ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న 46,113 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సోమవారం (మార్చి 2) ఉత్తర్వులు జారీ చేసింది. సాగు సీజన్ ప్రారంభానికి ముందే ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతోంది.
ఈ నెలాఖరులోగా దరఖాస్తులన్నింటికీ అనుమతులు ఇచ్చి, మరో రెండు నెలల్లోగా కనెక్షన్ల ప్రక్రియను పూర్తి చేయాలని డిస్కంలకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 250 కోట్ల రూపాయలను ప్రభఉత్వం ఖర్చు చేయనుంది. ఈ ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా పదివేల కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను కేటాయించనుంది.
పెండింగ్ కనెక్షన్లన్నీ త్వరితగతిన ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటికే 22.30 లక్షల కనెక్షన్లు ఉండగా, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్తగా 1.12 లక్షల కనెక్షన్లను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల సంఖ్య 46 వేల 113కు చేరింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-government-gives-green-signal-36-214911.html
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నివాసంలో గుంటూరు పార్లమెంట్ కు చెందిన ప్రజాప్రతినిధుల ఆత్మీయ విందు సమావేశం జరిగింది.
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తృతంగా కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని పమిడిముక్కలలో పర్యటించారు
పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఉన్న వాహనాలను సీజ్ చేయొద్దన్న కోర్టు ఆదేశాల అమలుపై తీవ్రంగా స్పందించిన తెలంగాణ హైకోర్టు కీలక అధికారులకు నోటీసులు జారీ చేసింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సీతారాం ఆత్మహత్య కేసులో రోజుకో కొత్త మలుపు వెలుగులోకి వస్తోంది.
అమెరికా అధ్యక్షుడి మానసిక స్థితి సరిగ్గానే ఉందా.. అన్న అంశం మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న హెన్రిచ్ క్లాసెన్ ప్రదర్శనపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ప్రశంసలు కురిపించాడు.
మామూలుగా టెన్త్, ఇంటర్ వంటి రిజల్ట్స్ అంటే వార్తా పత్రికల్లో మరుసటి రోజంతా ఆ హడావుడే కనిపిస్తుంది.
శంషాబాద్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఒక తెలుగు యువకుడు చదువు పూర్తి చేసుకుని, ఉద్యోగం దొరక్క.. కుటుంబానికి భారమయ్యానన్న వేదనతో అక్కడే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ నూతన డైరెక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి అవినాష్ మహంతి బాధ్యతలు స్వీకరించారు.
నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడు నిర్వహణకు కసరత్తులు వేగవంతమయ్యాయి.