Publish Date:Aug 16, 2022
ఆంధ్రప్రదేశ్లో ఓ మిలియన్ మార్చ్ జరగబోతోంది. సెప్టెంబర్ ఒకటో తేదీన సీపీఎస్ ఉద్యోగులు. టీచర్లు ఈ మిలియన్ మార్చ్ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన జగన్.అందుకు భిన్నంగా అవగాహన లేకుండా లేకుండా హామీ ఇచ్చానని చెబుతున్నారు.
దీంతో ప్రభుత్వంపై పోరుబాటే శరణ్యమని ఉద్యోగులు నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న సీపీఎస్ ఉద్యోగులు, మరీ సెప్టెంబర్ ఒకటో తేదీన మిలియన్ మార్చ్ నిర్వహించి ప్రభుత్వంపై తమ వ్యతిరేకతను గట్టిగా తెలియజేయాలని నిర్ణయించుకున్నారు. అయితే సహజంగానే టీచర్ల నిరసనకు ప్రభుత్వ అనుమతి ఇచ్చే అవకాశాలు ఎంత మాత్రం ఉండవు. కానీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని టీచర్లు తమ నిరసనను ఆపే అవకాశాలూ లేవు.
గతంలో చలో విజయవాడను నిరోధించడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు వివఫలమైన సంగతి తెలిసిందే. పీఆర్సీ విషయంలో తమను మోసం చేసిందని ఉద్యోగులు తీ ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు సెప్పెంబర్ 1న మిలియన్ మార్చ్ కోసం రోడ్డెక్కితే పరిస్థితి తీవ్రంగా మారుతుందన్నఆందోళన ప్రభుత్వంలో వ్యక్తమౌతోంది. ఒక వేళ ఉద్యోగుల మిలియన్ మార్చ్ విజయవంతమైతే ప్రభుత్వ తీరు పట్ల అసంతృప్తిగా ఉన్న అన్ని వర్గాలూ పోరుబాట పట్టే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.
అందుకే సెప్టెంబర్ మిలియన్ మార్చ్ ను నిర్వీర్యం చేయాలన్న పట్టుదలతో ఏపీ సర్కార్ ఉంది. అటు ఉద్యోగులు, ఇటు ప్రభుత్వం కూడా పట్టుదలలకు పోతుండటంతో మిలియన్ మార్చ్ సందర్భంగా శాంతి భద్రతల పరిస్థితికి విఘాతం కలిగే అవకాశాలు ఉన్నాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-employees-million-marc-on-sept1st-25-142048.html
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.