నేతలు చెప్పినట్టు ఆడతామంటే కుదరదు.. ఏపీ హైకోర్టు తీవ్ర హెచ్చరిక 

Publish Date:Nov 10, 2020

Advertisement

ఏపీలో హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకుండా అటు ప్రభుత్వం, ఇటు అధికారులు వ్యవహరిస్తున్న తీరు తో ఘర్షణ వాతావరణం నెలకొంటున్న సంగతి తెల్సిందే. తాజాగా ఒక స్థలంలో భవన నిర్మాణంపై జారీ చేసిన స్టేటస్‌ కో (యథాతథ స్థితి) ఉత్తర్వులను అమలు చేయని అధికారులపై హైకోర్టు మండి పడింది. న్యాయవ్యవస్థను ఎలా నడపాలో, అలాగే బ్యూరోక్రాట్లతో ఎలా వ్యవహరించాలో తమకు బాగా తెలుసని.. తమ ఆదేశాల అమలు కోసం తాము ఎంతవరకైనా వెళ్తామని ఈ సందర్భంగా హెచ్చరించింది. తమ ఆదేశాలను అమలు చేయని పక్షంలో కోర్టు ధిక్కార చర్యలు తీసుకునేందుకు తమకు సర్వాధికారాలూ ఉన్నాయని స్పష్టం చేసింది. అధికారులు నిబంధనల మేరకు సవ్యంగా నడుచుకోవాలని, పొలిటికల్ పార్టీల నేతలు చెప్పినట్లు ఆడతామంటే కుదరదని తేల్చిచెప్పింది. కోర్టు ఆదేశాలను అమలు చేయని అధికారులపై కోర్టు ధిక్కార చర్యలు కోరుతూ పిటిషన్‌ వేయాలని, అందులో ఆ అధికారుల పేర్లను కూడా పేర్కొనాలని పిటిషనర్‌కు సూచించింది. ఈ వ్యవహారంలో ఆ అధికారులను ఎవరు రక్షిస్తారో చూస్తామని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ ఉమాదేవితో కూడిన ధర్మాసనం కాస్త కటువుగా వ్యాఖ్యానించింది.

 

చిత్తూరు జిల్లా తిరుమలయప్పపల్లిలో గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా, గ్రామ సభ నిర్వహించకుండానే నిబంధనలకు విరుద్ధంగా.. మామిడితోపు, బండి దారికి సంబంధించిన స్థలంలో రైతు భరోసా కేంద్రం భవనం నిర్మిస్తున్నారంటూ కొండకిందపల్లికి చెందిన సుబ్రమణ్యంరెడ్డి, యర్రసాని గోపిరెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. దీనిపై సోమవారం జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ముందు విచారణ జరిగింది. ఈ కేసులో పిటిషనర్‌ తరఫు న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్‌ తన వాదనలు వినిపించారు. గతంలో ఇదే స్థలంలో గ్రామ సచివాలయ భవనం నిర్మించేందుకు అధికారులు ప్రయత్నాలు చేయగా.. గడచిన సెప్టెంబరు 24న హైకోర్టు స్టేటస్‌ కో (యథాతథ స్థితి) విధించిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఆ ఆదేశాలకు విరుద్ధంగా ఇప్పుడదే స్థలంలో అధికారులు రైతు భరోసా కేంద్రం భవనం నిర్మిస్తున్నారని.. ఈ విషయం బయటకు పొక్కితే సమస్యలు వస్తాయన్న అనుమానంతో సదరు భూమి సర్వే నంబరు ఆన్‌లైన్‌లో కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారని తెలిపారు. అయితే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన తరువాత కూడా అధికారులు అక్కడ భవన నిర్మాణం ఎలా చేపడుతున్నారని ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇప్పుడు దీనిపైనా స్టేటస్‌ కో ఉత్తర్వులిస్తే.. రేపు ప్రభుత్వం మరో స్కీం ప్రారంభించినప్పుడు దానికి సంబంధించిన భవన నిర్మాణం కూడా అక్కడ చేపడతారేమోనని సందేహమా వ్యక్తం చేసింది.

 

ఇదే కేసులో ప్రభుత్వ న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌ చెబుతున్న స్థలంలో మొదట్లోనే గ్రామ సచివాలయంతో పాటు రైతు భరోసా కేంద్ర నిర్మాణం కూడా చేపట్టామన్నారు. అయితే అప్పట్లో పిటిషనర్‌ కేవలం గ్రామ సచివాలయంపై మాత్రమే కోర్టుకు వచ్చారని తెలిపారు. అంతేకాకుండా పిటిషనర్‌ చెబుతున్నట్లుగా సర్వే నంబరు ఒకటే అయినప్పటికీ.. ఆ స్థలం ఎంతో విశాలమైనదని, అందువల్ల కోర్టు ఆదేశాలు ఇచ్చిన ప్రదేశంలో కాకుండా పక్కన నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా కోర్టు ఆదేశాల మేరకు గ్రామ సచివాలయ నిర్మాణం నిలిపేశారని చెప్పారు. కేవలం ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పథకం కోసం ఆ నిర్మాణం చేపట్టారని ప్రభుత్వ న్యాయవాది వివరించారు. ధర్మాసనం దీనిపై స్పందిస్తూ.. ఏవి ప్రజా ప్రయోజనాలో తమకు తెలుసని.. ప్రభుత్వం చేపడుతున్న అన్ని విషయాల గురించీ తమకు తెలుసని నర్మగర్భంగా వ్యాఖ్యానించింది. అంతేకాకుండా మీ అధికారులను సరిగా నడచుకోమని చెప్పండి. మా ఆదేశాలపై అభ్యంతరముంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలి. అంతే కానీ.. కోర్టు ఆదేశాలను అతిక్రమించే హక్కు ఎవరికీ లేదు. హైకోర్టు ఆదేశాలు జారీ చేశాక అదే భూమిలో వేరే పథకానికి సంబంధించిన భవన నిర్మాణం ఎలా చేస్తారు? ఇది కోర్టు ధిక్కారం కాదా? రాజకీయ నేతలు చెప్పినట్లుగా మీరు ఆడతామంటే కుదరదు.

 

ఈ వ్యవహారం పై కోర్టు ధిక్కార చర్యలకు ఆదేశిస్తాం అని కోర్టు హెచ్చరించింది. దీనిపై అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం ఓ పాత కేసును గుర్తుచేస్తూ.. పట్నాలో ఒక కేసుకు సంబంధించి హైకోర్టు ఆదేశాలు పాటించని ఓ జిల్లా మేజిస్ట్రేట్‌ను పిలిపించి.. అటు నుంచి అటే జైలుకు పంపించినట్లు పేర్కొంది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని.. ఆ స్థలంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలతో పాటు ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదని అధికారులను ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబరు మొదటి వారానికి వాయిదా వేసింది.

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.