ఉచితాలతో ఎన్నికలకు ముడి.. అందుకే జగన్ ముందస్తు సవ్వడి!

Publish Date:May 7, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు అనివార్యమని తెలుగు వన్ మొదటి నుంచీ చెబుతూనే వస్తున్నది. అదే ఇప్పుడు జరగబోతున్నది. ఏపీలో ముందస్తు ముచ్చటే లేదని ఇప్పటి వరకూ చెబుతూ వస్తున్న వైసీపీ నేతలు ఇప్పుడు తమ నాయకుడు జగన్ మదిలో ముందస్తు ఆలోచన మెదులుతోందని అంగీకరిస్తున్నారు. ఏడాది ఏడాదిన్నరలో ఎన్నికలకు వెళ్లే అవకాశాలున్నాయని చెబుతున్నారు. పార్టీ అంతర్గత సంభాషణల్లోనో.. లేదా మిత్రులతో పిచ్చాపాటీ మాట్లల్లోనో ఎవరో మాట్లాడుకోవడం కాదు.. సాక్షాత్తూ ప్రభుత్వ సలహాదారు, ముఖ్యమంత్రి జగన్ కు సన్నిహితుడు అయిన సజ్జల రామకృష్ణారెడ్డే ఈ మాట చప్పారు. పైగా అక్కడా ఇక్కడా కాదు ఏకంగా మీడియా సమావేశంలోనే జగన్ ముందస్తు యోచన చేస్తున్నారనీ, ఏడాది, ఏడాదిన్నరలో ఎన్నికలకు వెళ్లడం దాదాపు ఖాయమని సజ్జల చెప్పారు. 

ఏపీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా జగన్ సర్కార్ కు ముందస్తుకు వెళ్లడం వినా మరో మార్గం లేదని తెలుగు వన్ ముందుగానే చెప్పింది. ఉచిత పథకాలతో  ఇంత కాలం నెట్టుకొచ్చిన జగన్ కు ఇక ముందు వాటిని కొనసాగించే పరిస్థితి లేకపోవడం, ఇప్పటికే ప్రజలలో తమ ప్రభుత్వ తీరు పట్ల అసహనం పెరిగిన నేపథ్యంలో ఉచితాలు కూడా కొనసాగించలేని పరిస్థితి వస్తే మొదటికే మోసం వస్తుందని జగన్ భావిస్తున్నారు. ఈ ఉచితాలు కొనసాగుతుండగానే ముందస్తుకు వెళ్లి ఎన్నికలలో లబ్ధి పొందాలన్నది ఆయన యోచన అని తెలుగువన్ ముందుగానే అంచనా వేసింది.

ఈ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి ముందస్తు యోచన వాస్తవమేనని చెప్పడంతో తెలుగువన్ చెప్పిందే జరుగుతోందని తేలిపోయింది.  పూర్తి కాలం జగన్ సర్కార్ అధికారంలో కొనసాగాలని భావిస్తే రెండేళ్ల తరువాత ఎన్నికలు వస్తాయి. అయితే అంత కాలం పాటు జగన్ కు ఉచితాలు కొనసాగించే పరిస్థితి లేదు. అందుకే ఏడాదిలోనే ఎన్నికలకు వెళ్లి.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందామనుకుంటున్నారు. ఒక అంచనా ప్రకారమైతే.. వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణతో పాటే ఏపీలోనూ ఎన్నికలు జరిగేలా జగన్ ముందస్తు ప్రణాళిక ఉండే అవకాశాలున్నాయి.  అలా అయితే సెంటిమెంట్ వర్కౌట్ అవ్వడంతో పాటు, ఉచిత పథకాలు కూడా పని చేసి తనకు విజయావకాశాలు మురుగౌతాయని జగన్ భావిస్తున్నారు. 

