పోలవరంపై జగన్ మాటలు నీటి మూటలేనా? ఏం చెప్పారు, ఏం జరిగింది?

Publish Date:May 9, 2024

Advertisement

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే అమ‌రావ‌తిపై, పగబట్టినట్టుగానే పోలవరంపై కూడా పగబట్టారు. ఆ పనులను నిలిపివేయించారు. కాంట్రాక్టర్లను బెదిరించి పక్కకు తప్పించారు. రివర్స్ టెండర్లు అంటూ పెద్ద డ్రామా నడిపించి.. తమకు అత్యంత దగ్గరివారైన మేఘా కంపెనీకి కాంట్రాక్టును కట్టబెట్టారు. రివర్స్ టెండరింగ్ వ్యవహారం ద్వారా ఇన్ని కోట్ల రూపాయలు ఆదా చేశామంటూ మాయమాటలు వల్లించారు.  అప్పటి నుంచి పోలవరం పనులు పూర్తిగా పడకేశాయి. 

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో పోలవరం ప్రాజెక్టు పనుల్ని శ‌ర‌వేగంతో ప‌రుగెత్తించారు. ప్రతి సోమవారం.. పోలవారం అన్నట్టుగా ఆ ప్రాజెక్టు పనులు గురించి సమీక్షలు నిర్వహిస్తూ వచ్చారు. అంత శ్రద్ధగా అధికారులను వెంటపడుతూ పనులు చేయించ‌డం వ‌ల్ల‌ ఆ ప్రాజెక్టు 75 శాతం వరకు పూర్తయింది.

పోలవరం ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదో, ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో కేంద్రమంత్రి గడ్కరీ  బ‌య‌ట‌పెట్టారు. ఏపీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కేంద్రమంత్రి గడ్కరీ, పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ సర్కారు వైఫల్యాలను ఎండగట్టారు. రాష్ట్రానికి మేలు చేసే ప్రాజెక్టు కోసం కేంద్రం ఇప్పటిదాకా 60 వేల కోట్లు విడుదల చేసినా జగన్ సర్కారు పూర్తిచేయకపోవడం చేతగానితనం అని విమర్శించారు. జ‌గ‌న్ నిర్ల‌క్ష్యం వ‌ల్ల ఏటా అనవసరంగా 1300 టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయని గ‌డ్క‌రీ చెప్పారు. పోల‌వ‌రం పూర్తి చేయడంలో జగన్ పూర్తిగా ఫెయిలైయ్యార‌ని,  వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల‌ని ఆయ‌న ఓట‌ర్ల‌కు పిలుపునిచ్చారు.

పోలవరం ప్రాజెక్టు.. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తూ ఏలూరు జిల్లా పోలవరం సమీపంలో నిర్మాణంలో ఉన్న బహుళార్థ సాధక నీటిపారుదల పథకం. విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలోని మెట్టప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని.. జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం గుర్తించింది. పోలవరం జలాశయం, ఆంధ్రప్రదేశ్ తోపాటు.. ఛత్తీస్‌ఘఢ్, ఒడిశా, తెలంగాణలో కూడా విస్తరించి ఉంటుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా.. 80 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా నదిలోకి మళ్లిస్తారు. ఇది పూర్తయ్యాక.. విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల సాగునీటి అవసరాలే కాకుండా.. విశాఖ మహానగరం తాగునీటి అవసరాలు, దాని చుట్టుపక్కలనున్న తీరప్రాంత పరిశ్రమల పారిశ్రామిక అవసరాలు తీరుస్తుంది. విద్యుదుత్పత్తి, జలరవాణాలోని ఇబ్బందులను అధిగమించడానికి.. చేపల పెంపకానికీ ఉపయోగపడుతుంది.

వాస్తవానికి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను చట్టం ప్రకారం.. కేంద్రమే అందించాలి.   పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో చిక్కుకున్న తమకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందిస్తే ఊళ్లు ఖాళీ చేస్తామని నిర్వాసితులు చెబుతున్నారు. పునరావాస కాలనీలు పూర్తి చేయాలని అడుగుతున్నారు. దానికి కేంద్రమే నిధులు ఇవ్వాలి.

సీఎం జగన్ 2022 లో చింతూరులో చెప్పిన విధంగా జరిగితే ప్లస్ 41 కాంటూరు పరిధిలో అందరికీ పరిహారం అందించాల్సి ఉంది. పునరావాస కాలనీలు పూర్తి చేసి వారిని తరలించాల్సి ఉంది.  తమ కోసం నిర్మిస్తున్నట్టు చెప్పిన పునరావాస కాలనీ సిద్ధం కాలేదు. సి.ఎం. జ‌గ‌న్ ఇచ్చిన హామీలు  ఆచరణ రూపం దాల్చకపోవడంతో నిర్వాసితులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.

"ముఖ్యమంత్రి జ‌గ‌న్ మాటలు మాత్రమే మిగిలాయి. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో విఫలమయ్యారు. జాతీయ ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ కేంద్రం నాన్చుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నిలదీయలేకపోతోంది. ఫలితంగా నిర్వాసితులకు అన్యాయం జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల నిర్వాసితులు నష్టపోవాల్సి వస్తోంది.

