ఆనందయ్య మందుకు గ్రీన్ సిగ్నల్.. కంట్లో డ్రాప్స్ వద్దన్న సర్కార్
Publish Date:May 31, 2021
Advertisement
పది రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు తెర పడింది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంట్లో వేసే డ్రాప్స్ తప్ప, ఆనందయ్య ఇస్తున్న మందులకు ఓకే చెప్పింది. ఆనందయ్య ఇచ్చే పి, ఎల్, ఎఫ్ మందుల పంపిణికి తమకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపింది. సీసీఆర్‌ఏఎస్ నివేదిక ప్రకారం నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కంట్లో వేసు మందుపై ఇంకా నివేదికలు రావాల్సి ఉందని, ఆనందయ్య ఇస్తున్న మిగిలిన మందుల వల్ల హాని లేదని తేలిందని వెల్లడించింది. ఆనందయ్య మందు వాడితే హాని లేదనిసీసీఆర్‌ఏఎస్ నివేదిక ఇచ్చిందని ఏపీ సర్కార్ తెలిపింది. కాన ఆనందయ్య మందు వాడితే కోవిడ్ తగ్గుతుంది అనడానికి నిర్ధారణలు లేవని తేల్చిన నివేదికలు. కంట్లో వేసే డ్రాప్స్ విషయంలో పూర్తి నివేదికలు రావడానికి మరో 2–3 వారాల సమయం అంతకుముందు ఆనందయ్య మందుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఆనందయ్య ఔషధం తీసుకున్న తర్వాత 130 మంది ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారని ప్రభుత్వ లాయర్ చెప్పారు. మందుపై ఆయుష్ నివేదిక ఇంకా రాలేదని చెప్పారు. దీనిపై స్పందించిన ఆనందయ్య తరఫు న్యాయవాది 130 మంది ఆసుపత్రిలో చేరితే దానిపై కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. అసలు ఔషధం పంపిణీకి ప్రభుత్వ అనుమతి అవసరం లేదని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. ఔషధాన్ని పంపిణీ చేసే హక్కు ఆనందయ్యకు ఉందని ఆయన వివరించారు. పలు ఫార్మా సంస్థలు ఒత్తిడి తీసుకువస్తున్నందునే ఆనందయ్య ఔషధాన్ని పంపిణీ చేయకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది.
పట్టనుంది.అందుకే ఆ మందును పక్కన పెట్టింది. ఆనందయ్య మందు వాడినంత మాత్రాన మిగిలిన మందులు ఆపొద్దని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూ.. ఎవరి ఇష్టాను సారం వారు ఆనందయ్య మందును వాడుకోవచ్చని సూచించింది. ఆనందయ్య మందును తీసుకోవడానికి కోవిడ్‌పాజిటివ్ రోగులు కృష్ణపట్నం రావొద్దన్న ప్రభుత్వం.. వారికి బదులు వారి సంబంధీకులు వచ్చి మందును తీసుకెళ్లాలని సూచించింది.దీంతో కోవిడ్ విస్తరించే ప్రమాదం తప్పుతుందని వెల్లడించింది. మందు పంపిణీ సందర్భంలో కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని ఆదేశించింది.
http://www.teluguone.com/news/content/ap-govt-green-signal-to-anandaiah-medicine-25-116624.html





