షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు.. మళ్ళీ సొంత గూటికి వైసీపీ నేతలు?

Publish Date:Sep 1, 2023

Advertisement

మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, ప్రస్తుత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖాయమైంది. అన్న జగన్ తో విభేదించి తెలంగాణలో షర్మిల ప్రారంభించిన రాజకీయ పార్టీ వైఎస్ఆర్టీపీ ఇక కనుమరుగు కానుంది. ఒకటీ రెండు రోజులలోనే ఈ విలీన ప్రక్రియ జరగనున్నట్లు రాజకీయ వర్గాలలో  గట్టిగా వినిపిస్తున్నది. ఇప్పటికే దక్షణాది కాంగ్రెస్ అగ్రనేతలతో పలుమార్లు సమావేశమైన వైఎస్ షర్మిల తాజాగా  సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో కూడా భేటీ అయి చర్చించారు. తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, పార్టీలో విలీనం చేయడం వల్ల తనకు పార్టీ కల్పించే అవకాశాలు తదితర అంశాలపై కాంగ్రెస్ పెద్దలతో షర్మిల చర్చించినట్లుగా తెలుస్తొంది. షర్మిల పార్టీ విలీన ప్రక్రియ అయితే ఖరారైంది కానీ.. ఇంతకీ ఆమె  ఏపీ రాజకీయాలకు వెళ్తారా?  లేక తెలంగాణ రాజకీయాలలోనే ఉంటారా  అన్న విషయంలో మాత్రం స్పష్టత రాలేదు. ఇంతకీ ఆమె ప్రయాణం రెండు పడవలపై అంటే ఆమె తెలంగాణ, ఏపీలలో రాజకీయాలు చేస్తే ప్రయోజనం ఏమిటి? ఎవరికి అన్న విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

అయితే, ప్రస్తుతం ఉన్న  సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ షర్మిల సేవలను రెండు తెలుగు రాష్ట్రాలలో వినియోగించుకోవడానికే మొగ్గు చూపుతోంది. షర్మిలకు తెలంగాణ నుండే ఒక ఉన్నత పదివితో పాటు కర్ణాటక కోటా నుండి రాజ్యసభకు పంపించనున్నారన్న చర్చ కూడా సాగుతోంది. అదీ కాక ఆమెను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశాలు లేకపోలేదని కూడా చెబుతున్నారు. ముందుగా తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో షర్మిల ఇక్కడే కాంగ్రెస్ నుండి రాజకీయాలు మొదలు పెట్టనుండగా..  ఏపీలో ఎన్నికల సమయానికి ఆమె ఏపీ పీసీసీ పగ్గాలు అందుకునేలా కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేసినట్లు తెలుస్తున్నది.  

  అదే జరిగి షర్మిల ఏపీ పీసీసీ పగ్గాలు చేపడితే ఏపీలో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి. షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటే కనుక వైసీపీకి తీరని నష్టం జరగడం ఖాయంగా కనిపిస్తోందని రాజకీయపరిశీలకులు చెబుతున్నారు. జగన్ ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత తీవ్రంగా వ్యక్తమౌతున్న నేపథ్యంలో చాలా మంది ఎమ్మెల్యేలలో సైతం పార్టీపై అసంతృప్తి వ్యక్తం అవుతోందని అంటున్నారు. అయితే, వీరిలో కొందరు ప్రస్తుతం టీడీపీ, బీజేపీతో టచ్ ఉండగా మరికొందరు ఆ పార్టీల్లోకి వెళ్లలేక.. వైసీపీలో ఉండలేక సతమతమవుతున్నారంటున్నారు. షర్మిల కనుక ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటే ఇలాంటి వారందరూ కాంగ్రెస్ లోకి క్యూకట్టడం ఖాయమని అంటున్నారు. గతంలో వైఎస్ హయంలో కాంగ్రెస్ లో చక్రం తిప్పిన నేతలలో కొందరు ఇప్పుడు వైసీపీలో ఉక్కపోతకు గురవుతున్నారు. షర్మిల కనుక ఏపీ పీసీసీ పగ్గాలు చేపడితే వీరంతా మళ్ళీ సొంత గూటికి అంటే కాంగ్రెస్ లోకి రావడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా, పార్టీలో అగ్ర నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ వంటి నాయకులు కూడా షర్మిలతో కలిసి ప్రయాణం మొదలు పెట్టినా ఆశ్చర్యం లేదంటున్నారు. భవిష్యత్ పరిణామాలు,  ప్రస్తుత పార్టీలో ఎదుర్కొంటున్న అంతర్గత వర్గ పోరుతో చాలా మంది నేతలు మరో కొత్త అప్షన్ కోసం ఎదురుచూస్తుండగా ఇలాంటి వారికి షర్మిల కాంగ్రెస్ బెస్ట్ ఛాయిస్ గా మారడం ఖాయమంటున్నారు. అదే జరిగితే రాబోయే ఎన్నికల్లోనే దాదాపు పదిశాతం ఓటు బ్యాంక్ వైసీపీకి దూరమై కాంగ్రెస్ బదలాయింపు జరగడం గ్యారంటీగా కనిపిస్తున్నది. వైసీపీకి గత రెండు పర్యాయాలు దళిత, ముస్లిం, క్రైస్తవ వర్గాల్లో అధిక సంఖ్యాకులు మద్దతు ఇచ్చారు. షర్మిల ఏపీకి వస్తే వీరిలో దాదాపు 30 శాతం ఓటు బ్యాంకు మళ్ళీ కాంగ్రెస్ వైపు మళ్లుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, తెలంగాణలో పార్టీ పుంజుకోవడంతో కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ఏపీ నేతలు మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ హయంలో చక్రం తిప్పిన ఇద్దరు ముగ్గురు బడా నేతలను అండగా పెట్టి  కాంగ్రెస్ ఏపీలో షర్మిలతో  రాజకీయం మొదలు పెట్టనున్నట్లు తెలుస్తున్నది.  

By
en-us Political News

  
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
బంగారం ప్రియులకు ఇది నిజంగానే ఊరటనిచ్చే శుభవార్త అని చెప్పవచ్చు
తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
హానీట్రాప్ ఉచ్చులో పడిన వాయుసేన అధికారి.. షాకింగ్ నిజాలు వెల్లడించిన ఛార్జ్‌షీట్.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.