ధర ఎక్కువ.. మరి నాణ్యత?.. ఏపీలో అందుబాటులోకి మరో 10 మద్యం బ్రాండులు

Publish Date:Nov 15, 2022

Advertisement

ఆంధ్ర ప్రదేశ్ లో మద్య నిషేధం సంగతేమో కానీ.. ఎక్కడా కనీ వినీ ఎరుగని బ్రాండ్లు మాత్రం తెగ అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. తాజాగా మరో పది కొత్త మద్యం బ్రాండులు ఏపీలో అందుబాటులోకి రానున్నాయి. వీటినిక ఏపీ ఎబీసీఎల్ అనుమతులు ఇచ్చేసింది. వీటి ప్రత్యేకత ఏమిటంటే అదే కేటగిరిలో ఇప్పటికే అందుబాటులో ఉన్న బ్రాండ్ల మద్యం కంటీ వీటి ధర ఎక్కువ. ప్రస్తుతం  ఏపీలో అందుబాటులో ఉన్న కొన్ని కేటగిరిల బీరు ధర రెండు వందల రూపాయలు అయితే.. ఇప్పుడు అ అదే కుటగిరిలో కొత్తగా అనుమతి వచ్చిన బ్రాండ్ బీరు ధర అంతకంటే ఎక్కువ. కొత్త బ్రాండ్ ధరను 220 రూపాయలుగా నిర్ణయించారు. అలాగే క్వార్టర్ మద్యం ధర రూ.110లు కాగా కొత్తగా అనుమతి పొందిన బ్రాండ్ ల మద్యం క్వార్టర్ ధర 130 రూపాయలుగా నిర్ణయించారు.  తమిళనాడుకు చెందిన ఎస్ఎన్‌జే షుగర్స్ అండ్ ప్రొడక్ట్ లిమిటెడ్ సంస్థతోపాటు మరికొన్ని మద్యం సరఫరా కంపెనీలకు చెందిన కొత్త బ్రాండ్లకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. కాగా, కొత్తగా అనుమతులు పొందిన బ్రాండ్లు, వాటికి నిర్ణయించిన ధరల విషయంలో ఏపీఎస్‌బీసీఎల్ అధికారికంగా ఇంకా ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.

మందుబాబులు మద్యం తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకుని మరీ ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇస్తూ ఉంటారు. మన దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలే ఆయా ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరులని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం తమకు ఆదాయం కన్నా ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని చెప్పింది. చెబుతోంది.

దశలవారీగా మద్య నిషేధం చేస్తామని, ఐదేళ్లలో రాష్ట్రంలో పూర్తిగా మద్య నిషేధం చేస్తామని అధికార పగ్గాలు చేపట్టడానికి ముందు స్వయంగా జగనే ప్రకటించారు. కానీ, ప్రభుత్వం చెప్పిన దానికి రాష్ట్రంలోజరుగుతున్న దానికి పొంతనే లేకుండా పోయింది. మద్యం మీద ప్రభుత్వం ఆదాయం ఏమాత్రం తగ్గలేదు. సరికదా ప్రభుత్వం ఒప్పుకోకపోయినా ఆదాయం విపరీతంగా పెరిగిందన్నది మాత్రం సత్యం. ఇక ప్రభుత్వమే చేస్తున్న మద్యం వ్యాపారంలో నాణ్యత లేని బ్రాండ్లను సరఫరా చేస్తూ, వాటిని కూడా గతంలో కంటే అధిక ధరలకు విక్రయిస్తూ ప్రజల జేబులనే కాకుండా ఆరోగ్యాన్ని కూడా గుల్ల చేస్తోంది.   

మద్యం ధరలు పెంచి మద్యం ప్రియులను దానికి దూరం చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ముఖ్యంగా లాక్‌డౌన్‌ సమయంలో మద్యం దుకాణాలు మూతపడి, తెరిచిన తర్వాత.. లిక్కర్‌ పై మొత్తం 75 శాతం పన్నులను పెంచింది. మద్యం అందుబాటు ధరలో లేకపోవడంతో శానిటైజర్లు తాగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.  దీంతో తీవ్ర విమర్శలు రావడంతో మద్యం ధరలను స్వల్పంగా తగ్గించింది. అలాగే ప్రభుత్వం వింత వింత పేర్లున్న బ్రాండ్లను తీసుకురావడంతో.. నాసిరకం మద్యాన్ని ఎక్కువ ధరలకు అమ్ముతూ ప్రజల ఆరోగ్యాలతో, జీవితాలతో ఆటలాడుతున్నారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. మరోవైపు, పొరుగు రాష్ట్రాల నుండి భారీగా అక్రమ మద్య రవాణా జరుగుతోంది. దీనికితోడు నాటుసారా తయారీ, అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి.  ఆదాయం కన్నా ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని.. ఏటా 20 శాతం చొప్పున మద్యం దుకాణాలు తగ్గించి, ఐదేళ్ల నాటికి కేవలం స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యం అందుబాటులో ఉండే విధంగా చేస్తామని ప్రభుత్వం చెప్పింది.

కానీ   జరిగిన, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మద్య నిషేధం సాధ్యమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రేట్ల పెంపుతో ప్రభుత్వ ఆదాయానికి ఏ లోటు లేదు.. కేవలం రేట్లు పెంచితే చాలు మద్యం ప్రియులు మందుకు దూరమవుతారంటూ ధరలను పెంచేసుకుంటూ పోవడమే కాకుండా.. ఏకంగా వచ్చే పాతికేళ్ల మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరీ అప్పులు తీసుకున్న ప్రభుత్వ నిర్వాకం చూస్తుంటే మద్య నిషేధం అన్న మాటను సర్కార్ అటకెక్కించేసిందా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.

By
en-us Political News

  
మహానగరంలో శాంతిభద్రతలకు సవాల్ విసురుతూ మరో కిరాతక ఘటన వెలుగు చూసింది.
పెంపుడు జంతువుల పట్ల యజమానులు చూపే ప్రేమ రోజుకో కొత్త రూపం దాల్చుతోంది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు, మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ మేనల్లుడైన ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసులు విదేశీ ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం (FRRO) నుంచి కఠినమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
అమెరికాలోని చికాగో సమీపంలో ఒక భారీ ఉగ్ర కుట్ర తృటిలో తప్పింది.
బెంగళూరులోని ఒక పబ్‌లో పోలీసులతో జరిగిన వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత కఠినంగా స్పందించింది.
నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు.. ఎన్నో కలలు కన్నారు.. కుటుంబాల వ్యతిరేకతను ఎదుర్కొని మరీ ఒక్కటయ్యారు.
ప్రియుడిని బయటకు తీసుకురావాలనుకుంది.. చివరికి తానే కటకటాల వెనక్కి.!
జర్మనీలో చోటుచేసుకున్న ఒక అనూహ్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సందర్శించారు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) వేదికగా జరుగుతున్న నాల్గో టీ20 పోరులో భారత జట్టు టాస్ నెగ్గి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.