Publish Date:Aug 22, 2022
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు మారనున్నాయనడానికి సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇంత కాలం ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ పై సాఫ్ట్ కార్నర్ తో ఉన్న కేంద్రంలోని మోడీ సర్కార్ ఇప్పుడు ఆ వైఖరి మార్చుకుంటున్నట్లు స్పష్టమైన సంకేతాలను ఇస్తోంది. ఒక వైపు ఏపీలో బీజేపీ టీడీపీల మైత్రి ఖాయమన్న సంకేతాలు కేంద్రం నుంచే వస్తున్నాయి.
ఆ సంకేతాలకు బలం చేకూర్చే విధంగా రాష్ట్ర బీజేపీ వైసీపీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. అదే సమయంలో కేంద్ర మంత్రి తన ఏపీ పర్యటనలో నేరుగా ముఖ్యమంత్రి జగన్ పైనే త్రీవ స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎంను లిక్కర్ కింగ్ గా, స్టిక్కర్ కింగ్ గా అభివర్ణించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏపీ లింకు ఉందా? ఈ ప్రశ్నకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాత్రం అవుననే అంటున్నారు.
త్వరలోనే ఆ విషయం బయటకు వస్తుందని ఘంటాపదంగా చెబుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణ లింకులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత హస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఏకంగా కేంద్ర మంత్రి ఈ కుంభకోణంలో ఏపీ లింకులను బయట పెడతానని ప్రకటించడం సంచలనం సృష్ఠించింది. అంతటితో ఆగకుండా ఆయన సీఎం జగన్ నే లిక్కర్ కింగ్ గా అభివర్ణించడంతో ఆయన త్వరలో బయటపెట్టబోయే విషయాలు మరింత సంచలనాత్మకంగా ఉండనున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో జరిగిన యువ సంఘర్షణ ర్యాలీ ముగింపు సభలో పాల్గొన్న ఆయన ఏపీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి బీజేపీ తరఫున ప్రధానంగా మాట్లాడుతున్నది అనురాగ్ ఠాకూరే.. దీంతో ఆయన ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో ఏపీకి లింక్ ఉందని ఆరోపించడంతో ఆ ఆరోపణలకు విశ్వసనీయత పెరిగింది. ఏపీలో లిక్కర్, ల్యాండ్, శాండ్ మాఫియాల హవా నడుస్తోందని అనురాగ్ ఠాకూర్ విమర్శించారు.
ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ అవినీతిలో అగ్రస్థానం కోసం పోటీ పడుతున్నారని విమర్శించారు. ఏపీలో జగన్ విధానాల కారణంగా యువతకు ఉపాధి లేకుండా పోయిందని అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. ఏపీ సర్కార్ నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినా అభివృద్ధి అన్నది కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదని విమర్శించారు. ఒక్కరాజధాని కట్టడానికే డబ్బులు లేని ఏపీలో జగన్ మూడు రాజధానులు కడతానని ఎలా చెబుతారని విమర్శించారు. జగన్ సర్కార్ తీరు కారణంగా ఏపీలో ఉన్నపరిశ్రమలే తరలిపోయే పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంతో నేరుగా ఏపీ ప్రభుత్వ పెద్దల లింక్ బయట పెట్టబోతున్నామని అనురాగ్ ఠాకూర్ ప్రకటించి ప్రకంపనలు సృష్టించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-links-with-delhi-liquor-scam-says-anurag-thakur-39-142421.html
తాజా సమాచారం మేరకు మమతా బెనర్జీ తన సమీప ప్రత్యర్థి సువేందు అధికారి కంటే స్వలంగా వెనుకబడ్డారు.
ఈసారి భవానీపూర్ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని బీజేపీ, తమిళనాడులో డీఎంకే జోరు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ గట్టిపోటీ ఇస్తూ.. ముందుకు సాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. మహిళా ఓటర్ల మద్దతు ఈసారి కూడా మమతాబెనర్జీకే ఉందని తెలుస్తోంది.
కేంద్రంలోని అధికార పార్టీ కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనీ.. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మమతా బెనర్జీ.. ముఖ్యంగా కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహాయంతో ఓట్ల లెక్కింపులో మార్పులు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి.
విజయ్ తన పార్టీ అభ్యర్థుల కోసం మహాబలిపురం లోని ఒక ప్రముఖ లగ్జరీ రిసార్ట్‌ను బుక్ చేసినట్లు తెలుస్తోంది. గెలిచిన అభ్యర్థులందరినీ వెంటనే చెన్నైలోని పనైయూర్ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని.. అక్కడి నుండి అందరినీ సామూహికంగా రిసార్ట్‌కు తరలించాలని విజయ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
బెంగాల్ ప్రస్తుత పరిస్థితులను ఆయన ఉత్తరప్రదేశ్, బిహార్‌లతో పోల్చారు. ఒకప్పుడు యూపీలో నెలకొన్న అరాచక శక్తులను బీజేపీ ప్రభుత్వం ఎలాగైతే అంతం చేసిందో, బెంగాల్‌లో కూడా అదే పునరావృతం అవుతుందని అన్నారు.
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే.. ఇక్కడ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. ఎగ్జట్ పోల్స్ అంచనాల ప్రకారం మమతా బెనర్జీ నేతృత్వంలోని
తమిళనాడు రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమం, కమిటీల నిర్మాణం లాంటి అంశాలపై నేతలతో చర్చించిన కేటీఆర్ . స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను ఈ సందర్భంగా అభినందించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత.. ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నందుకు ఆమె కేటీఆర్‌పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్‌మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.
ఒకప్పుడు సోషల్ మీడియాలో లోకేష్‌ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీకి ఆయన తన పనితీరుతోనే సమాధానం చెప్పారు. 400 రోజులకు పైగా సాగిన యువగళం పాదయాత్ర లోకేష్‌ను ప్రజలకు చేరువ చేయడమే కాకుండా.. ఆయనలోని నాయకత్వ పటిమను బయటపెట్టింది. ఆ యాత్రలో ఆయన సేకరించిన ప్రజా సమస్యలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలకు పునాదిగా మారాయి.
కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానంలో భాగంగా యువతతో విస్తృతంగా మమేకమవ్వాలని నిర్ణయించుకున్నారు.