ఏపీ మద్యం స్కాం.. ఏ క్షణంలోనైనా మిథున్ రెడ్డి అరెస్టు?!
Publish Date:Jul 15, 2025
Advertisement
వైసీపీ సీనియర్ నాయకుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి ఏపీ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మద్యం కుంభకోణం కేసులో ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ముందస్తు బెయిలు మంజూరు చేయలేమని పేర్కొంటూ కోర్టు ఆయన యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ ను కొట్టివేసింది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో పీకల్లోతు ఇరుక్కున్న మిథున్ రెడ్డి ఈ కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు సుప్రీంను ఆశ్రయించారు. మిథున్ రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్ విచారించిన సుప్రీం కోర్టు ఈ విషయాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని పేర్కొంటూ.. అప్పటి వరకూ అరెస్టు నుంచి మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మిథున్ రెడ్డి సుప్రీంను ఆశ్రయించారు. ఇప్పుడు ఏపీ హైకోర్టు మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ మంగళవారం (జులై 15) తీర్పు ఇచ్చింది. దీంతో మిథున్ రెడ్డికి అరెస్టు నుంచి రక్షణ లేకుండా పోయింది. దీంతో ఏ క్షణమైనా ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మద్యం కుభకోణంలో పలువురు నిందితులను అరెస్టు చేశారు. ఇంకా కొంత మంది పరారీలో ఉన్నారు.ఇదే కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా అరెస్టయ్యారు. చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ విచారణలో ఉంది. అయితే మిథున్ రెడ్డి బెయిలు పిటిషన్ ను సుప్రీం తిరస్కరించడంతో ఆయన ఏ క్షణమైనా అరెస్టయ్యే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/ap-high-court-dismiss-mithun-reddy-anticipatory-bail-petition-25-202043.html





