Publish Date:Apr 26, 2022
మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నిందితుడిగా ఉన్న కేసు ఆధారాలు నెల్లూరు కోర్టు నుంచి చోరీకి గురైన ఘటనను ఏపీ హైకోర్టు సుమోటో పిల్‌గా స్వీకరించింది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు సరైన దిశలో జరగడం లేదని, స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన నివేదికను ఆధారం చేసుకొని సుమోటో పిల్‌గా పరిగణించింది.
చోరీ జరిగిన తరువాత డాగ్ స్క్వాడ్ తనిఖీలు, వేలిముద్ర, కాలి ముద్ర సేకరణ చెయకుండా నెల్లూరు జిల్లా ఎస్పీ ఎందుకు నిర్లక్ష్యం వహించారని ధర్మాసనం నిలదీసింది. కేసును సీబీఐకి ఎందుకు అప్పగించకూడదని హైకోర్ట్ ప్రశ్నించింది. కేసును సీబీఐకి అప్పగించడంపై అభ్యంతరం లేదంటూ ఏజీ వివరించారు. దీంతో.. 18 మందికి నోటీసులు జారీ చేసింది ధర్మాసనం.
ప్రతివాదులుగా మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, రాష్ట్ర డీజీపీ, సీబీఐ డైరెక్టర్, నెల్లూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) తదితరులను చేర్చింది. కేసు దర్యాప్తు పురోగతిపై నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. తదుపరి విచారణ మే 6కి వాయిదా వేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-high-court-on-kakani-files-case-25-134984.html
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కాంట్రాక్టుల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
20 వార్డుల్లో 17 స్థానాలు గెలుపు.!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో పెను తుపాను ముప్పును ఎదుర్కొంటోంది.
కడప పులివెందుల మున్సిపాలిటీ ఛైర్పర్సన్ ఎన్నికల కౌంటింగ్‌లో తెలుగుదేశం పార్టీ విజయపథంలో దూసుకుపోతోంది
ఆ పసివాడికి చట్టాలు తెలియవు.. నిబంధనలు అసలే తెలియవు. తెలిసిందల్లా అమ్మానాన్నల ప్రేమ మాత్రమే!
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.