Publish Date:Apr 25, 2022
ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ కోతలతో జనం అల్లాడుతుంటే...ప్రభుత్వం మాత్రం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం, ట్రాన్స్ కో అద్భుతంగా పని చేస్తున్నదంటూ గప్పాలు కొడుతోంది. వాస్తవానికి మండు వేసవిలో విద్యుత్ కోతలతో జనం అల్లాడి పోతున్నారు. విద్యుత్ కోతలు ఒక్క గృహావసరాలకే పరిమితం కాలేదు. అన్ని రంగాలకూ విస్తరించాయి. వ్యవసాయానికి కోత, పరిశ్రమలకు కోత...ఇలా ఏపీలో జగన్ సర్కార్ కోతల సర్కార్ గా మారిపోయింది. జనం అవస్థలను పట్టించుకోకుండా కోతల సర్కార్ లో కొందరు కోతల రాయుళ్లు దర్బార్ లు (మీడియా సమావేశాలు) పెట్టి మరీ విద్యుత్ సరఫరా భేష్ అంటూ సొంత భుజాలను తట్టుకుంటున్నారు. ఈ కోతల రాయుళ్ల మాటలు వాస్తవ పరిస్థితికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. వాస్తవానికి ఏపీలో న గరాలు, పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా ఎడాపెడా విద్యుత్ కోతలను అమలు చేస్తున్నారు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరా ఎప్పుడుంటుందో, ఎప్పుడుండదో రైతులకే కాదు విద్యుత్ అధికారులకే తెలియని పరిస్థితి ఉందంటే అతి శయోక్తి కాదు. ఇక పరిశ్రమల విషయానికి వస్తే ఏకంగా వారానికి ఒక రోజు పవర్ హాలీడే ప్రకటించేశారు. మిగిలిన రోజులైనా సక్రమంగా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉంటుందా? అంటే ఆ గ్యారంటీ లేదు. రాష్ట్రంలో విద్యుత్ కోతల కారణంగా ఇప్పటికే అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే...నాణ్యమైన విద్యుత్ అంటూ మంత్రి పెద్దిరెడ్డిగారు ట్రాన్స్ కోను పొగిడేస్తున్నారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత మెరుగు పరిచేందుకు కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నదంటూ సర్కార్ కు భుజకీర్తులు తగిలించేస్తున్నారు. ఆయన మాటలు కోటలు దాటుతున్నాయనీ, ప్రభుత్వ చేతలు మాత్రం గడప దాటుతున్న పరిస్థితి కనిపించడం లేదనీ విద్యుత్ రంగ నిపుణులు పెదవి విరుస్తున్నారు.
విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఇలా ప్రదాన నగరాలతో పాటు పట్టణాలూ పల్లెల్లో విద్యుత్ కోతలు మండు వేసవిలో మంటలు రేపుతున్నాయి. ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ అంటూ సర్కార్ వేస్తున్న ఈ కోతల వాతల వల్ల జనం అల్లాడుతున్నారు. మండు వేసవిలో జనాల పరిస్థితి మగ్గపెట్టిన మామిడి పళ్లలా తయారైంది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కోతల వళ్ల జనం నరకయాతన పడుతుంటే మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి విలేకరుల సమావేశం పెట్టి మరీ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా భేషుగ్గా ఉందంటూ సర్కర్ పని తీరుకు కితాబులిచ్చేస్తున్నారు. గణాకాంలు కాదు సారూ...వాస్తవాలు చెప్పండంటూ జనం నిలదీస్తున్నారు. విద్యుత్ కోతలతో ఆంధ్రప్రదేశ్ లో అందకారం తాండవిస్తోంది. పరిశ్రమలు మూతపడ్డాయి. వేల మంది కార్మికులు ఉపాధికి దూరమయ్యారు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే....సర్కార్ మాటలు మరోలా ఉండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-government-lies-on-power-cuts-25-134963.html
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.