- ఎం.కె. ఫ‌జ‌ల్‌

By
en-us Political News

  
ఒక లీటరు ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్‌లో సగటున 2.4 లక్షల ప్లాస్టిక్ ముక్కలు ఉంటాయట. నానో ప్లాస్టిక్ కణాలు శరీరంలో అనేక రకాల సమస్యలకు దారితీస్తాయి. పురుషులలో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. అటు మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంద‌ని, ప్రాణాంతక వ్యాధులపై బెర్లిన్ - జర్మనీలో జ‌రిగిన‌ మెడికల్ కాన్ఫరెన్స్ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.
ఏపీలో ఎన్నికల నేపథ్యంలో హింసాత్మక ఘటనలు జరగ్గా, పలువురు పోలీసు అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. బదిలీ అయిన వారి స్థానంలో ఈసీ నేడు కొత్త నియామకాలు చేపట్టింది. డీఎస్పీలుగా ఐదుగురిని, ఇన్ స్పెక్టర్లుగా ఏడుగురిని నియమిస్తూ ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేశ్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు.
జనం మొగ్గు ఎటువైపు ఉంది.. ఏ పార్టీ పట్ల జనంలో అభిమానం మెండుగా ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న సర్కార్ ఎన్నికలలో విజయం సాధించి మళ్లీ గద్దె ఎక్కుతుందా? లేక పరాజయం పాలై అధికారం కోల్పోతుందా వంటి ప్రశ్నలకు సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే సర్వేల మీద ఆధారడుతుంది.
ప్రభుత్వ అవినీతి, అక్రమాలతోపాటు ముఖ్య కారణంగా చెప్పుకోవలసింది ‘లాండ్ టైటిలింగ్ యాక్ట్’. జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఈ యాక్ట్ ద్వారా తమ భూములకు మొగుడై కూర్చుంటాడన్న భయం జనాన్ని వేధించింది. అందుకే అతన్ని సాగనంపేలా తీర్పు చెప్పారు.
ఆంధ్ర ప్రదేశ్ లో పోలింగ్ సందర్భంగానూ, ఆ తరువాత కొన్ని ప్రాంతాలలో హింస చెలరేగింది. దీంతో ఆయా ప్రాంతాలలో పరిస్థితిని అదుపు చేయడానికి నిరవధికంగా 144వ సెక్షన్ విధించారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రజల తీర్పు ఎలా ఉందో చెప్పడానికి ఒక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఫలితం చూస్తే సరిపోతుందని అంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచీ ఇదే ఓరవడి కొనసాగుతూ వస్తోంది. విభజిత ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రెండు ఎన్నికలలోనూ కూడా తూర్పు గోదావరి జిల్లా ప్రజల ఆదరణ పొందిన పార్టీయే అధికారంలోకి వచ్చింది. ఈ
 తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా 80 పరీక్ష కేంద్రాల్లో టెట్ నిర్వహించనున్నారు. టెట్ పరీక్షలు సోమవారం  నుంచి జూన్ 2వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన కవిత.. సుమారు 46 రోజులుగా తీహార్ జైల్లోనే ఉన్నారు. కోర్టు అనుమతితో పలు పుస్తకాలను చదువుతూ... ధ్యానం, ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్నారు.
పవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేదీ సినిమాలో చివరి పంచ్ మనదైతే ఆ క్కిక్కే వేరప్పా అని ఓ డైలాగ్ ఉంటుంది. సరిగ్గా ఇప్పుడు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, 2019 ఎన్నికలలో జగన్ విజయానికి కర్త, కర్మ, క్రియగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ అలాంటి కిక్ నే ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు.
 ఎపిలో సర్వేలన్నీ త్రికూటమి వైపే ఉన్నాయి. తెలుగు దేశం పార్టీ అధికారంలో రాబోతుందని జోస్యం చెబుతున్నాయి. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇదే విషయం చెబుతున్నారు. తాజాగా కాంగ్రెస్ నేతలు కూడా చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అంటున్నారు. ఏపీలో కూటమి విజయం సాధించబోతోందని తిరుపతి మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ జోస్యం చెప్పారు.
రాష్ట్రంలో హాట్ నియోజకవర్గాలలో ఒకటైన పిఠాపురంలో అత్యధికంగా 86.86శాతం పోలంగ్ నమోదైన సంగతి విదితమే. ఇక్కడ నుంచి జనసేనాని పవన్ కల్యణ్ పోటీ చేయగా ఆయనకు ప్రత్యర్థిగా వైసీపీ నుంచి కాకినాడ సిట్టింగ్ ఎమ్మెల్యే వంగా గీత బరిలోకి దిగారు.
దేశంలో ఈసారి సార్వత్రిక ఎన్నికలు మొత్తం 7 దశల్లో నిర్వహిస్తుండగా, ఇప్పటివరకు నాలుగు దశల పోలింగ్ పూర్తయింది. ఇటీవలే మే 13న నాలుగో దశ పోలింగ్ జరిగింది. ఇక, ఇవాళ దేశంలో ఐదో దశ పోలింగ్ ప్రారంభమైంది.  ఐదో విడతలో భాగంగా 6  రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 లోక్ సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఉత్తరప్రదేశ్ లో 14, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్ లో 7, బీహార్ లో 5, ఒడిశాలో 5, ఝార్ఖండ్ లో 3, జమ్మూకశ్మీర్ లో 1, లడఖ్ లో 1 లోక్ సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు
ఆదివారం నాడు హెలికాప్టర్ ప్రమాదానికి గురైన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం పాలైనట్టు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.