Publish Date:Oct 22, 2019
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జగన్ ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా మంగళవారం నాడు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసిన జగన్.. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే.. శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చిన నేతలు, సహచర మంత్రులతో అమిత్‌షా కార్యాలయం కోలాహలంగా మారింది. దీంతో అమిత్‌షాతో మాట్లాడేందుకు జగన్‌కి తగిన సమయం దొరకలేదు.
అమిత్‌షాతో పూర్తిగా మాట్లాడే అవకాశం చిక్కకపోయేసరికి జగన్ తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది. విజయసాయిరెడ్డిపై అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. నిజానికి అమిత్ షా తో భేటీ జగన్ కొద్దిరోజులుగా ఎదురుచూస్తున్నారు. అపాయిట్మెంట్ దొరకడంతో అమిత్ షాని కలవడానికి ఢిల్లీ వెళ్లారు. అయితే, 24 గంటలు వెయిట్ చేసినా పూర్తిస్థాయి మీటింగ్ జరగలేదనే అసహనం జగన్‌లో కనిపించిందని సన్నిహితులు చెబుతున్నారు. కాగా.. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన అన్ని వ్యవహారాలను విజయసాయిరెడ్డి చూసుకుంటున్నారు. ఇప్పుడు అమిత్ షాతో అపాయిట్మెంట్ మొదలుకుని భేటీ వరకూ ఆయనే దగ్గరుండి చూసుకున్నారు. అయితే భేటీ సక్రమంగా జరగకపోవడంతో విజయసాయిరెడ్డిపై జగన్ అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది.
మరోవైపు.. జగన్‌తో అపాయింట్‌మెంట్లని కేంద్ర మంత్రులు రవిశంకర్, ప్రహ్లాద్‌జోషి రద్దు చేసుకున్నారని తెలుస్తోంది. కేంద్ర మంత్రులు అపాయిట్మెంట్ రద్దు చేసుకోవడంపై ఢిల్లీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం జగన్ ఢిల్లీ పర్యటన గురించి స్పందించింది. ఏపీ సమస్యలపై అమిత్‌షాకు జగన్ వినతిపత్రం ఇచ్చారని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు, కడప స్టీల్‌ప్లాంట్ లాంటి అంశాలు మెమోరాండంలో జగన్ ప్రస్తావించారని సీఎంవో వర్గాలు తెలిపాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-cm-ys-jagan-meets-amit-shah-25-90423.html
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్ విసిరారు.