సంక్షోభాలే అవకాశాలు: చంద్రబాబు క్రైసిస్ మ్యాన్.. లోకేష్ డోలో 250 మ్యాన్.!

Publish Date:Sep 26, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుది దశాబ్దాల సుదీర్ఘ  ప్రస్థానం. క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటూ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో ఆయనకు ఆయనే సాటి. ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 

ఇక ఇప్పుడు చంద్రబాబు తనయుడు, తెలుగుదేశం కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేష్ సైతం అదే బాటలో నడుస్తున్నారు.   పారిశ్రామికవేత్తలు, ఇన్వెస్టర్ల సమస్యలను పరిష్కరించే విషయంలో లోకేష్  తనను తాను  డోలో 650 మ్యాన్ గా ఆయన అభివర్ణించుకున్నారు.  సాధారణంగా జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి సమస్యలకు  డోలో 650  తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. ఇదే విషయాన్ని ఉదహరిస్తూ నారా లోకేష్ తాను కూడా పారిశ్రామిక రంగంలో  అదే పాత్ర పోషిస్తున్నానని చమత్కరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలు, ఇన్వెస్టర్లకు ఇబ్బంది వస్తే.. తనకు ఫోన్ చేస్తారని, తక్షణమే ఆ సమస్యను పరిష్కరించేందుకు తాను ముందుంటానని లోకేష్ చెప్పుకొచ్చారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ పారిశ్రామిక రంగం జోరందుకుంది.  పెట్టుబడుల ప్రవాహం వరదనున తలపిస్తోంది. ఇదంతా లోకేష్ చొరవ ఫలితమే పరిశ్రమల ఏర్పాటులో ఎదురయ్యే అడ్డంకులను తొలగించడంలో, అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లడంలో లోకేష్ అనితర సాధ్యమన్న రీతిలో ముందుకు సాగుతున్నారు.

రాష్ట్రానికి  పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్న ప్రాజెక్ట్‌లను గ్రౌండింగ్ చేసే దశలో ఎలాంటి జాప్యం జరగకుండా లోకేష్ స్వయంగా పర్యవేక్షిస్తూ, పనులను పరుగులెట్టిస్తున్నారు.   ఇన్వెస్టర్లకు క్షేత్రస్థాయిలో  ఎదురయ్యే సమస్యలను ఎలాంటి జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, ఇన్వెస్టర్లలో భరోసా నింపుతున్నారు.  పెట్టుబడుల సాధనే ధ్యేయంగా ఆయన అనుసరిస్తున్న విధానం పారిశ్రామిక వర్గాల  ప్రశంసలు అందుకుంటోంది. వ్యాపార ప్రక్రియ వేగవంతంగా సాగేలా చూస్తూ, కొత్త అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా లోకేష్ అడుగులు వేస్తున్నారు. 

తండ్రి చంద్రబాబు నాయుడు రాజకీయ శైలి నుంచి లోకేష్ ఈ లక్షణాలను పుణికిపుచ్చుకున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది.  ప్రస్తుతం ఏపీలో సరికొత్త పారిశ్రామిక విధానాలు అమలవుతున్న తరుణంలో, ఇన్వెస్టర్లకు నారా లోకేష్ ఇస్తున్న  భరోసా ఏపీ సర్వతోముఖాభివృద్ధికి దోహదపడుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కేవలం రాజకీయ విమర్శలకు పరిమితం కాకుండా, రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకు రావడంలోనూ, ఆ క్రమంలో ఏవైనా సమస్యలు ఎదురైతే వాటిని అక్కడికక్కడే పరిష్కరించడంలోనూ లోకేష్ చొరవ తండ్రి చంద్రబాబును మించి ఉంటుందని పరిశీలకులు చెబుతు న్నారు. లోకేష్ తనకు తాను తగిలించుకున్న డోలో 650 మ్యాన్  ట్యాగ్ ఆయనకు అతికినట్లు సరిపోయిందంటున్నారు.  

 

[AP CM CBN Crisis Man, Nara Lokesh, Dolo 650 Man, AP Investments,  Investor Meet,  Andhra Pradesh Industries, Investments, Troubleshoot, Telugu One]

By
en-us Political News

  
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ఎండిన నదిలో గంగమ్మ పరవళ్లు.. కరువు నేలపై జలకళ.!
చెన్నైలో బీఎస్ఎఫ్ నూతన భవనాలను ప్రారంభించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
ప్రస్తుత కాలంలో డిజిటల్ మాధ్యమాలు విద్య, విజ్ఞానాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తున్నాయి.
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఒకింత జోరు తగ్గించిన వంగవీటి రాధా.. ఉన్నట్టుండి జనసేనానిని తో భేటీ అవ్వడం, అదీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేడి రగిలిన సమయంలో కలవడం వెనుక పక్కా వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఉద్యోగులను ఉత్సాహపరిచేందుకు ఓ యాజమాన్యం అనుసరించిన సరికొత్త మార్గం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోవర్స్, వ్యూయర్స్ సంపాదించాలనే పిచ్చి నేడు ఎంతోమంది యువతను తప్పుదారి పట్టిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.