విద్యారంగంపై ప్రత్యేక దృష్టి.. బాధ్యతగా ఉపాధ్యాయ నియామకాలు.!

Publish Date:Aug 17, 2026

Advertisement

ఏపీలో విద్యా రంగం అభివృద్ధికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం  బాధ్యతగా వ్యవహరిస్తోందని మంత్రి నారా లోకేష్ అన్నారు. శాసనసభ వర్షాకాల సమావేశాల ప్రారంభ రోజున విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ డీఎస్సీ నిర్వహణ, విద్యా వ్యవస్థలో చేపట్టిన  సంస్కరణలపై సభలో  ప్రకటన చేశారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ 148 రోజుల రికార్డు సమయంలోనే  డీఎస్సీ నియామక ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేశామన్న లోకేష్.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ విద్యా వ్యవస్థను బలోపేతంపై  దృష్టి సారించిందన్నారు. గడిచిన కొద్ది నెలలలోనే ఉపాధ్యాయ నియామకాలు, ట్రాన్స్‌ఫర్‌ల ప్రక్రియను పారదర్శకంగా,  నిష్పాక్షికంగా నిర్వహించామని వివరించారు.

భావి భారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించాలనే లక్ష్యంతో సింగపూర్, ఫిన్‌లాండ్ వంటి  దేశాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 
 
 వైసీపీ  హయాంలో ఉపాధ్యాయులకు జరిగిన అవమానాలను మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. జగన్ హయాంలో  ఉపాధ్యాయుల గౌరవాన్ని దిగజార్చేలా వారిని మద్యం దుకాణాల వద్ద కాపలాదారులుగా నిలబెట్టారనీ, అందుకు భిన్నంగా ఇప్పుడు తమ ప్రభుత్వంలో వ్యవస్థను ప్రశ్నించే స్వేచ్ఛతో పాటు ఉపాధ్యాయులకు తగిన గుర్తింపు, గౌరవాన్ని అందిస్తున్నామని నారా లోకేశ్ సభా ముఖంగా చెప్పారు. 

డీఎస్సీ నియామక ప్రక్రియలో ఎదురైన న్యాయపరమైన చిక్కుల గురించి కూడా ఈ సందర్భంగా మంత్రి లోకేష్ సభకు వివరించారు.  ఈ నియామకాలపై వివిధ కోర్టుల్లో   336 కేసులు నమోదైనప్పటికీ, న్యాయస్థానాల ఉత్తర్వులకు ఏమాత్రం భంగం కలగకుండా చూశామన్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా డీఎస్సీ నియామకాలలో వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ విధానాలను నిర్దుష్టంగా అమలు చేసి మెరిట్ అభ్యర్థులకు న్యాయం చేశామని పేర్కొన్నారు.

అదే విధంగా ఇటీవల నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) గణాంకాలను మంత్రి  అసెంబ్లీ ముందుంచారు. టెట్ కోసం మొత్తం 3.68 లక్షల మంది  దరఖాస్తు చేసుకోగా, వారిలో 1.87 లక్షల మంది అర్హత సాధించినట్లు వెల్లడించారు. ఈ ఫలితాలు నిరుద్యోగ అభ్యర్థుల్లో పెరిగిన నైపుణ్యాన్ని, ప్రభుత్వ పరీక్షల నిర్వహణ తీరును ప్రతిబింబిస్తున్నాయని ఆయన అన్నారు.

నిరుద్యోగ యువత సుదీర్ఘ నిరీక్షణకు స్వస్తి పలుకుతూ.. ఇకపై రాష్ట్రంలో ప్రతి ఏటా క్రమం తప్పకుండా డీఎస్సీ ప్రకటనలు విడుదల చేస్తామని  మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. ప్రణాళికాబద్ధంగా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడం ద్వారా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. 

