అమ్మఒడి కోసం ఆపసోపాలు... అప్పుల వేటలో జగన్ సర్కారు...

Publish Date:Jan 3, 2020

Advertisement

పథకం మీద పథకం ప్రకటిస్తూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి... అసలా పథకాలకు డబ్బు ఎక్కడ్నుంచి తెస్తున్నారనే చర్చ మంత్రుల్లో సైతం జరుగుతోంది. అయితే, ఆరు నెలల పాలనలో 30వేల కోట్లకు పైగా అప్పులు చేశారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ఇక, ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అమ్మఒడి పథకం అమలు కోసం మరోసారి జగన్ ప్రభుత్వం అప్పుల వేటలో పడింది. వడ్డీ రేట్లు ఎక్కువైనాసరే అప్పు తీసుకొస్తున్నారు. తాజాగా, ఆంధ్రాబ్యాంకు నుంచి 8.5శాతం వడ్డీకి 15వందల కోట్ల రుణం తీసుకునేందుకు ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే, విద్యుదుత్పత్తి ప్రాజెక్టులను ఆస్తులుగా చూపించి పదివేలకోట్ల రుణం సమీకరించాలని చూస్తున్నారు. అలాగే, మరో బ్యాంకు నుంచి 3వేల కోట్ల రుణం తీసుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. అమ్మఒడి, రెండో విడత రైతు భరోసా గడువు ముంచుకొస్తుండటంతో వీలైనంత త్వరగా బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుని అప్పు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక్క అమ్మఒడికే 6వేల 500కోట్లు అవసరం కాగా, రెండో విడత రైతు భరోసాకి 2వేల 500కోట్లు కావాలి. మొత్తంగా సుమారు 10వేల కోట్లు అవసరముందని ఆర్ధికశాఖ లెక్కగట్టింది. 
  
అయితే, ఓవర్ డ్రాఫ్ట్ కి వెళ్లే అవకాశమున్నా ప్రభుత్వం అటువైపు చూడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని అంటున్నారు. ఎందుకంటే, ఓడీకి వెళ్తే 7.15శాతం వడ్డీకే రుణం లభిస్తుంది. కానీ, 8.5శాతం అధిక వడ్డీతో బ్యాంకుల నుంచి అప్పు తెచ్చుకునేందుకే జగన్ ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. ఇక, ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా డిసెంబర్ వరకు 29వేల కోట్ల రుణాలను ప్రభుత్వం సమీకరించింది. ఈ రుణాలపై వడ్డీ 8శాతంలోపే ఉంది. అయితే, సెక్యూరిటీల వేలం ద్వారా ఇంకా 3వేల కోట్లకుపైగా అప్పు తెచ్చుకునే అవకాశమున్నా...  కేంద్రం అనుమతి ఇవ్వలేదనే మాట వినిపిస్తోంది. అప్పుల పరిమితిని ఏపీ దాటేయడమే దీనికి కారణమంటున్నారు. మొత్తానికి అమ్మఒడి, రెండో విడత రైతు భరోసా చెల్లింపుల కోసం జగన్ ప్రభుత్వం ఆపసోపాలు పడుతోందని అంటున్నారు.

By
en-us Political News

  
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.