మహా సీఎంతో ఏపీ డిప్యూటీ సీఎం భేటీ.. ఏం అడిగారంటే?
Publish Date:Jun 30, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో మంగళవారం (జూన్ 30) భేటీ అయ్యారు. తన వైద్య చికిత్స కోసం ముంబై వెళ్లిన పవన్ కల్యాణ్ మహారాష్ట్ర సీఎంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆరోగ్య పరీక్షలు చేయించుకునేందుకు ముంబైలోని అంబానీ ఆస్పత్రిలో చేరేందుకు ఆయన తన సతీమణితో కలిసి ముంబై చేరుకున్న సంగతి తెలిసిందే. ఆస్పత్రిలో చేరడానికి ముందు మహా ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తో భేటీ అయిన పవన్ కల్యాణ్ ఆయనను రాష్ట్రానికి రెండు ఆడపులలను ఇవ్వాలని కోరారు. అందుకు ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించారు. అటవీ శాఖ మంత్రిగా పవన్ కల్యాణ్ రాష్ట్రంలో అడవులు, వన్యప్రాణుల అభివృద్ధి కోసం అరహారం శ్రమిస్తున్నారు. అందులో భాగంగానే మహారాష్ట్ర నుంచి రెండు ఆడపులులను రాష్ట్రానికి రప్పిస్తే.. రాష్ట్రంలో పులుల సంఖ్య పెంపునకు దోహదమౌతుందని ఆయన భావిస్తున్నారు. కాగా ఈ భేటీలో పవన్, ఫడ్నవీస్ ల మధ్య ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది. ముంబైలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో పులుల సంరక్షణపై చర్చించారు. రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించి భవిష్యత్తులో మరింత సహకరించుకోవాలని ఇచ్చి పుచ్చుకోవాలని ఇరువురు నేతలూ నిర్ణయించారు.
http://www.teluguone.com/news/content/ap-deputy-cm-meets-the-maha-cm-36-224638.html





