ఏపీ సర్కార్ కు హైకోర్టు షాక్.. లబ్ధిదారులను వాలంటీర్లు ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్న

Publish Date:May 6, 2022

Advertisement

ఏపీ సీఎం జగన్ మానస పుత్రికగా చెప్పుకునే వాలంటీర్ వ్యవస్థపై ఆది నుంచీ విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. గ్రామాల్లో వాలంటీర్లదే ఇష్టారాజ్యంగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తినా జగన్ సర్కార్ ఖాతరు చేయలేదు. ఎన్నికలలో వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రయోజనాలు చేకూరుతాయని భావిస్తూ ప్రతి విషయంలోనూ వాలంటీర్లకే ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. చాలా చోట్ల అధికారులు, ఎమ్మెల్యేల కంటే వాలంటీర్ల పెత్తనమే చెల్లుతోందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. 

ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక నుంచి అన్ని విషయాలలోనూ వాలంటీర్లదే ఇష్టారాజ్యంగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే రాజకీయ కక్షతో వైఎస్ఆర్ చేయూత పథకాన్ని తమకు నిలిపివేశారంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు.  ఈ కేసు విచారణకు స్వీకరించిన ఏపీ హై కోర్టు వాలంటీర్ల వ్యవస్థపై ప్రభుత్వాన్ని పలు ప్రశ్నలు సంధించింది. అసలు లబ్ధిదారుల ఎంపిక వాలంటీర్లు ఎలా చేస్తారని నిలదీసింది. అలాగే వాలంటీర్ అంటే స్వచ్ఛంద సేవ కదా..డబ్బులెలా ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అలాగే ఏడుగురు వాలంటీర్లకు నోటీసులు జారీ చేసింది. వాలంటీర్ల సర్వీసు నిబంధనలు ఏమిటనీ నిలదీసింది. వాలంటీర్ తప్పు చేస్తే ఎవరు శిక్షిస్తారని పేర్కొంది. అఫడవిట్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

ఇలా ఉండగా వాలంటీర్ వ్యవస్థ చట్టబద్ధతపై తొలి నుంచీ సందేహాలు వ్యక్తమౌతూనే ఉన్నాయి. స్థానిక స్వపరిపాలనా వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకే జగన్ కుట్ర పూరితంగా సమాంతర వ్యవస్థను తీసుకువచ్చారని రాజ్యాంగ నిపుణులు అప్పట్లోనే ఆరోపించారు. ప్రజలు ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకున్న స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఉండగా వారిని కాదని సంక్షేపథకాల పంపిణీకి ఎవరి నియంత్రణ లేని, చట్టబద్ధత లేన వాలంటీర్ వ్యవస్థను సమాంతర వ్యవస్థగా ఏర్పాటు చేయడంలోని ఔచిత్యాన్ని వారు ప్రశ్నించారు.

అలాగే వాలంటీర్ లుగా ప్రభుత్వం ఉద్యోగాలిచ్చామని ఘనంగా చెప్పుకుంటున్నదనీ, కానీ ప్రభుత్వమే స్వయంగా కనీస వేతన చట్టాన్ని ఉల్లంఘించి లక్షలాది మంది చేత వాలంటీర్ల పేరుతో వెట్టి చేయిస్తున్నదని హక్కుల సంఘాలు విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలోనే వాలంటీర్ల సర్వీసు నిబంధనల గురించి, లబ్ధిదారులను ఎంపిక  చేయడానికి వారికి గల అర్హతల గురించి ఏపీ హైకోర్టు ప్రశ్నించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

By
en-us Political News

  
చంద్రబాబు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెడీ కుమారస్వామి అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఉక్కుకర్మాగారం శంకుస్థాపన ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ డీ కుమారస్వామి అంతకు ముందు విశాఖలో మీడియాతో మాట్లాడారు.
రేంద్రమోడీ గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రాన్ని పాలించారు. దీంతో సోమవారం (మార్చి 23) నాటికి ఆయన పాలనా పగ్గాలు చేపట్టి 8932 రోజులైంది. అంటే అత్యధిక రోజుల పాటు రోజుల పాటు ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వహించి, దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా మోడీ కొత్త రికార్డు సృష్టించారు.
దేశ చరిత్రలో ప్రధానిగా ఎన్నికైన ఏకైక మహిళ ఇందిరాగాంధీ. దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘకాలం భారతదేశ ప్రధానిగా కొనసాగిన ఏకైక వనిత ఇందిరాగాంధీ. ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ తన హయాంలో తీసుకుని అమలు చేసిన నిర్ణయాలు ఓ సంచలనం.
వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం. వాస్తవానికి గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
తెలుగువన్ వాస్తవ వేదిక తాజా సంచికలో వివేక హత్య కేసుపై విస్తృత చర్చ జరిగింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
చంద్రబాబు కూడా పలు సందర్భాలలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదనీ, వారు తమ తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించిన విషయం తెలసిందే. అయితే ఏ సందర్భంలోనూ కూడా ఆయన పని తీరు బాగా లేని మంత్రుల పేర్లు వెల్లడించలేదు. ఇక బాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు మంత్రుల పని తీరును సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
పుట్టా మహూష్ ఇచ్చిన వివరణ ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులోతెలుగుదేశం పార్టీ నాయకుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి విదితమే ఈ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ గా స్పందించి.. పుట్టా మహేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పార్టీ హైకమాండ్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసి ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాని ఆదేశించింది.
ఆమె పోరాటం ప్రధానంగా తన తండ్రి కేసీఆర్, ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలపైనేనని విస్పష్ట సంకేతాలిచ్చేశాయి. డాడీ అంటే తన తండ్రి కేసీఆర్ అని, చిన్న మోదీ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పరోక్షంగా అయినా స్పష్టంగా చెప్పారు.
ఒకప్పుడు అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీలో కీలక నేతగా, ఆ పార్టీ అధినేత జగన్ కు సన్నిహితుడిగా, ఆయన కుటుంబ బంధువుగా బాలినేని శ్రీనివాసరెడ్డి చక్రం తిప్పారు. అయితే గత ఎన్నికలకు ముందు నుంచే వైసీపీలో బాలినేని పరిస్థితి పొమ్మనలేక పొగపెట్టిన చందంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.