AP DSC News, Nara Lokesh Assembly Speech, AP Teacher Recruitment, AP Education Reforms, Annual DSC Notification AP

By
en-us Political News

  
నింటేండో స్విచ్ 2 కోసం డియాబ్లో 4 లాంచ్ డేట్ లీక్ అయింది. సెప్టెంబర్ 15న ఏజ్ ఆఫ్ హేట్రెడ్ కలెక్షన్‌తో $69.99 ధరకు విడుదల కానున్న ఈ గేమ్ వివరాలు, ఎక్స్‌పాన్షన్లు మరియు ఫిజికల్ బాక్స్ సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
ప్రైమ్ వీడియోలో దూసుకుపోతున్న జాక్ రీచర్ సిరీస్‌పై మీకున్న పరిజ్ఞానాన్ని పరీక్షించుకోండి! టామ్ క్రూజ్, అలన్ రిచ్‌సన్ మరియు లీ చైల్డ్ నవలల ఆధారంగా రూపొందించిన ఈ అల్టిమేట్ క్విజ్‌లో 70% స్కోర్ చేయడం నిజమైన అభిమానులకే సాధ్యం.
గూగుల్ తీసుకొస్తున్న సరికొత్త ఏఐ ఫోటోస్కాన్ టెక్నాలజీతో మీ స్మార్ట్‌ఫోన్ కెమెరా ద్వారా బాడీ ఫ్యాట్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ లెవెల్స్ మెడికల్ గ్రేడ్ ఖచ్చితత్వంతో సులభంగా కొలవచ్చు.
ప్రపంచకప్ టోర్నీలో బెల్జియం చేతిలో చేదు ఓటమి తర్వాత సెనెగల్ ఫుట్‌బాల్ జట్టు తమ కోచ్ పేప్ తియావ్‌ను తొలగించి, ఫ్రాన్స్ దిగ్గజం ప్యాట్రిక్ వియెరాను నయా హెడ్ కోచ్‌గా నియమించింది. సెనెగల్ జట్టులో వచ్చిన ఈ సంచలన మార్పులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
డాలర్‌తో పోలిస్తే రూపాయి రూపాయి విలువ 95.73 వద్ద స్థిరపడింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరల మధ్య ఆర్‌బీఐ సమర్థవంతమైన జోక్యంతో భారత కరెన్సీకి లభించిన ఊరటపై పూర్తి వివరాలు ఇవే!
ఏఐ స్టాక్స్ సుడిగుండంలో చిక్కుకోవడంతో ఆసియా మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. కొరియా కోస్పీ 5.2% తగ్గగా, శామ్‌సంగ్, ఎన్‌విడియా సహా దిగ్గజ టెక్ షేర్లు పడిపోయాయి. పెరుగుతున్న చమురు ధరలు, మార్కెట్ నష్టాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి!
భారతీయ యంగ్ క్రికెటర్ దేవదత్ పడిక్కల్ డేటింగ్ వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. షెహనాజ్ గిల్ మరియు రియాంజలి నంజప్పతో ఆయనకున్న రూమర్స్, ఐపీఎల్ స్టాండ్స్‌లో జరిగిన సంఘటనలు మరియు క్రికెట్ ప్రదర్శన వివరాలతో కూడిన సమగ్ర కథనం చదవండి.
బైయర్న్ మునిచ్ స్టార్ మిడ్‌ఫీల్డర్ జామల్ ముసియాలా 4 రోజుల్లో 2 సార్లు మైదానంలో కుప్పకూలారు. తనకు న్యూరోలాజికల్ డిజార్డర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని వెల్లడించిన జర్మనీ ఫుట్‌బాల్ స్టార్. పూర్తి వివరాలు ఇవే!
ఇంగ్లాండ్ బ్యాటింగ్ దిగ్గజం జో రూట్ రికీ పాంటింగ్ ఆల్‌టైమ్ టెస్టు రికార్డును బద్దలు కొట్టడానికి కేవలం 79 పరుగుల దూరంలో ఉన్నాడు. స్వదేశంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రూట్ సృష్టించబోతున్న చారిత్రాత్మక రికార్డు వివరాలు ఇవే!
గత నెల  25న సీవాన్ ప్రాంతంలోని  జేపీ చౌక్ సమీపంలో  విద్యార్థులు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేపట్టిన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  ఆందోళనకారులను అదుపు చేసే క్రమంలో విధుల్లో  పోలీస్  అభిషేక్ కుమార్   ఏకే47తో కాల్పులకు తెగబడ్డాడు.
హర్మూజ్ జలసంధిలో అమెరికా పూర్తి నియంత్రణ సాధించిందని ట్రంప్ ఆ పోస్టులో విస్పష్టంగా పేర్కొన్నారు,  అక్కడ సముద్ర మార్గంలో ఇరాన్  గతంలో అమర్చిన   మైన్‌ లు అన్నింటినీ అమెరికా బలగాలు పూర్తిగా తొలగించాయని ట్రంప్ పేర్కొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.