ఏపీ డీజీపీని సాగనంపిన ఎన్నికల కమిషన్

Publish Date:May 5, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్‌కి వీర భక్తుడిగా పేరు తెచ్చుకున్న డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి కేంద్ర ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. రాజేంద్రనాథ్ రెడ్డి తక్షణం ఎన్నికల విధుల నుంచి వైదొలగాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన గారికి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏ బాధ్యతనూ అప్పగించవద్దని చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి డీజీపీ ఎంపిక కోసం సోమవారం ఉదయం 11 గంటల లోగా ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను తమకు పంపాలని ఆదేశించింది. పేర్లను పంపడం మాత్రమే కాకుండా ఈ ముగ్గురికి సంబంధించిన ఐదేళ్ళ కాలానికి సంబంధించిన పనితీరు నివేదిక, విజిలెన్స్ క్లియరెన్స్ నివేదికలను కూడా పంపించాలని సూచించింది. రాజేంద్రనాథ్ రెడ్డి జగన్‌కి విధేయుడిగా పనిచేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు ఫిర్యాదులు చేయడంతో ఎన్నికల కమిషన్ ఈ చర్య తీసుకుంది.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లో 5 లక్షల 39 వేల 189 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. జూన్ 4వ తేదీన ఆయా జిల్లాల్లో ఎన్ని టేబుల్స్ వేసి లెక్కించాలనే అంశంపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి.
వైసీపీ నేతలు ఓటమి భయంతోనే హింసకు పూనుకున్నారు. జూన్ 4న బాక్సులు బద్దలైయ్యేలా ప్రజా ఆమోదంతో టీడీపీ అఖండ మెజార్టీతో గెలవబోతుంది అని ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ ధీమా వ్యక్తం చేశారు. అధికారులు భయపడాల్సిన అవసరంలేదు. లీవ్‌లు పెట్టుకుని వెళ్లాల్సిన అవసరంలేదు.
అసలే ఓటమి భయంతో వణికి పోతున్న వైసీపీ నేతలకు ఇప్పుడు షర్మిల విమర్శల దాడి పుండుమీద కారం చల్లినట్లుగా ఉంది. రాష్ట్రంలో ఎక్కడ ఎవరు వైసీపీకీ, జగన్ కు వ్యతిరేకంగా గొంతెత్తినా వారిని తెలుగుదేశం పెయిడ్ అర్టిస్టులంటూ నిందలేని, విమర్శలు చేసి నానాయాగీ చేసి చంకలు గుద్దుకున్న వైసీపీ నేతలకు షర్మిల రిటార్డ్ మింగుడు పడలేదు.
పోలింగ్ కేంద్రంలో ఈవీఎం లను బద్దలుకొట్టిన కేసులో పరారీలో ఉన్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి హై కోర్ట్ లో ముందస్తు బెయిలు పిటిషన్ దాఖలు చేయగా కోర్టు బెయిలు మంజూరు చేసిన విషయం విదితమే.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వేసవి సెలవులు ముగింపు దశకు వస్తున్న తరుణంలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు.
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-11
ఆంధ్రప్రదేశ్ లో మార్పు ఖాయమని తేలిపోయింది. మార్చి 13న రాష్ట్ర ప్రజలు మొక్కవోని ధైర్యంతో, మార్పు కావాలన్న సంకల్పంతో ఎన్నో అవరోధాలు ఎదుర్కొని మరీ పోలింగ్ బూత్ లకు వచ్చి గంటల తరబడి నిలబడి మరీ ఓటు వేశారు. తమ ఓటు హక్కు వినియోగించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి కాముకుడి చేతుల్లో పెట్టాలన్న పట్టుదలతో రాష్ట్రాలు, దేశాలలో స్థిరపడి కొలువులు చేసుకుంటున్నవారు కూడా స్వస్థలాలకు ఎన్నో వ్యయప్రయాశలకు ఓర్చి మరీ వచ్చారు. దీంతో రాష్ట్రంలో భారీగా పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ సరళి వైసీపీ పెద్దల మైండ్ బ్లాక్ చేసింది.
మధ్యం మత్తులో యువతీ యువకుల అరాచ‌కాల‌కు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. డ్రగ్స్ , గంజాయి తదితర మత్తుపదార్ధాలకు అలవాటుపడి నేషనల్ హైవే రోడ్ పై, ప‌బ్లిక్ ప్లేస్‌ల‌లోనే గొడవపడుతున్నారు.
తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో బాలికలదే పై చేయిగా నిలిచింది. ఈ నేపథ్యంలో  తెలంగాణలో పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. రెండు విడుతల్లో కౌన్సెలింగ్ ఉండనుంది. జూన్ 20న పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది.
ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఆయన నేర చరిత్ర ఒక్క ఆర్మూర్ ప్రజలకే కాకుండా హైదరాబాద్ శివారు ప్రాంత వాసులకు కూడా బోధపడింది. ఇప్పటికే ఆర్మూరులో భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న జీవన్ రెడ్డి చేవెళ్ల నియోజకవర్గంలో కూడా భూ కబ్జాలు చేసిన ఆరోపణతో  కొత్త చరిత్ర సృష్టించారు. 
ఎపిలో కూటమి ప్రభుత్వం అధికారంలో వస్తుందని కన్ఫర్మ్ అయ్యింది. వచ్చే నెల నాలుగో తేదీన వచ్చే ఫలితాల తర్వాత టిడిపి జాతీయాధ్యక్షుడు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి పదవి అధిరోహిస్తున్న నేపథ్యంలో తప పరిపాలనలో ఇబ్బందులు లేకుండా జాగ్రత్త పడుతున్నారు.   టీడీపీ అధినేత చంద్రబాబు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)కి లేఖ రాశారు. ఐఏఎస్ కన్ఫర్మేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని కోరారు. 
ప్రముఖ పుణ్యక్షత్రం కేదార్‌నాథ్‌లో హెలికాప్టర్ ప్రమాదం జస్ట్ మిస్సయింది.
తిరుమలలో వేసవి రద్దీ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేశస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. వారాంతాలలో వీఐపీ బ్రేక్ దర్శనాన్ని రద్దు చేసింది. వచ్చే నెల 30వ తేదీ వరకూ శుక్ర, శని, ఆదివారాలలో వీఐపీ బ్రేక్ దర్శనాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.