ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏపీ లింకు?

Publish Date:Aug 22, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు మారనున్నాయనడానికి సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇంత కాలం ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ పై సాఫ్ట్ కార్నర్ తో ఉన్న కేంద్రంలోని మోడీ సర్కార్ ఇప్పుడు ఆ వైఖరి మార్చుకుంటున్నట్లు స్పష్టమైన సంకేతాలను ఇస్తోంది. ఒక వైపు ఏపీలో బీజేపీ టీడీపీల మైత్రి ఖాయమన్న సంకేతాలు కేంద్రం నుంచే వస్తున్నాయి.

ఆ సంకేతాలకు బలం చేకూర్చే విధంగా రాష్ట్ర బీజేపీ వైసీపీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. అదే సమయంలో కేంద్ర మంత్రి తన ఏపీ పర్యటనలో నేరుగా ముఖ్యమంత్రి జగన్ పైనే త్రీవ స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎంను లిక్కర్ కింగ్ గా, స్టిక్కర్ కింగ్ గా అభివర్ణించారు.  ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏపీ లింకు ఉందా? ఈ ప్రశ్నకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాత్రం అవుననే అంటున్నారు.

త్వరలోనే ఆ విషయం బయటకు వస్తుందని ఘంటాపదంగా చెబుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణ లింకులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్  కుమార్తె కవిత హస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఏకంగా కేంద్ర మంత్రి ఈ కుంభకోణంలో ఏపీ లింకులను బయట పెడతానని ప్రకటించడం సంచలనం సృష్ఠించింది. అంతటితో ఆగకుండా ఆయన సీఎం జగన్ నే లిక్కర్ కింగ్ గా అభివర్ణించడంతో ఆయన త్వరలో బయటపెట్టబోయే విషయాలు మరింత సంచలనాత్మకంగా ఉండనున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో జరిగిన యువ సంఘర్షణ ర్యాలీ ముగింపు సభలో పాల్గొన్న ఆయన ఏపీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి బీజేపీ తరఫున ప్రధానంగా మాట్లాడుతున్నది అనురాగ్ ఠాకూరే.. దీంతో ఆయన ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో ఏపీకి లింక్ ఉందని ఆరోపించడంతో ఆ ఆరోపణలకు విశ్వసనీయత పెరిగింది. ఏపీలో లిక్కర్, ల్యాండ్, శాండ్ మాఫియాల హవా నడుస్తోందని అనురాగ్ ఠాకూర్ విమర్శించారు.

ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ అవినీతిలో అగ్రస్థానం కోసం పోటీ పడుతున్నారని విమర్శించారు. ఏపీలో జగన్ విధానాల కారణంగా యువతకు ఉపాధి లేకుండా పోయిందని అనురాగ్ ఠాకూర్ విమర్శించారు.  ఏపీ సర్కార్ నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినా అభివృద్ధి అన్నది కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదని విమర్శించారు. ఒక్కరాజధాని కట్టడానికే డబ్బులు లేని ఏపీలో జగన్ మూడు రాజధానులు కడతానని ఎలా చెబుతారని విమర్శించారు.  జగన్ సర్కార్ తీరు కారణంగా ఏపీలో ఉన్నపరిశ్రమలే తరలిపోయే పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు.  ఢిల్లీ లిక్కర్ స్కాంతో నేరుగా ఏపీ ప్రభుత్వ పెద్దల లింక్ బయట పెట్టబోతున్నామని అనురాగ్ ఠాకూర్ ప్రకటించి ప్రకంపనలు సృష్టించారు. 

By
en-us Political News

  
Telangana government pays special attention to the renovation of barrages, Revanth Reddy, Kaleshwaram Project, Medigadda Barrage, Annaram Barrage, Sundilla Barrage, Kaleshwaram Barrage Repairs, Barrage Restoration, Dam Safety, NDSA, Irrigation Projects, Devadula Lift Irrigation, Sitarama Lift Irrigation
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చేపట్టిన సోదాలు ముగిశాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక విధానంలో అత్యంత కీలకమైన మార్పులకు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది.
Mahabubnagar ACB Raid, Telangana ACB, ACB Trap, Bribery Case, Rs 1 Lakh Bribe, Government Officials Arrested, Mahabubnagar Corruption, Youth and Sports Department, Jakkula Rajasekhar Reddy, Gorre Umesh, Telangana Anti Corruption Bureau, ACB Helpline 1064, Telangana Crime News
చలికాలం రాగానే మనలో చాలామంది ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు
అనంతపురం జిల్లాలో జరుగుతున్న పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.