ‌ర్గాల‌కు చెందిన మందుబాబుల జేబులు గుల్ల‌వుతున్నాయి. అదే సమయంలో కొత్త కొత్త బ్రాండ్ల పేరుతో ఏపీలో సరఫరా చేస్తున్న మద్యంతో ప్రజారోగ్యం కూడా ప్రమాదంలో పడింది.  

మాట తప్పం, మడమ తిప్పం అని చెప్పుకొనే జగన్ ఆదాయం కోసం మద్య నిషేధం సంగతి అటుంచి మద్యపాన ప్రోత్సాహం అనే విధానం అమలు చేస్తున్నారనిపించక మానదు.  ఇప్పటికే వచ్చే పాతికేళ్ల మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు చేసిన జగన్ మద్యం ధరలు పెంచి మద్యపానం అలవాటును తగ్గిస్తానని చెప్పడం తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ మేత కోసం అన్న సామెతను గుర్తుకు తెస్తోంది. 

By
en-us Political News

  
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.