కల ధృవీకరణ కోసం ఇంటింటి సర్వే
Publish Date:Jul 29, 2025
Advertisement
కుల ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుల ధృవీకరణ పత్రాల జారీ కోసం ఇంటింటి సర్వే చేపసట్టాలని నిర్ణయించింది. అక్టోబర్ 2వ తేదీనాటికి ఈ ఇంటింటి సర్వే పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. రియల్ టైం గవర్నెన్స్ సొసైటీతో పాటు పలు శాఖలను కూడా ఈ ఇంటింటి సర్వేలో భాగస్వాములను చేయనుంది. ఈ సర్వేలో భాగంగా ఇంటింటికి తిరిగి వివరాలు సేకరిస్తుంది. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల వివరాలు మాత్రమే తీసుకునేవారు. అయితే ఈసారి ఓసీల వివరాలు కూడా నమోదు చేస్తారు. ఈ సర్వేను ప్రభుత్వం సుమోటో విధానంలో చేయనుంది. బ్లాక్‌చైన్ టెక్నాలజీతో ట్యాంపరింగ్ కు ఇసుమంతైనా అవకాశం లేకుండా కుల ధృవీకరణ పత్రాలను జారీ చేయడానికి ఏపీ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది.
http://www.teluguone.com/news/content/ap-government-household-survey-for-caste-verification-25-202971.html





