ఉద్యోగుల సాధారణ బదిలీలకు జగన్ సర్కార్ ఆమోద ముద్ర
Publish Date:Jun 7, 2022
Advertisement
ఏపీలో ఉద్యోగుల సాధారణ బదిలీలకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ప్రతిపాదిత ఫైల్‌పై సీఎం జగన్ సంతకం చేశారు. ఈ క్రమంలో బదిలీల్లో ఉద్యోగుల అర్హత, ఖాళీల వివరాలు తదితర నిబంధనలతో జీవో ఇచ్చింది. ఇదిలా ఉంటే... ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన ఫైల్‌పై సంతకం చేసిన సమయంలో ఉద్యోగుల బదిలీలన్నీ ఈ నెల 17లోగా పూర్తి అయ్యేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించినట్లు చెబుతున్నారు. అంతే కాకుండా ఎలాంటి వివాదాలు, ఆరోపణలు లేకుండా బదిలీల ప్రక్రియను సజావుగా, సక్రమంగా ముగించాలని ఆయన సూచించారని చెబుతున్నారు. కాగా 2019లో ఉద్యోగుల సాధారణ బదలీలకు అనుమతిస్తూ ఏవైతే నిబందనలు ఉన్నాయో వాటినే ఇప్పుడూ వర్తింప చేయనున్నారు. కాగా ఈ నెల 15 నాటికి ఉద్యోగుల బదలీల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఐదేళ్లు ఒకే స్థానంలో ఉన్న ఉద్యోగులను తప్పని సరిగా బదిలీ చేయాలని నిబంధన విధించనుంది. అయిదతే పాఠశాల విద్య, వైద్యఆరోగ్య శాఖ ఉద్యోగులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది.
http://www.teluguone.com/news/content/ap-government-green-signal-to-general-transfers-25-137206.html





