గోరంట్ల న్యూడ్ వీడియోను ఫోరెన్సిక్ కు పంపండి.. అమిత్ షాకు న్యాయవాది లేఖ
Publish Date:Aug 13, 2022
Advertisement
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ కు సంబంధించిన వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించి పరీక్ష చేయించాలని కోరుతూ ఏపీ న్యాయవాది ఒకరు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కులేఖ రాశారు. ఏపీలో మహిళల భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయనా లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలు, దాడులు తదితర నేరాలలో వైసీపీ నాయకులు, మద్దతు దారులకు ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయం ఉంటోందని ఆయన ఆ లేఖలో న్యాయవాది లక్ష్మీనారాయణ ఆరోపించారు. మహిళలపై నేరాలకు పాల్పడుతున్న వైసీపీ నేతల్ని కాపాడేందుకు పోలీసులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ‘దిశ’ చట్టం అంటూ ఏపీ సర్కార్ మహిళల్ని మోసం చేస్తోందని ఆరోపించారు. ఏపీలో జరుగుతున్న అఘాయిత్యాలపై కేంద్ర హోం శాఖ సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. గోరంట్ల మాధవ్ ఒక మహిళతో నగ్నంగా వీడియో కాల్ చేసినట్టుగా ఉన్న వీడియో క్లిప్ ఫేక్ అని, మార్ఫింగ్ వీడియో అని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప చెప్పడం మహిళలను విస్మయానికి గురి చేసిందన్నారు. జూన్ 2019 నుంచి జులై 2022 మధ్య రాష్ట్రంలో మహిళలపై 777 ఘటనలు నమోదయ్యాయని ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే, డీజీపీకి మరో లేఖ రాశారు. వీడియో క్లిప్‌పై విచారణ జరుగుతుండగానే వాస్తవాల్ని వక్రీకరించి వివరాలను వెల్లడించడం పోలీసుల ఎథిక్స్, స్టాండింగ్ ఆర్డర్లకు విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ఎస్పీ ఫకీరప్ప ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందనీ, ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని లక్ష్మీనారాయణ ఆ లేఖలో కోరారు.
http://www.teluguone.com/news/content/ap-high-court-advocate-writes-letter-to-amith-sha-saking-to-take-action-on-gorantla-nude-video-call-39-141853.html