\ఒక వేళ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ముందస్తుకు వెళ్లాలని భావిస్తే వచ్చే ఏడాది ప్రధమార్థంలో అక్కడ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది.   అప్పుడు ఏపీలో కూడా నిర్దిష్ట గడువు కంటే ఏడాదిన్నర ముందుగానే ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది.  ముందస్తు సంకేతాలు ఇవ్వడం సజ్జల మీడియా సమావేశంతోనే మొదలు కాలేదు. గత కొద్ది కాలంగా ఏపీ మంత్రులు, వైసీపీ సీనియర్ నాయకులూ కూడా అడిగిన వారికీ, అడగని వారకీ ముందస్తు ప్రశక్తే లేదంటూ చెప్పడం కూడా ముందస్తు సంకేతాలిచ్చే ఉద్దేశంతోనే అని విశ్లేషకులు చెబుతున్నారు.  ఇక విపక్ష తెలుగుదేశం కూడా పాలనా వైఫల్యాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థతిని బేరిజు వేసి చూస్తే జగన్ ముందస్తుకు వెళ్లడం ఖాయమనే చెబుతూ వస్తోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు దాదాపు రెండు నెలల ముందే.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు.

జగన్ ముందస్తుకే మొగ్గు చూపుతారన్న అంచనాతోనే తెలుగుదేశం తన దూకుడును పెంచింది.   మొత్తం మీద ఏపీలో వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే ఎన్నికల నగారా మోగే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల కంటే ఏడాది, ఏడాదిన్నర ముందుగానే ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.

By
en-us Political News

  
చంద్రబాబు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెడీ కుమారస్వామి అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఉక్కుకర్మాగారం శంకుస్థాపన ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ డీ కుమారస్వామి అంతకు ముందు విశాఖలో మీడియాతో మాట్లాడారు.
రేంద్రమోడీ గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రాన్ని పాలించారు. దీంతో సోమవారం (మార్చి 23) నాటికి ఆయన పాలనా పగ్గాలు చేపట్టి 8932 రోజులైంది. అంటే అత్యధిక రోజుల పాటు రోజుల పాటు ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వహించి, దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా మోడీ కొత్త రికార్డు సృష్టించారు.
దేశ చరిత్రలో ప్రధానిగా ఎన్నికైన ఏకైక మహిళ ఇందిరాగాంధీ. దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘకాలం భారతదేశ ప్రధానిగా కొనసాగిన ఏకైక వనిత ఇందిరాగాంధీ. ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ తన హయాంలో తీసుకుని అమలు చేసిన నిర్ణయాలు ఓ సంచలనం.
వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం. వాస్తవానికి గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
తెలుగువన్ వాస్తవ వేదిక తాజా సంచికలో వివేక హత్య కేసుపై విస్తృత చర్చ జరిగింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
చంద్రబాబు కూడా పలు సందర్భాలలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదనీ, వారు తమ తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించిన విషయం తెలసిందే. అయితే ఏ సందర్భంలోనూ కూడా ఆయన పని తీరు బాగా లేని మంత్రుల పేర్లు వెల్లడించలేదు. ఇక బాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు మంత్రుల పని తీరును సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
పుట్టా మహూష్ ఇచ్చిన వివరణ ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులోతెలుగుదేశం పార్టీ నాయకుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి విదితమే ఈ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ గా స్పందించి.. పుట్టా మహేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పార్టీ హైకమాండ్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసి ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాని ఆదేశించింది.
ఆమె పోరాటం ప్రధానంగా తన తండ్రి కేసీఆర్, ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలపైనేనని విస్పష్ట సంకేతాలిచ్చేశాయి. డాడీ అంటే తన తండ్రి కేసీఆర్ అని, చిన్న మోదీ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పరోక్షంగా అయినా స్పష్టంగా చెప్పారు.
ఒకప్పుడు అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీలో కీలక నేతగా, ఆ పార్టీ అధినేత జగన్ కు సన్నిహితుడిగా, ఆయన కుటుంబ బంధువుగా బాలినేని శ్రీనివాసరెడ్డి చక్రం తిప్పారు. అయితే గత ఎన్నికలకు ముందు నుంచే వైసీపీలో బాలినేని పరిస్థితి పొమ్మనలేక పొగపెట్టిన చందంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.