సలహాదారు పదవులకే వన్నె తెచ్చిన నియామకాలు.. దటీజ్ చంద్రబాబు

Publish Date:Mar 20, 2025

Advertisement

ఏపీలో గత వైసీపీ గత పాలనకు, ప్రస్తుత కూటమి పాలనకు స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ఐదేళ్ల జగన్ హయాంలో రాష్ట్రం అన్ని విధాలుగా భ్రష్టుపట్టిపోయింది. పాలన అంటే దోచుకో, దాచుకో, వ్యతిరేకులపై దౌర్జన్యాలూ, దాడులు, అరెస్టులు, అక్రమ కేసులే అన్నట్లుగా జగన్ హయం సాగింది. జగన్ హయాంలో జనం నిత్యం భయంభయంగా బతికే పరిస్థితి ఉంది. ఏం మాట్లాడితే ఏ కేసు పెడతారో అన్న ఆందోళన అన్ని వర్గాలలో నెలకొంది. ఐదేళ్ల పాటు జగన్ అరాచక పాలనకు గత ఏడాది జరిగిన ఎన్నికలలో జనం చరమగీతం పాడారు. తెలుగుదేశం కూటమికి అపూర్వ విజయాన్ని అందించారు. తెలుగుదేశం కూటమి కొలువుదీరి తొమ్మిది నెలలు అయ్యింది. ఈ తొమ్మిది నెలలుగా రాష్ట్రంలో జనం స్వేచ్ఛగా ఉంటున్నారు. అక్రమ కేసుల భయం లేకుండా బతుకుతున్నారు. తమ అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తం చేయగలుగుతున్నారు. 

ఇక ప్రభుత్వ సలహాదారులను నియమించుకునే విషయంలో కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆయా రంగాలలో నిష్ణాతులైన వారిని నియమిస్తోంది. అదే జగన్ హయాంలో  సలహాదారుల నియామకం అన్నది ఒక వైసీపీ క్యాడర్ కు ఉద్యోగ కల్పన కోసమే అన్నట్లుగా మారిపోయింది. మరీ ముఖ్యంగా జగన్ హయాంలో భారీగా నియమితులైన ప్రభుత్వ సలహాదారులలో అత్యధికులు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే ఉండేవారు. జగన్ హయాంలో ప్రభుత్వ సలహాదారు నియామకాలన్నీ.. అర్హత, యోగ్యతతో సంబంధం లేకుండా వైసీపీ అనుకూలురైతే చాలు అన్నట్లుగా జరిగాయి.  అయితే ఇప్పుడు చంద్రబాబు హయాంలో ప్రభుత్వ సలహాదారుల పదవులలో నియమితులయ్యే వారంతా.. తమ సేవల ద్వారా రాష్ట్ర పురోభివృద్ధికి దోహదం చేసే వారు, చేయగలిగే వారే ఉంటున్నారు. 

తాజాగా వివిధ రంగాలకు చెందిన నలుగురు ప్రముఖులను చంద్రబాబు ప్రభుత్వం ప్రభుత్వ అడ్వైజర్లుగా నియమించింది.  ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారుగా ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్,  ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ అడ్వైజర్ గా డీఆర్ఢీఓ మాజీ చైర్మన్   సతీశ్ రెడ్డి,  ఫోరెన్సిక్ సైన్స్ కు కేపీసీ గాంధీ, హ్యాండ్ లూమ్స్ హబ్ కు సుచిత్రా ఎల్లాలను సలహాదారులుగా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.  ఈ నియామకాలే రాష్ట్ర పురోభివృద్ధి పట్ల చంద్రబాబుకు ఉన్న అంకిత భావాన్ని తెలియజేస్తున్నాయి. ఇస్రో  మాజీ చైర్మన్ సోమనాథ్  డీఆర్డీవో మాజీ చైర్మన్ సతీష్ రెడ్డిలను సలహాదారులుగా నియమించడం ద్వారా  ద్వారా వారి అనుభవాన్ని, నైపుణ్యాన్నిరాష్ట్ర పురోభివృద్ధికి వినియోగించుకోవడానికి వీలవుతుంది.

ఇక సుచిత్రా ఎల్లా.. కరోనా కల్లోల సమయంలో కరోనా కట్టడికి వ్యాక్సిన్ తయారు చేసిన భారత్ బయోటెక్ వైస్ చైర్మన్. టీటీడీ బోర్డు సభ్యురాలు కూడా. ఆమెను హ్యాండ్ లూమ్స్ హబ్  సలహాదారుగా నియమించారు. అలాగే  ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ డైరెక్టర్ గా సుదీర్గ కాలం పాటు పనిచేసిన గాంధీని.. ఫోరెన్సిక్ సైన్స్ సలహాదారుగా నియమించారు. ఈ నియమకాలు వీరి నైపుణ్యాన్ని, ప్రతిభను ఆయా రంగాలను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు దోహదపడతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నియామకాల ద్వారా సలహాదారు పదవికే గౌరవం వచ్చిందని ప్రశంసిస్తున్నారు. 

By
en-us Political News

  
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఒకింత జోరు తగ్గించిన వంగవీటి రాధా.. ఉన్నట్టుండి జనసేనానిని తో భేటీ అవ్వడం, అదీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేడి రగిలిన సమయంలో కలవడం వెనుక పక్కా వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సొంత మేనకోడలు నిశ్చితార్థానికి వైఎస్ జగన్ హాజరుకాకపోవడంపై రాజకీయవర్గాలలోనే కాదు.. సామాన్య జనంలో కూడా చర్చ జరుగుతోంది. గతంలో షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్చితార్థానికి జగన్ దంపతులు హాజరైన సంగతిని పలువురు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు.
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.