ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్.. ఎందుకంటే?
Publish Date:Feb 9, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం (ఫిబ్రవరి 9) హస్తిన పర్యటనకు బయలు దేరుతున్నారు. ఈ సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి హస్తిన చేరుకుంటారు. రాత్రికి ఆయన హస్తినలో బసచేసి మంగళవారం (ఫిబ్రవరి10) కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విత్తమంత్రి నిర్మలా సీతారామన్, జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తదితరులతో ఆయన వేర్వేరుగా భేటీ కానున్నారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు బకాయిల విడుదల, పునరావాస ప్యాకేజీలు, కొత్త ప్రాజెక్టుల అనుమతులపై ఆయన కేంద్ర మంత్రులతో చర్చిస్తారు.కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయించిన నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన నిర్మలా సీతారామన్ ను కోరే అవకాశం ఉందం టున్నారు. అదే విధంగా జధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన బ్యాంకు రుణాల ప్రక్రియ, కేంద్రం నుంచి అందాల్సిన వివిధ రకాల గ్రాంట్లపై కూడా కేంద్ర మంత్రులతో చంద్రబాబు చర్చించనున్నారు. ఈ భేటీల అనంతరం మంగళవారం సాయంత్రం ఆయన ఢిల్లీ నుంచి బయల్డేరి విజయవాడ చేరుకుంటారు.
http://www.teluguone.com/news/content/ap-cm-cbn-delhi-tour-25-213738.html





