Publish Date:Nov 10, 2021
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ ఢిల్లీ వెళ్లారు. మూడు రోజుల పాటు ఆయన హస్తినలోనే ఉండనున్నారు. రాష్ట్రపతి భవన్ లో జరిగే సదస్సుకు హాజరయ్యేందుకు గవర్నర్ ఢిల్లీ వెళ్లారు. సమావేశంలో భాగంగా రాష్ట్రపతితో ఆయన సమావేశమవుతారు. అయితే ప్రెసిడెంట్ సదస్సు కోసమే ఏపీ గవర్నర్ ఢిల్లీకి వెళ్లారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా.. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో కొత్త చర్చ తెరపైకి వస్తోంది. ఏపీ పరిణామాలపై కేంద్రానికి గవర్నర్ హరిచందన్ నివేదిక ఇస్తారనే చర్చ జరుగుతోంది.
ఏపీ రాజకీయాల్లో రోజుకో పరిణామం చోటుచేసుకుంటోంది. ఏపీ ఆర్థిక పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారింది. వారం వారం అప్పులు చేస్తేనే కాని పాలన సాగే అవకాశాలు కన్పించడం లేదు. ఏపీలో పెరిగిపోతున్న అప్పుల విషయం మీద జాతీయ మీడియాలో విపరీతంగా వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న విపక్షాలు... రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గవర్నర్ కు చాలా సార్లు ఫిర్యాదు చేశాయి. రూల్స్ కు విరుద్ధంగా తీసుకువస్తున్న అప్పులను కట్టడి చేయాలని కోరాయి. పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వ వ్యాట్ తగ్గంపుపైనా రాజకీయ రచ్చ సాగుతోంది.
ఇక ఇటీవల టీడీపీ ప్రధాన కార్యాలయంతో పాటు పలు జిల్లా పార్టీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడి చేయడం తీవ్ర దుమారం రేపింది. దీనికి వ్యతిరేకంగా చంద్రబాబు 36 గంటల దీక్ష చేశారు. చంద్రబాబు నేరుగా ఢిల్లీకి వెళ్లి మరీ రాష్ట్రపతి భవన్ కు వెళ్లి మరీ జగన్ మీద ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో అశాంతి పెరుగుతోందని కాబట్టి ఆర్టికల్ 356ను పెట్టి ఏపీలో వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలంటూ విజ్ఞప్తి చేశారు.
ఏపీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్ ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. చంద్రబాబు రాష్ట్రపతిని కలిసి చేసిన ఫిర్యాదు మీద కూడా గవర్నర్ తో రామ్ నాథ్ కోవింద్ మాట్లాడే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. టీడీపీ కార్యాలయాలపై వైసీపీ కార్యకర్తలు చేసిన దాడుల అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉందంటున్నారు. పెరిగిపోతున్న అప్పుల మీద అటు కేంద్ర ఆర్థిక శాఖ కూడా పలు సార్లు హెచ్చరించిన నేపథ్యంలో రామ్ నాథ్ కోవింద్ మాట్లాడే ఛాన్స్ ఉంది. గతంలో అప్పులు తెచ్చుకోవడం కోసం జగన్ ప్రభుత్వం గవర్నర్ పేరును చేర్చడంపై గవర్నర్ చర్చించే ఛాన్స్ ఉంది. మొత్తంగా గవర్నర్ ఢిల్లీ పర్యటన జగన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-governer-delhi-tour-tention-in-ycp-25-126105.html
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.